కేంద్రం పూచీ.. అమ‌రావ‌తికి రూ. 15 వేల కోట్ల అప్పు!

కేవ‌లం ప‌ది శాతం మాత్ర‌మే …అంటే రూ.1500 కోట్లు తాము గ్రాంట్ కింద ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

కేంద్రంలో మూడో ద‌ఫా మోదీ స‌ర్కార్ కొలువుదీర‌డంలో టీడీపీ క్రియాశీల‌క పాత్ర పోషించింది. దీంతో రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కార్ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల్ని రాబ‌డుతుంద‌ని అంతా అనుకున్నారు. అబ్బే, అలాంటి ప‌రిస్థితి అస‌లు క‌నిపించ‌డం లేదు. రాజ‌ధాని అమ‌రావ‌తికి ఇంత వ‌ర‌కూ కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? అలాగే ఇవ్వ‌బోయే నిధులెన్ని? అవ‌న్నీ గ్రాంట్సా? లేక ఇత‌ర‌త్రా ఏమైనా వుందా? అనే విష‌యాల‌పై తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి సంధించిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వం లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చింది.

రాజ‌ధాని అమ‌రావ‌తిలో అసెంబ్లీ, స‌చివాల‌యం, రాజ్‌భ‌వ‌న్ తదిత‌ర భ‌వ‌నాల నిర్మాణాల‌తో పాటు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.2,500 కోట్ల గ్రాంట్స్ ఇచ్చిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. అంటే ఈ మొత్తాన్ని తిరిగి కేంద్రానికి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. కానీ వ‌ర‌ల్డ్ బ్యాంక్‌, ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్‌లు అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు తాము పూచీక‌త్తుగా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తామ‌ని కేంద్రం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

రాజ‌ధానికి రుణం ఇచ్చేందుకు ఆ సంస్థలు అంగీక‌రించాయ‌ని, కానీ ఇంత వ‌ర‌కూ నిధులు మంజూరు చేయ‌లేద‌ని మోదీ స‌ర్కార్ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇందులో కేవ‌లం ప‌ది శాతం మాత్ర‌మే …అంటే రూ.1500 కోట్లు తాము గ్రాంట్ కింద ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే రాజధాని నిర్మాణాన్ని తాము ప‌ర్య‌వేక్షిస్తామ‌ని కూడా కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ఇదిలా వుండ‌గా జనవరి 22, 2025 నుంచి వరల్డ్ బ్యాంక్ అప్పులు, ఫిబ్రవరి 10 , 2025 నుంచి ఏషియన్ డెవల‌ప్‌మెంట్ బ్యాంక్ అప్పులు అమల్లోకి వస్తాయని మోదీ స‌ర్కార్ తెలియ‌జేసింది. ఏపీ అప్పుల సీలింగ్ పరిధిలోకి రాజధాని అప్పుల వ్యయం రాదని కూడా ప్ర‌భుత్వం పేర్కొంది.

24 Replies to “కేంద్రం పూచీ.. అమ‌రావ‌తికి రూ. 15 వేల కోట్ల అప్పు!”

  1. అప్పుడేమో 15 వేల కోట్లు గ్రాంటు అన్నారు. ఇప్పుడేమో అప్పు అంటున్నారు.

    AP ప్రజలను ఎన్ని సార్లు VP ప్రజలను చేస్తారు ?

  2. మా అన్నయ్య అయితే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి నిధులు తెచ్చేవాడు ఇప్పుడు గనుక అధికారంలో ఉంటే అంటున్న జీఏ

  3. కేంద్రం పూచి లేకపోతే రాజధానికి అప్పు పుట్టని పరిస్థితి అని అర్థం అయ్యింది ప్రజలకి.

    అంటే బాబుగారి చాణక్యం లో పస అయిపొయింది అని అర్థం అవుతుంది.

  4. Blue fox cbn Pasupu kumkuma appu 60, 000 crores..

    adi tdp pigs dochukunnaru…adi vere sangathi anuko..

    ippudu bramaravathi ante mari entha chesthado?

Comments are closed.