గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీచేస్తున్నారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోయినప్పటికీ.. ఆలపాటికి గెలుపు అంత సులువుగా దక్కుతుందని అనుకోలేని పరిస్థితి. వామపక్షాల అభ్యర్థి లక్ష్మణరావునుంచి ఆయన గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయన ఓటమికోసం కొందరు నాయకులు, తన సొంత సామాజికవర్గానికి చెందిన వారు కూడా తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
అదే సమయంలో.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గనుక ఓడితే.. అందులో ఆయన నియోజకవర్గం తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర కూడా గణనీయంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం వారికి ఎమ్మెల్సీ పదవులు దక్కడంలో.. అటు జనసేనాని పవన్ కల్యాణ్, జనసేనలో నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కూడా ఒకటే విధానం అనుసరిస్తున్నారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
పిఠాపురంలో వర్మ నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొని.. చివరకు చంద్రబాబు ద్వారా ఎమ్మెల్సీ పదవి ఎర వేయించి.. అక్కడ పోటీచేసి, ఆయన మద్దతు కూడా పొంది మొత్తానికి పవన్ గట్టునపడ్డారు. ఆ పార్టీ నెంబర్ టూ నాదెండ్లకు కూడా సేమ్ టూ సేమ్ అదే పరిస్థితి ఎదురైంది. తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను పక్కన పెట్టించి.. ఆ టికెట్ దక్కించుకున్న మనోహర్, ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆశ చూపించేలా చేశారు.
ఎన్నికలు అయిన నాటి నుంచి వివిధ అవకాశాలు వచ్చినప్పటికీ.. పిఠాపురం వర్మకు మాత్రం ఎమ్మెల్సీ అవకాశం దక్కనేలేదు. తన నియోజకవర్గంలో చట్టసభ ప్రతినిధిగా మరో అధికార కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే.. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కల్యాణ్ అడ్డుపడుతున్నట్టుగా పుకార్లు పుట్టాయి. అదే సమయంలో.. ఆలపాటి రాజా విషయంలో చంద్రబాబు.. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన పోటీలో ఉండగా.. నాదెండ్ల మనోహర్ కూడా తన బాస్ పవన్ కల్యాణ్ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్టు సమాచారం.
తన నియోజకవర్గంలో మరొక అధికార కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతో.. ఆలపాటి రాజాను ఓడించడానికి తెరవెనుక వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి ఆయన అక్కడకు వెళ్లి తమ పార్టీ వారితో సమావేశాలు పెడుతున్నారు గానీ.. అంతే సమానంగా ఆలపాటి ఎన్నిక గురించి ఫోకస్ పెట్టడం లేదని సమాచారం. ఈ రెండు జిల్లాల్లో కాపులు ఆలపాటికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి నిర్ణయించుకోవడంలో కూడా నాదెండ్ల జోక్యం చేసుకోవడం లేదని, వారిని బుజ్జగించడానికి ప్రయత్నించలేదని సమాచారం.
తన సొంత నియోజకవర్గంలో కూడా.. తన వర్గం నుంచి ఆలపాటికి మద్దతు దక్కకుండా లోలోన పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆలపాటి ఓడిపోతే.. నియోజకవర్గంలో తన ఆధిపత్యానికి ఎదురుండదనేది ఆయన ఆలోచన. ఆలపాటికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్టూ ఉంటుంది.. ఆయన ఓడిపోతే మళ్లీ అడిగేందుకు కూడా ఉండదు. ఆ రకంగా తనకు ఇక ఎదురుండదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
ఈ ఆర్టికల్స్ అన్నీ బుక్మార్క్ చేసి పెట్టుకొంటున్నా..
రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి గెలిస్తే.. ఉంటుంది రా నీకు.. నా కామెంట్స్ చదవలేక సూసైడ్ చేసుకొంటావు .. కొండనాకొడకా..
ముందు నువ్వు నుంచొకుండా ఎందుకు పారిపొయావొ చెప్పు!!