కోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!

ఒకానొక కాలంలో మహిళంటే బలహీనులు. అబలలు. వంట ఇంటికే పరిమితమైనవారు. తక్కువగా చదువుకునేవారు లేదా అసలు చదువుకోకపోయేవారు. అలా అనడం కంటే చదివించకపోయేవారు అనడం కరెక్టు. బాల్య వివాహాలు జరిగేవి. ఇలా చెప్పుకుంటూ పొతే…

ఒకానొక కాలంలో మహిళంటే బలహీనులు. అబలలు. వంట ఇంటికే పరిమితమైనవారు. తక్కువగా చదువుకునేవారు లేదా అసలు చదువుకోకపోయేవారు. అలా అనడం కంటే చదివించకపోయేవారు అనడం కరెక్టు. బాల్య వివాహాలు జరిగేవి. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా పెద్ద కథ అవుతుంది.

అనేక కారణాలతో, చట్టాలతో మహిళలు అన్ని రంగాల్లోనూ చాలా ఎదిగారు. డెవెలప్ అయ్యారు. కొన్ని అణిచివేత ఘటనలు జరుగుతున్నా, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా మహిళలు విద్యాపరంగా, ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగారనేది కాదనలేం.

ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని తీహార్ జైల్లో ఉన్న కవిత నానా విధాలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు సఫలం కాలేదు. ఎందుకంటే ఆమె బలహీనురాలు కాదు. చదువుకుంది. పొలిటీషియన్. ఒకప్పుడు ఎంపీ. ఇప్పడు ఎమ్మెల్సీ, తండ్రి గొప్ప పొలిటికల్ లీడర్, ఒక పార్టీకి చీఫ్. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.

ఇంత నేపథ్యం ఉన్న కవిత బెయిల్ కోసం ఆమె చెబుతున్న కారణాలను ఏ కోర్టు కూడా ఒప్పుకోవడంలేదు. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఢిల్లీ హై కోర్టు కాదంది. చివరకు సుప్రీం కోర్టు కూడా రిజెక్ట్ చేసింది. కింది కోర్టులో, హై కోర్టులో రకరకాల కారణాలతో బెయిల్ పిటిషన్లు వేసింది. పిల్లగాడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి తాను దగ్గరుండి చదివించాలంది. రిజెక్ట్, ఆరోగ్యం బాగాలేదంటూ రకరకాల అనారోగ్యాలు చెప్పింది రిజెక్ట్. ఇక్కడే అంటే ఢిల్లీలోనే వైద్యం చేయించుకొమ్మన్నారు.

ఎన్నికల సమయంలో తాను పార్టీకి స్టార్ క్యాంపెయిర్ ను అని, కాబట్టి ప్రచారం చేయాలని చెప్పింది రిజెక్ట్. ఇలా పలు రకాల కారణాలతో బెయిల్ అడిగింది. చివరకు సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అక్కడా రిజెక్ట్. సెక్షన్ 45 ప్రకారం ఓ మహిళగా తనకు బెయిల్ ఇవ్వాలని అడిగింది. దానికి సుప్రీం కోర్టు “కవిత రాజకీయవేత్త. బాగా చదువుకున్న వ్యక్తి. ఆమె దుర్బలమైన మహిళ కాదు” అని చెబుతూ బెయిల్ రిజెక్ట్ చేసింది.

అంటే మహిళ అనే కారణంతో బెయిల్ అడగడానికి అవకాశంలేదని చెప్పిందన్న మాట. ఆమె మాజీ ఎంపీ అని కూడా ఆమె లాయర్లు కోర్టుకు గుర్తు చేశారు. సీఎం కేజ్రీవాల్‌నే జైల్లో వేసినప్పుడు మాజీ ఎంపీ ఎంత? ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు చెల్లుతాయేమోగానీ బెయిల్ విషయంలో చెల్లవు.

కవిత పాత కాలపు మహిళ కాదు, ఆధునిక మహిళ, తెలివితేటలు ఎక్కువగా ఉన్న మహిళ. కాబట్టి కోర్టు కేసుల్లో మహిళలకు రిజర్వేషనులు ఉండవనే కవితకు తెలిసి ఉండాలి. కానీ మహిళ అనే పేరుతో బాణం వేశారు అది గురి తప్పింది.

లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని సీబీఐ, ఈడీ నిర్ధారించుకొని ఆమెను విచారించాలనుకున్నప్పుడు ఢిల్లీకి రావాలని నోటీసులు పంపారు. కానీ కవిత తిరస్కరించింది. ఆడవాళ్లను విచారణకు పిలవడమేమిటని ప్రశ్నించింది. తాను రానని, ఇంటికే వచ్చి విచారించాలని డిమాండ్ చేసింది. చాలాసార్లు నోటీసులు ఇచ్చారు, మొండికేసింది. కోర్టులో పిటిషన్ వేసింది. చివరకు అధికారులు హైదరాబాదుకు వచ్చారు. అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోయారు. అంతే …లోపల వేశారు. ఇప్పటికి ఐదు నెలలు గడిచిపోయాయి. బెయిల్ విషయం ఈ నెల ఇరవయ్యో తేదీన విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు చెప్పింది.

8 Replies to “కోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!”

  1. ఆడది అయ్యుండి లిక్కర్ స్కాం చేసింది ఇంక వేరే ఏమీ దొరకనట్టు. మళ్ళీ నేను మహిళను అని బెయిల్ అడగడం ఒకటి.

  2. తల్లి తండ్రుల పాపాలు ఎక్కడికీ పోవు అనటానికి, కవితక్క ఉదాహరణ. కానీ బెయిల్ రాక పోతుందా, సిఏం అవ్వకపోతుందా. ఎన్నో చూసాం.

Comments are closed.