పోసాని రాంగ్ టైమింగ్..!

నా మీద కేసులు పెట్టారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాను. మరి నాపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటారా?

సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. రాంగ్ టైమ్ లో రాంగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు పోసాని కృష్ణమురళి. మొన్నటివరకు వైసీపీకి మద్దతుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడిన ఈ పాక్షిక నేత, ఉన్నఫలంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సోషల్ మీడియా జనాలకు టార్గెట్ అయ్యారు.

నారా లోకేష్ రెడ్ బుక్ తెరిచినట్టున్నారు. వైసీపీ హయాంలో మీడియా ముందుకొచ్చి విమర్శలు చేసిన కొంతమందిపై పోలీసు కేసులు నమోదవుతున్న టైమ్ ఇది. పోసానిపై కూడా కేసు పడింది. ఇంకా పడుతున్నాయి.

ఇలాంటి టైమ్ లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించడం విమర్శలకు దారి తీసింది. ఇదే నిర్ణయాన్ని ఆయన పోలీస్ కేసు ఫైల్ అవ్వకముందు లేదా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రకటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇది సరైన టైమ్ కాదంటున్నారు చాలామంది. గుక్కతిప్పుకోకుండా మాట్లాడే పోసాని దగ్గర ఈ విమర్శకు కూడా సమాధానం ఉంది.

“నా మీద కేసులు పెట్టారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాను. మరి నాపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటారా? అలా జరగదు కదా. కాబట్టి కేసులకు, నేను తప్పుకోవడానికి సంబంధం లేదు. నిజంగా నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే, జైలుకెళ్లడానికి సిద్ధం.”

కేసులు, బెదిరింపులు తనకు కొత్త కాదంటున్నారు పోసాని. ఎన్నో ఏళ్ల కిందటే చంపేస్తామని, కేసులు పెడతామని కొందరు బెదిరించారని.. భయపడేవాడినైతే అప్పుడే రాజకీయాలకు దూరమయ్యేవాడినని అన్నారు.

“ఎవరినైనా నేను అన్యాయంగా తిట్టినట్టు, వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు చూపిస్తే ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోతాను. నేను ఎవ్వర్నీ వ్యక్తిగతంగా విమర్శించలేదు, నాపై వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్లపై మాత్రమే నేను ఫైర్ అయ్యాను. మౌనంగా ఉండడానికి నేను గాంధీని కాదు, పోసానిని.”

నిజంగా తను బూతులు మాట్లాడి, వ్యక్తిగత విమర్శలు చేసే వాడినని భావిస్తే నారా లోకేష్ తనను ఎందుకు టీడీపీలోకి ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తున్నారు పోసాని. ఎన్నికల ఫలితాలు రాకముందే లోకేష్ తనకు ఆఫర్ ఇచ్చారని, మంచి పదవి ఇస్తామన్నారని, కానీ తను తిరస్కరించానని అంటున్నారు పోసాని.

ఇలా పోసాని తననుతాను ఎంత సమర్థించుకుంటున్నప్పటికీ.. ఆయన రాంగ్ టైమ్ లో స్టేట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు చాలామంది జనం.

41 Replies to “పోసాని రాంగ్ టైమింగ్..!”

  1. ఎవరి జీవితం/ కుటుంబం వారికి ముఖ్యం.. జనం ఏమనుకొంటే ఎవరికి కావాలి? తన సైన్యాన్ని కాపాడుకోవాల్సిన జగన్ అధికారంలో ఉంది కూడా వారిని దారుణంగా నిర్లక్ష్యం చేశాడు. దాని ఫలితమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఇన్నాళ్లు కళ్ళు మూసుకొని ఇప్పుడు “నాకోసం రండి, పని చేయండి” అంటే ఎవరు పట్టించుకొంటారు?

  2. అసలు నీ స్థాయి కీ, నీ తిట్లకి, ఇప్పుడు నీ గుడ్ బై కి ఏమన్నా సంబంధం ఉందా పోసాని? ఇప్పుడు కష్టం వచ్చేప్పటికి అన్నిటికీ గుడ్ బై ఆ? మేత గాళ్లతో చేరి పదవి తీసుకుని మేసినప్పుడు..?

  3. నువ్వెందుకు ఇప్పుడు అంత బాధ పడుతున్నావు GA…. అప్పుడు చిన్న పిల్లల మీద అతి నీచంగా RAPE THREATS చేసినప్పుడు ఖండించకుండా వూరుకున్న మీలాంటి వాళ్ళందరికీ ఈ పాపం లో భాగం వుంది GA…. KARMA timing different గా వుంటుంది GA…అనుభవించాల్సిందే….

  4. చిన్న పిల్లలు అని జాలి కూడా లేకుండా అతి నీచంగా మాట్లాడినప్పుడు నిద్ర పోయావా GA…

  5. @కుక్క తోక వంకర అని ఊరంతా తెలుసు కుక్కకి తప్ప..అందుకే ఈ @కుక్కని నమ్మకూడదు…

    టీడీపీ లో ఉన్నప్పుడు సీబీఎన్ ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    ప్రజారాజ్యం లో ఉన్నప్పుడు చిరు ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    వైసీపీ లో ఉన్నప్పుడు లెవెనోడిని ని తెగ పొగిడి….ఇప్పుడు తిట్టకుండా వెళ్తా, టాటా, గుడ్ బై అంటే నడవదు @కుక్కా..

  6. ఎవరికీ @కొమ్ము @కాయని @మన @ప్రియతమ @ఎంకటి @ఇంకా @అదానీ @అవినీతి @దందా లో మన @మహా @మేత @పుత్రుడి కథ ఇంకా @పబ్లిష్ @చెయ్యలేదేమిటి చెప్మా..

  7. @ఎవరికీ @కొమ్ము @కాయని @మన @ప్రియతమ @ఎంకటి @ఇంకా @అదానీ @అవినీతి @దందా లో @మన @మహా @మేత @పుత్రుడి @కథ ఇంకా @పబ్లిష్ @చెయ్యలేదేమిటి చెప్మా..

  8. @ఎవరికీ @కొమ్ము @కాయని @మన @ప్రియతమ @ఎంకటి @ఇంకా @అదానీ @అవినీతి @దందా లో @మన @మహా @మేత @పుత్రుడి @కథ @ఇంకా @పబ్లిష్ @చెయ్యలేదేమిటి @చెప్మా..

  9. ఎవరికీ-కొమ్ము-కాయని-మన-ప్రియతమ-ఎంకటి-ఇంకా-అదానీ-అవినీతి-దందా-లో-మన-మహా-మేత-సుపుత్రుడి-కథ-ఇంకా-పబ్లిష్-చెయ్యలేదేమిటి-చెప్మా..

  10. ఇతని మీద ఇప్పుడు జనాలు చేసే ర్యాగింగ్ మెసేజెస్/కామెంట్స్ ని బ్లాక్ చేసేపనిలో చానా బిజీ అనుకుంటా మన ఎంకటి బుల్రెడ్డి..

  11. ఇతని-మీద-ఇప్పుడు-జనాలు-చేసే-ర్యాగింగ్-మెసేజెస్-అండ్-కామెంట్స్-ని–బ్లాక్-చేసే-పనిలో-చానా-బిజీ-అనుకుంటా-మన-ఎంకటి-బుల్రెడ్డి..

  12. అందితే జుట్టు …

    అందపోతే కాళ్ళు…

    మహా నటుడు…

    చెప్పుతో కొట్టి సారి చెప్తే ……

    కరెక్ట్ కాదు కదా…

  13. వైసీపీ అధికారంలోకి వచ్చుంటే కిరాక్ ఆర్పీ పరిస్థితి ఏమయ్యోదో

  14. అస్సలు వదలరు..chekkesthaaru.. రెండో సారి నోరు లేగవాలంటే వంద సార్లు ఆలోచించాలి

  15. ఒక్క విషయం చెప్పాలి. వైసీపీ హయాంలో చాలామంది టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టినా కూడా భయపడకుండా పోరాటాలు చేసారు. మొన్న ఎలెక్షన్స్ తర్వాత టీడీపీ కాడర్ కొందరు వైసీపీ వారిని చితకబాదినా కూడా వాళ్లు ధైర్యంగా నిలబడ్డారు. మొత్తానికి ఎవరూ ఈ పోసానిలా పారిపోలేదు. జగన్ ఇతన్ని పవన్‌ని తిట్టడానికి, రెండు సామాజికవర్గాల మధ్య గొడవ పెట్టడానికి వాడుకున్నాడు. ఇతను అప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు జగన్ కష్టాల్లో పడగానే పిరికిసన్నాసిలా వదిలేసాడు.

Comments are closed.