హైకోర్టు బెంచ్.. సీమ వాసుల్లో అనుమానం!

క‌ర్నూలుకు క‌నీసం హైకోర్టు బెంచ్ కూడా రాదా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

క‌ర్నూలుకు క‌నీసం హైకోర్టు బెంచ్ కూడా రాదా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. తాము అధికారంలోకి వ‌స్తే క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామ‌ని చంద్ర‌బాబునాయుడు ఎన్నిక‌ల హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు క‌ర్నూలులో హైకోర్టునే ఏర్పాటు చేస్తామ‌ని, ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించింది కూడా. అయితే హైకోర్టు, రాష్ట్ర ప్ర‌భుత్వం క‌లిసి చ‌ర్చించి తీసుకోవాల్సి వుండింది. ఈ లోపు కేసులు, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాలేదు. వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోయింది.

ఆ త‌ర్వాత వ‌చ్చిన కూట‌మి స‌ర్కార్ …హామీ మేర‌కు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం ఇటీవ‌ల అధికార బృందం క‌ర్నూలులో త‌గిన బిల్డింగ్ కోసం వెతికింది. ప్ర‌స్తుతం ఆ ప్ర‌క్రియ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును స‌వాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం విశేషం. రాజ‌కీయ‌, ఇత‌ర కార‌ణాల‌తో హైకోర్టు బెంచ్ ఎలా ఏర్పాటు చేస్తార‌ని ఆ పిటిష‌న్‌లో ప్ర‌శ్నించారు.

అలాగే సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ ద‌శ‌లో వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని, బెంచ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఒడిశా హైకోర్టు తీర్పు చెప్ప‌డాన్ని పిటిష‌న్‌పై ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. రాయ‌ల‌సీమ‌లో రాజ‌ధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాల‌నేది శ్రీ‌బాగ్ అనే పెద్ద మ‌నుషుల ఒప్పందం. అందుకు విరుద్ధంగా హైకోర్టు కాకుండా బెంచ్ ఏర్పాటు చేస్తామ‌ని బాబు చెప్ప‌డంపై రాయ‌ల‌సీమ వాసుల్లో అసంతృప్తి వుంది.

అయితే ఎన్నిక‌ల్లో ఇవేవీ ప‌ట్టించుకోకుండా కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. క‌నీసం హైకోర్టు బెంచ్ అయినా వ‌స్తుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో, హైకోర్టులో దాన్ని స‌వాల్ చేస్తున్న పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం ఆ ప్రాంత‌వాసుల్లో ఆందోళ‌న నెల‌కుంది. త‌మ‌కు బెంచ్ అయినా ద‌క్క‌దా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఈ పిటిష‌న్‌పై రెండు రోజుల్లో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. హైకోర్టు స్పంద‌న స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతోంది.

12 Replies to “హైకోర్టు బెంచ్.. సీమ వాసుల్లో అనుమానం!”

    1. అనుభవించేగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు….ఇంకా వెలగలేదా బల్బ్

      1. నీ పేరు భలే ఉంది ర… నీ కామెంటుకి తగ్గట్టు… లేకి అని! ఆ పేరు కితగ్గట్టు ఇలాగె.. లేకి కామెంట్లు పెడుతూ ఉండు!

    1. మనం మనమే.. గుద్దేసుకున్నాం కదా ర రంగడు, మన ఎన్నికల సంఘము ఇచ్చిన యంత్రాలలో .. ఇక వాళ్లకేం వచ్చి ఉంటాయి సీట్లు..నీ చాదస్తం కాకపోతేనూ..? 8 నెలలకి ఇప్పుడు డౌట్ వచ్చిందేంది ర.. రంగడు నీకుఎన్ని సీట్లొచ్చాయి అని? రాష్ట్రము లోనే ఉన్నావా.. లేక.. కోమా నుండి ఇప్పుడే బైటకొచ్చావా Pvu lK@గా..?

  1. ఈ పిల్ వేసింది ఖచ్చితంగా వైసీపీ అనుబంధమైన రాయలసీమ మేధావులే. హైకోర్ట్ పెడతాను అని కబుర్లు చెప్పి ఐదేళ్లు వేస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు వచ్చే బెంచ్ ని అడ్డుకోవడం అన్యాయం.

  2. ఈ పిల్ వేసింది ఖచ్చితంగా వైసీపీ అనుబంధమైన రాయలసీమ మేధావులే. హైకోర్ట్ పెడతాను అని కబుర్లు చెప్పి ఐదేళ్లు వేస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు వచ్చే బెంచ్ ని అడ్డుకోవడం అన్యాయం.

Comments are closed.