పులివెందుల రైతుల‌ను ఆదుకోవాల‌ని జ‌గ‌న్ విన‌తి!

తాము అధికారంలోకి వ‌స్తే ఇప్పుడు న‌ష్ట‌పోయిన ప్ర‌తిరైతుకూ ఆర్థికంగా స‌హకారం అందిస్తామ‌న్నారు

గ‌త శనివారం భారీగా వీచిన గాలి, వ‌ర్షం, వడ‌గండ్ల‌కు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 4 వేల‌కు పైగా ఎక‌రాల్లో కోత‌కు వ‌చ్చిన అర‌టి పంట దెబ్బ‌తిన్న‌ద‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లింగాల మండ‌లంలోని తాతిరెడ్డిప‌ల్లెలో నేల‌కూలిన అర‌టి తోట‌ల్ని ఆయ‌న ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ రైతుల‌కు సాయం అందించేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే తాను వ‌చ్చాన‌న్నారు. రైతుల‌పై కూట‌మి ప్ర‌భుత్వం క‌ప‌ట ప్రేమ చూపుతోంద‌ని విమ‌ర్శించారు. రైతులు భారీగా న‌ష్ట‌పోయార‌ని, ప్ర‌భుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆదుకోవాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. కూట‌మి ప్ర‌భుత్వంలో ఉచిత పంట‌ల బీమా ఎత్తివేశార‌న్నారు. త‌మ హ‌యాంలో పంట‌ల బీమా రైతుల హ‌క్కుగా వుండేద‌న్నారు. అలాగే రైతుల‌కు సున్నావ‌డ్డీ రుణాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

అర‌టి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబ‌ర్ వ‌న్ స్థానంలో వుంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వంలో రూ.25 కోట్ల‌తో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ ప్ర‌భుత్వం వాటిని వాడుకోలేక‌పోతోంద‌ని విమ‌ర్శించారు. యూజ‌ర్ ఏజెన్సీకి అప్ప‌గించి వుంటే న‌ష్టం జ‌రిగేది కాద‌న్నారు. క‌నీసం ఈ ప్ర‌భుత్వం రైతుల‌కు ఇన్‌ఫుట్ స‌బ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

తాము అధికారంలోకి వ‌స్తే ఇప్పుడు న‌ష్ట‌పోయిన ప్ర‌తిరైతుకూ ఆర్థికంగా స‌హకారం అందిస్తామ‌న్నారు. త‌మ పార్టీ త‌ర‌పున న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఎంతోకొంత సాయం అందిస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే కూట‌మి పాల‌న ఏడాది అవుతోంద‌న్నారు. మ‌రో మూడేళ్లు గ‌ట్టిగా క‌ళ్లు మూసుకుంటే, వైసీపీ పాల‌నే వ‌స్తుంద‌న్నారు. అప్పుడు రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

19 Replies to “పులివెందుల రైతుల‌ను ఆదుకోవాల‌ని జ‌గ‌న్ విన‌తి!”

  1. మ్మెల్యే గారు తన నియోజకవర్గం లో జరిగిన నష్టం మీద ఒక అంచనా వేసి ముఖ్యమంత్రి లేదా వ్యవసాయ శాఖ మంత్రి ని కలిసి వినతి పత్రం ఇవ్వలి కాని ఇలా మీడియా ముందు నాలుగు ఏళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో నేను లేస్త అని గాలి మేడలు ఏందో?

  2. ఇంతకీ అదే పులివెందుల లో తన హయాములో పాద పనులు చేసి బిల్లులు రాక మునిగినా కాంట్రాక్టర్లకి తానూ గెలిచాయాక ఏమి చేస్తాడో చెప్పనే లేదు

  3. గట్టిగా నాలుగేళ్ళు కళ్ళు మూసుకొండి ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో మనమే గెలుస్తాం..

    మళ్లీ ఓడితే ఇంకో ఐదేళ్లు కళ్ళు మూసుకొండి ఎన్నికలు వస్తాయి అప్పుడు తప్పకుండా గెలుస్తాం..

  4. సరే కానీ రెడ్ కార్పెట్ ఎక్కడ… దారి లో చెట్లు అవి కొట్టించారా??? ఐపాక్ స్క్రిప్ట్ జనాలు రాలేదా???

  5. మావోడికి సడన్ గా తెల్ల గడ్డం వచ్చిందే??.. ఇన్నాళ్లు నవ యువకుడు అన్నారు?? ఏంటీ సడెన్ మార్పు..

    ఎక్కడికీ పోయినా వెనుక, రతీ ర0కు మొగుడు కామన్, ఈడి డైలాగులూ కామన్

  6. స్వాతంత్రం వచ్చినప్పుటినుండి పులివెందులని ఒకరితర్వాత ఒకరు మీరే ఎలుతున్నారు కదరా.. కానీ ఇంతవరకు ఒక్క డ్యామ్ కట్టడం కానీ, కాలువ తవ్వి కనీసం ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదు కదరా.. తూ

    పులివెందులకి ఈడీ అచీవ్మెంట్ ఏందయ్యా అంటే.. చెబితే మీరు నవ్వుతారు.. అందుకే చెప్పను బ్రదర్.

  7. వీడు కాజేసిన డబ్బులో కనీసం ఒక పైసా వంతు అయిన వాళ్ళకి ఐతే, కోటీశ్వరులు అవుతారు.

    అయినా మన మా*డ గాడు , సొంత జేబులో డబ్బు తీయడు.

  8. అసెంబ్లీ కి వెళ్ళు. ప్రభుత్వం తో పోట్లాడి సాధించు. ఈ కుంభకర్ణుడి షెడ్యూల్ ఏంటి? నష్ట పోయిన రైతు 4 సంవత్సరాల పాటు ఎలా మనుగడ సాగించగలడు?

  9. 2019-24 మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడు కాదు కదా కనీసం ఎం. ఎల్. ఏ.గా కూడా గెలవలేదు. అయినా కౌలు రైతులకి తన చేతి డబ్బు ఇచ్చి ఎంతో కొంత మంచి పేరు తెచ్చుకున్నాడు. మొన్న ఎన్నికల ఎఫిడవిట్ లో పవన్ నికర ఆస్తి విలువ 99 కోట్లు కాగా జగన్ నికర ఆస్తి 720 కోట్లు.

Comments are closed.