వ‌చ్చే ఏడాది ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు

వ‌చ్చే ఏడాది జూన్ లేదా జూలై నెల‌ల్లో మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యాన్ని మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ తెలిపారు

వ‌చ్చే ఏడాది జూన్ లేదా జూలై నెల‌ల్లో మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విష‌యాన్ని మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ తెలిపారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఆయ‌న మాట్లాడుతూ వైసీపీ హ‌యాంలో మున్సిపాల్టీల్లో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గాడిలో పెట్టామ‌న్నారు. మున్సిపాల్టీకి స‌క్ర‌మంగా ప‌న్నులు చెల్లించాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు.

ఇదిలా వుండ‌గా కొన్ని మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల ఎన్నిక‌ల‌పై కోర్టుల్లో వివాదాలు ఉన్నాయ‌న్నారు. వాటిని ప‌రిష్క‌రించాకే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం ఖజానా ఖాళీ చేసింద‌న్నారు. అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సంప‌ద‌ను సృష్టించే విధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.

వైసీపీ హ‌యాంలో ప్ర‌జ‌లు చెల్లించిన ప‌న్ను రూ.3,200 కోట్లు పురపాల‌క సంఘాల‌కు ఇవ్వ‌లేద‌న్నారు. ఇప్ప‌టికే తొలి విడ‌త‌గా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చిన‌ట్టు మంత్రి తెలిపారు. రెండో విడ‌త కూడా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు మంత్రి తెలిపారు.

రానున్న ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్న వైసీపీ కార్పొరేట‌ర్లు, వార్డు స‌భ్యులు టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లో చేరారు. మ‌రికొంద‌రు చేర‌డానికి సిద్ధంగా ఉన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై మంత్రి ప్ర‌క‌ట‌న‌తో ఇప్ప‌టి నుంచే కూట‌మి నేత‌ల మ‌ధ్య పోటీ ఏర్ప‌డే అవ‌కాశం వుంది.

7 Replies to “వ‌చ్చే ఏడాది ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు”

  1. ఎన్నికలు పెట్టండి super 6 ఎగొట్టినందుకు కర్రు కాల్చి వాత పెట్టడానికి ready only గ్యాస్ promise కొంత నిలబెట్టుకొన్నారు అది కూడా ప్రతి ఇంటికి గ్యాస్ free అని మేనిఫెస్టో లో పెట్టి కేవలం కొందరికి అమలు budget లో కేటాయింపు లు చాలా తక్కువ

  2. జగ్గడు లా విపక్షాల ని నామినేషన్ వేయకుండా అడ్డుకోమ్….ఎక్కడా దాడులు చెయ్యం..వాడికి చేతనైతే dobule డిజిట్ మున్సిపాలిటీ లేదా సింగల్ డిజిట్ కార్పొరేషన్ గెలుచుకోమను.

  3. జ..గ్గా..డిలా విపక్షాలని నామినేషన్ వేయకుండా అడ్డుకోమ్…దౌర్జ్ఞ్యన్యా..లు చెయ్యం.. వా..డికి చేతనైతే డబల్ డిజిట్ మున్సిపాలిటీ లేదా సింగల్ డిజిట్ కార్పొరేషన్ గెలుచుకోమను.

    1. Water body elections lo tdp chestundi emitoo. Neeti jaati leni mee tdp neetilu chepte ela brother? Revanth 1 week lo free bus iste 7 months aina free bus ivvaleni daddamma government kutanidi… Mundu super 6 ivvandi

Comments are closed.