అప్పుడెప్పుడో గెలుపు బాధ్య‌త‌ను వ‌ర్మ చేతిలో పెట్టిన‌ట్టున్నారే!

వ‌ర్మ లేనిదే ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని తెలిసి, అప్పుడేమో బాధ్య‌త‌ల‌న్నీ ఆయ‌న భుజాల‌పై వేశార‌ని జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏరుదాటే దాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. ఏరు దాటాక బోడి మ‌ల్ల‌న్న సామెత‌ను పిఠాపురం వ‌ర్మ విష‌యంలో జ‌న‌సేన వైఖ‌రి వుంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. వ‌ర్మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో టీడీపీ శ్రేణులు కుత‌కుత‌లాడుతున్నాయి. పుండుమీద కారం చ‌ల్లిన‌ట్టుగా జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కామెంట్స్ ఉండ‌డంపై వ‌ర్మ అభిమానులు ర‌గిలిపోతున్నారు.

వ‌ర్మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంపై మంత్రి నాదెండ్ల కీల‌క కామెంట్స్ చేశారు. పిఠాపురం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అడ్డా అన్నారు. ఎమ్మెల్సీ ప‌ద‌వి ఎవ‌రికి ఇవ్వాల‌న్న‌ది ఆయా పార్టీల నిర్ణ‌య‌మ‌న్నారు. అలాగే మండ‌లికి ఎవ‌రిని పంపాల‌న్న‌ది టీడీపీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌మ‌న్నారు. వ‌ర్మ చాలా సీనియ‌ర్ నాయ‌కుడ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వ‌ర్మ‌కు చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం త‌మ‌కేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వ‌ర్మ‌ని గౌర‌వించ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు.

అయితే వ‌ర్మ‌ను మంచి చేసుకోడానికి ఎన్నిక‌ల సంద‌ర్భంలో ప‌వ‌న్ ఏం చెప్పారో జ‌నాలు నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు గుర్తు చేసి మ‌రీ విమ‌ర్శిస్తున్నారు. త‌న గెలుపు బాధ్య‌త‌ను నీ చేత‌ల్లో పెడుతున్నాన‌ని వ‌ర్మ‌తో ప‌వ‌న్ అన్న వీడియోను తెర‌పైకి తెచ్చి, నేడు పిఠాపురం అడ్డా అంటారా? అని టీడీపీ కార్య‌క‌ర్త‌లు నిల‌దీస్తున్నారు.

రోజుకో రీతిలో మాట్లాడ్డం మీకే చెల్లింద‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వ‌ర్మ లేనిదే ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని తెలిసి, అప్పుడేమో బాధ్య‌త‌ల‌న్నీ ఆయ‌న భుజాల‌పై వేశార‌ని జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్పుడు వ‌ర్మ‌తో అవ‌స‌రం లేద‌ని, పిఠాపురం ప‌వ‌న్ అడ్డా అన‌డం దేనికి సంకేతామ‌ని నిల‌దీస్తున్నారు.

22 Replies to “అప్పుడెప్పుడో గెలుపు బాధ్య‌త‌ను వ‌ర్మ చేతిలో పెట్టిన‌ట్టున్నారే!”

  1. చివరి నిమిషం లో ఈయన్నీ తప్పించడం ఎందుకు, ముందే కొన్ని నెలలు అతనికి టైం ఇవ్వాల్సింది. అప్పుడు అతని దారేదో అతను చూసుకునేవాడు.

  2. https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/ex-mla-svsn-varma-comments-on-mlc-elections/1701/125044357

    ఏ పార్టీ గెలవడానికైనా … 3-4 శాతం ఓట్లు మాత్రమే కారణమవుతాయి కనుకనే వైసీపీ కి 39.37% ఓట్ల శాతం ఇంకా వుంది. టీడీపీ కి వచ్చిన 45.6 శాతం ఓట్లలో 6.85 శాతం జనసేన ఓట్లు బదలాయింపు అనుకుంటే.. టీడీపీ సాధించింది 38.75% మాత్రమే అందుకే పవన్ కళ్యాణ్ విలువ తెలిసిన చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటున్నాడు. అలాగే జనసేన పోటీ చేసిన ప్రతి చోట టీడీపీ ఓట్ల బదలాయింపు కూడా బాగా జరిగింది కనుకనే జనసేన లాభపడింది.

    ఇక పొతే వర్మ ని తప్పుకోమన్నది , ఎమ్మెల్సీ ఇస్తానన్నది చంద్రబాబు.. అది వాళ్ళ పార్టీ గోల .. వర్మకి జరిగింది కరెక్ట్ కాదు. కానీ న్యాయం చేయాల్సినది టీడీపీ! పవన్ కాదు!!!

    వర్మ తన కోపం పవన్ మీద కానీ జనసేన మీద కానీ చూపిస్తే.. పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కి చుక్కలు చూపించగలడు. అందుకే వర్మని బుజ్జగిస్తున్నది టీడీపీ. అతను ఈ వ్యాఖ్య రాసే టైంకి బాగానే ఉన్నాడు. GA కి మాత్రం కడుపు ఉబ్బరం తగ్గట్లేదు. ఇది ఇంతే !!

    1. ఎన్నికల వేళ పబ్లిక్ గా చేతులు పట్టుకొని అర్ధించినవాళ్లు ఎవరో ప్రజలు చూసారు.

      బాబు గారు వర్మ చేతులు పట్టుకోలేదు.

    1. వర్మ చేతులు పట్టుకుంది పవన్

      నయం చెయ్యాల్సింది బాబు

      ఎలా వుంది ట్విస్ట్!!

  3. మాకు తెలుసు వర్మ గారిని ఎలా గౌరవించుకోవలో..నీ బోడి..గు..ద్ద సానుభూతి మాకు అక్కర్లేదు GA.

  4. 100% ఏకీభవిస్తున్నాం నాదేండ్ల గారు…కచ్చితంగా అది టీడీపీ అంతర్గత వ్యవహారమే.బాధలో ఉన్నోళ్లు రెండు మాటలు ఏదో అంటారు.. అది పార్టీ స్టాండ్ కాదు.కానీ ఈ లోపే ఏందో హుందాతనం ప్రదర్శించే మీరు అడ్డా అని..కింద తమ్ముడు ఎవరో చుక్కలు చూపిస్తాం అని..ఇలా మాట్లాడటం సరికాదేమో.చకోర పక్షుల కి అవకాశం ఇవ్వ కూడదు మనం.సీబీన్ పవన్ కరెక్ట్ గా వున్నారు..వుండాలి.. రాష్ట్రం కోసం..మన యువత భవిత కోసం.👍

  5. Reddy, కందకి లేని దురద కత్తి పీట కెందు అని సమేత.
    నువ్వు 'ఆప్ కా నామ్ క్యా హై' సోము వీర్రాజు సంగతి చూసుకో
  6. Reddy, కందకి లేని దురద కత్తి పీట కెందు అని సమేత.

    నువ్వు ‘ఆప్ కా నామ్ క్యా హై’ సోము వీర్రాజు సంగతి చూసుకో

  7. కందకి లేని దురద కత్తి పీట కెందు అని సమేత.
    నువ్వు 'ఆప్ కా నామ్ క్యా హై' సోము వీర్రాజు సంగతి చూసుకో
  8. “కందకి లేని దురద కత్తి పీట కెందు”కని

    నువ్వు ‘ఆప్ కా నామ్ క్యా హై’ సోము వీర్రాజు సంగతి చూసుకో

Comments are closed.