వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉండినటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆ పదవికి ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. మేనెల 9 వ తేదీన ఈ రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. మే9వ తేదీన ఈ స్థానానికి ఎన్నిక జరుగుతుంది.
నామినేషన్ వేయడానికి తగినంత బలం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేని నేపథ్యంలో.. ఖచ్చితంగా ఈ స్థానం కూటమి పరం అవుతుంది. అయితే ఈ రాజ్యసభ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని పవన్ కల్యాణ్ కోరబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎన్డీయే జట్టుగా మూడు పార్టీలు కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు ఒకటే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. ఎన్నికల సమయంలో సీట్లను ఏ దామాషాలు అయితే పంచుకున్నామో.. నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవులు అన్నీ కూడా అదే దామాషాలు పంచుకుంటూ ముందుకు సాగాలని ఆయన అంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గానీ, పోస్టుల పంపకాల్లో గానీ.. అంతా అలాగే జరిగింది.
అయితే.. ఇటీవల మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసినప్పుడు.. రెండు తెలుగుదేశం తీసుకుని ఒక సీటును బిజెపికి ఇచ్చింది. ఆ సీటులో బిజెపి.. వైసీపీ ఎంపీగా ఉంటూ రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపింది. నిజానికి ఆ ఎంపీ సీటు మీద పవన్ కల్యాణ్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. తన సోదరుడు నాగబాబును రాజ్యసభ ఎంపీగా చూసుకోవాలని పవన్ అనుకున్నారు.
అయితే బిజెపి పట్టుపట్టడంతో.. పవన్ కల్యాణ్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఆ రకంగా.. జనసేన పార్టీ తరఫున రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యాన్ని చూపించుకోగలిగే అవకాశాన్ని ఆయన మిస్సయ్యారు కూడా. పవన్ కల్యాణ్ కు అంచనాలకు భిన్నమైన నష్టం జరిగింది. దానికి ఉపశమనంగానే.. రాజ్యసభ సీటు ఇవ్వలేకపోతున్నందునే.. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్టుగా చంద్రబాబు ప్రకటించారు కూడా. ఇటీవల ఎమ్మెల్సీని కూడా చేశారు. త్వరలో మంత్రి పదవి లాంఛనం కూడా పూర్తవుతుంది.
అయితే పాపం.. జనసేన పార్టీకి మాత్రం రాజ్యసభలో అడుగుపెట్టే, అస్తిత్వం చూపించుకునే అవకాశం మిస్సయింది. అందుకే తమ పార్టీకి ఈ అవకాశం దక్కడం చాలా సబబు అని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు విజయసాయిరెడ్డే బిజెపిలో చేరి ఆ సీటును దక్కించుకుంటారనే పుకార్లు కూడా ఉన్నాయి. తెలుగుదేశంలో కూడా చంద్రబాబుపై ఈ సీటుకోసం బాగా ఒత్తిళ్లు ఉన్నాయి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాసరే పవన్ కల్యాణ్ పట్టుబడితే చంద్రబాబు కాదనకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
నువ్వు పెట్టిన హెడింగ్ చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత పనికిమాలిన వెధవో. అలా ఎవరూ అడగరు . కొంచెం స్టాండర్డ్స్ మైంటైన్ చేస్తే బాగుంటుంది , లేకుంటే ఉన్న ఆర కోర రీడర్స్ కూడా పోతారు. లేకి నా ***** .