ఇది కదా మజా.. చిన్న సినిమాల పెద్ద విజయం

వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, స్టార్ హీరోతో సినిమా తీసి హిట్ కొడితే మజా ఏముంటుంది? పేరుకే పెద్ద సినిమా, మిగులు చూసుకుంటే నిట్టూర్చాల్సిందే.

వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, స్టార్ హీరోతో సినిమా తీసి హిట్ కొడితే మజా ఏముంటుంది? పేరుకే పెద్ద సినిమా, మిగులు చూసుకుంటే నిట్టూర్చాల్సిందే. అదే తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి అద్భుత విజయంతో పాటు, కాసుల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? ఇది కదా అసలు మజా? ఈ ఏడాది కోలీవుడ్ అలాంటి మజానే ఆస్వాదించింది.

ఈ ఏడాది కోలీవుడ్ లో రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలొచ్చాయి. వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి కూడా. కానీ దేశీయంగా వచ్చిన వసూళ్లు, పెట్టిన బడ్జెట్ తో పోల్చి చూస్తే నిరాశే ఎక్కువగా కనిపించింది. అదే టైమ్ లో 3 సినిమాలు అద్భుత విజయాల్ని అందుకున్నాయి.

ఈ ఏడాది కోలీవుడ్ లో విడుదలైన మహారాజ, లబ్బర్ పందు, వాజాయ్ సినిమాలు అమోఘమైన విజయాల్ని అందుకున్నాయి. పెట్టిన పెట్టుబడిపై 250 శాతం లాభాలు ఆర్జించి సిసలైన పైసా వసూల్ మూవీస్ అనిపించుకున్నాయి.

2024లో కోలీవుడ్ లో తొలి సూపర్ హిట్ మహారాజ. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా బడ్జెట్ 20 కోట్ల రూపాయలు. ఒక దశలో నిర్మాత దగ్గర డబ్బుల్లేకపోతే, విజయ్ సేతుపతి తన రెమ్యూనరేషన్ కూడా వదులుకున్నాడు.

అలా అతి తక్కువ బడ్జెట్ తో కిందామీద పడి తీసిన ఈ సినిమాకు 71 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. పెట్టుబడి పోను రూ. 51 కోట్లు లాభం అన్నమాట. అంటే.. 256 శాతం రిటర్న్స్ తెచ్చిపెట్టింది ఈ సినిమా.

వాజాయ్ సినిమా కూడా ఇలాంటిదే. ఈ సినిమా బడ్జెట్ అయితే కేవలం 5 కోట్లు మాత్రమే. కానీ ఇది చేసిన బిజినెస్ అక్షరాలా రూ. 29.12 కోట్లు. అంటే 482 శాతం రిటర్న్స్ వచ్చాయన్నమాట.

ఇక చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన మరో మూవీ లబ్బర్ పాందు. 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి రూ. 37.60 కోట్లు వసూలు చేసింది. పెట్టిన పెట్టుబడితో పోల్చి చూస్తే, ఏకంగా 652శాతం రిటర్న్స్ వచ్చాయన్నమాట.

ఇలా కోలీవుడ్ లో ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాల కంటే, చిన్న సినిమాలే ఎక్కువ లాభాలు ఆర్జించాయి. నిజానికి ఈ 3 సినిమాలు ఓ పెద్ద సత్యాన్ని ఇండస్ట్రీకి చాటిచెప్పాయి. ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలంటే భారీ కథనం, సెట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ అవసరం లేదని.. కంటెంట్ పక్కాగా ఉందో లేదో చూసుకుంటే చాలని ఈ 3 చిత్రాలు నిరూపించాయి.

3 Replies to “ఇది కదా మజా.. చిన్న సినిమాల పెద్ద విజయం”

Comments are closed.