త‌ప్పు నానాజీది కాదు…!

కూట‌మి నేత‌ల దౌర్జ‌న్యాల గురించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది. రాయ‌ల‌సీమ‌, కోస్తా, ఉత్త‌రాంధ్ర అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నేత‌లు చెల‌రేగిపోతున్నారు. మొన్న శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి, నిన్న…

కూట‌మి నేత‌ల దౌర్జ‌న్యాల గురించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది. రాయ‌ల‌సీమ‌, కోస్తా, ఉత్త‌రాంధ్ర అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి నేత‌లు చెల‌రేగిపోతున్నారు. మొన్న శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి, నిన్న కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే పంతం నానాజీ… అంత‌కు ముందు ఎవ‌రో మ‌నంద‌రికీ తెలుసు.

అయితే వీళ్లంతా అధికారంలో లేన‌ప్పుడు మంచి వాళ్లే. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే రౌడీయిజం చేస్తున్నారు. తాము చెప్పింది వినక‌పోతే, ముందూ వెనుకా ఆలోచించ‌కుండా స్వయంగా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు దౌర్జ‌న్యాలు దిగడాన్ని చూశాం. అయితే గతంతో పోలిస్తే, ఇప్పుడు కాస్త ఎక్కువయ్యాయి. అది కూడా వంద రోజుల పాల‌న‌లోనే అరాచ‌కాలు పెరిగాయ‌నే చెడ్డ పేరు తెచ్చుకున్నారు.

కూట‌మి నేత‌ల‌తో దౌర్జ‌న్యాలు చేయిస్తున్న‌ది అధికార‌మే. అదే లేక‌పోతే పిల్లుల్లా ఇళ్ల‌లో మూలుగుతూ చేతులు ముడుచుకుని కూచునేవారు. అంద‌రూ చూస్తుండానే కాకినాడ‌లో ప్ర‌ముఖ గ‌వ‌ర్న‌మెంట్ మెడికల్ క‌ళాశాల‌కు వెళ్లి, ద‌ళితుడైన వైద్యుడిపై దాడి చేయ‌డానికి జ‌న‌సేన ఎమ్మెల్యేకు ఎంత ధైర్యం వుండాలి? త‌న చేష్ట‌ల్ని చూసి స‌మాజం ఏమ‌నుకుంటుందో అనే భ‌యం కూడా లేకుండా పోయింది.

అధికార‌మే వీళ్ల‌తో అలా ప్ర‌వ‌ర్తించేలా చేస్తోంది. అధికారం అనేది అశాశ్వ‌మ‌త‌మ‌ని తెలిసి కూడా, అది ఉన్న‌ప్పుడు చెలాయించాల‌నే యావ‌లో చేస్తున్న అరాచ‌కంగా చూడాల్సి వుంటుంది. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. త‌మ‌కంటూ ఒక స‌మ‌యం వ‌చ్చిన‌పుడు త‌గిన బుద్ధి చెబుతారు. అంత వ‌ర‌కూ కూట‌మి నేత‌ల్ని భ‌రించాల్సిందే.

8 Replies to “త‌ప్పు నానాజీది కాదు…!”

  1. news లో వస్తుంది అయితే ఇది

    కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు.. కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడేందుకు యువకులకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో వివాదం స్టార్ట్ అయింది. బెట్టింగులు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న కాలేజ్ సిబ్బంది వెల్లడించింది. అయిన సదరు యువకులు వినకుండా వాలీబాల్ ఆడేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని ఆర్ఎంసీ కాలేజ్ సిబ్బంది అడ్డుకుంది.

    ఇక, యువకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు తనను తిట్టాడు కాబట్టి ఇక్కడికి వచ్చానంటున్న ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పుకొచ్చారు. విపరీతమైన కోపంలో చంపేస్తాను అంటూ రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ను జనసేన శాసన సభ్యులు దుర్భాషలాడారు.

    వైద్య సిబ్బంది అందరూ రియాక్ట్ కావడంతో దిగొచ్చి క్షమాపణలు చెప్పిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.

    1. మరి అక్కడే మన ga కి కోపం వచ్చేది …ఇక్కడ ఎం రాస్తే అదే న్యూస్…మిగతాది అంతా నాన్సెన్స్ వాళ్ళ ప్రకారం

  2. తప్పు ఎవరు చేసినా తప్పే GA…. ఇప్పుడు పబ్లిక్ గా ఆ MLA తో APOLOGY చెప్పించారు…మళ్ళీ మళ్ళీ చేస్తే పక్కన పెడతారు..ACTION తీసుకుంటారు….అంతే కానీ….మన అన్నయ్య లాగ ఒక MURDER ఏ కదా..మనోడే కదా అని వదిలేస్తేనే ప్రమాదం GA….

Comments are closed.