కూటమిని వణికిస్తున్న జేడీ!

విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచి చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తీరా ఎన్నికల వేళకు మనసు మార్చుకుని ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆయన…

విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచి చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తీరా ఎన్నికల వేళకు మనసు మార్చుకుని ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆయన అన్ని లెక్కలూ సరిచూసుకుని పోటీకి దిగారు అని అంటున్నారు.

ఉత్తరంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు ఉన్నారు జేడీ సొంత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జేడీ జనసేన నుంచి ఎంపీగా పోటీ చేశారు అలా జనసేన నేతలతో ఆయనకు ఉన్న పరిచయాలు ఉపకరిస్తాయని అంటున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం యువత ఉద్యోగులు ఉన్న ఏరియాగా ఉత్తరం ఉంది.

దాంతో తాను ప్రజల గొంతుకను అవుతాను అని జేడీ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఆయన జై భారత్ అని సొంతంగా పెట్టిన పార్టీ నుంచి పోటీకి దిగుతున్నారు. జేడీ పోటీ నామమాత్రంగా తీసుకునే అవకాశం లేదు అని అంటున్నారు.

ఆయన గెలుస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే జేడీ భారీ ఎత్తున ఓట్లను మాత్రం చీలుస్తారు అని అంటున్నారు. ఆ చీల్చే ఓట్లు కూటమికే తూట్లు పొడుస్తాయని అంటున్నారు. జనసేన ఈ సీటుని ఆశించింది దక్కపోవడం.. బీజేపీకి ఇవ్వడంతో ఆ పార్టీలో కొంత అసంతృప్తి ఉంది అని అంటున్నారు. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా నిరాశలో ఉన్నారు.

ఇవన్నీ కలసి జేడీకి అనుకూలంగా మారుతాయని అంటున్నారు. సామాజిక వర్గ పరంగా చూస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కేకే రాజు, బీజేపీ అభ్యర్ధి విష్ణు కుమార్ రాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉన్న ఈ నియోజకవర్గంలో అన్నీ చూసుకునే జేడీ ముగ్గులోకి దిగారని అంటున్నారు.

జేడీ ప్రచారం చాప కింద నీరులా సాగుతూ కూటమిని బెంబేలెత్తిస్తోంది అని అంటున్నారు. జేడీ చీల్చే ప్రతీ ఓటూ కూటమికి దక్కకుండా పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. జేడీ వల్ల బీజేపీ అభ్యర్ధికే నష్టం వైసీపీ గెలుపుని ఇబ్బంది పెట్టలేవని కేకే రాజు అంటున్నారు. ఈసారి ఉత్తరం సీటులో పోటీ రసవత్తరంగా మారుతోంది.

జేడీ ఎలాగైనా గెలిచి అసెంబ్లీకి వెళ్తాను అంటున్నారు. తాను పవన్ కళ్యాణ్ తో ఎక్కడా విభేదించలేదని చెబుతూ ఆయన ఆయన పార్టీ క్యాడర్ మద్దతు కోసం చూస్తున్నారు. తానూ పవన్ అసెంబ్లీలో కలుసుకుంటామని జేడీ చెబుతూ జనసేనని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జేడీ పోటీతో బీజేపీకి ఉత్తరాన కంగారు అయితే స్టార్ట్ అయింది అని అంటున్నారు.