వాసిరెడ్డి ప‌ద్మ వార్త‌ను చూసి రామోజీరావు!

ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భ‌వించిన కొత్తలోని క‌థ‌. అప్ప‌టికి ఈనాడు అధిప‌తిగా రామోజీరావు త‌న ప‌త్రిక‌ను యాక్టివ్ గా చూస్తూ, తప్పొప్పుల‌ను దిద్ది ప‌త్రిక న‌డ‌ప‌డం విష‌యంలో త‌న పంథా ఏమిటో త‌న…

ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భ‌వించిన కొత్తలోని క‌థ‌. అప్ప‌టికి ఈనాడు అధిప‌తిగా రామోజీరావు త‌న ప‌త్రిక‌ను యాక్టివ్ గా చూస్తూ, తప్పొప్పుల‌ను దిద్ది ప‌త్రిక న‌డ‌ప‌డం విష‌యంలో త‌న పంథా ఏమిటో త‌న సంస్థ‌లో ప‌ని చేసే జ‌ర్న‌లిస్టుల‌కు స్ప‌ష్ట‌మైన సంకేతాల‌ను ఇస్తూ ఉన్నార‌ప్ప‌టికీ. బ‌హుశా ఆయ‌న త‌న చ‌ర‌మాంకం చివ‌రి మూడు నాలుగు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఆ ప‌నిని యాక్టివ్ గా చేశారంటారు. ఈనాడు ఆవిర్భ‌వించిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి రోజూ ఉద‌యం త‌న ప‌త్రిక‌ను జిల్లా ఎడిష‌న్ల‌తో స‌హా చ‌దివి, వాటిపై త‌న క్వాలిటీ రిపోర్ట్ ను ఆయా క‌థ‌నాల ప‌క్క‌నే రామోజీ ఇచ్చే వార‌ని ఆ ప‌త్రిక‌లో ప‌ని చేసిన వారే చెబుతారు.

ఏ క‌థ‌నం విష‌యంలో అయినా, హెడ్డింగ్ విష‌యంలో, ఎవ‌రి వార్త‌కు ఎంత ప్రాధాన్య‌త విష‌యంలో రామోజీ నిత్యం తన దిద్దుడుతో తను కోరుకున్న రీతిలో ప‌త్రిక‌ను వెలువ‌రించార‌నేది అందులో ప‌ని చేసిన వారు చెప్పే మాట‌. రామోజీ సామ్రాజ్యానికి ఈనాడు ఎంత కీల‌క‌మో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు కూడా! మ‌రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా అనే వార్త‌ను చూశాకా.. గ‌తంలో ఈమె వార్త‌ల గురించి రామోజీ ఇచ్చినా కామెంట్ గుర్తుకు వ‌స్తుంది. ఈ విష‌యాన్ని ఈనాడులో ప‌ని చేసిన ఒక ఉద్యోగి ఒక సారి చెప్పారు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్త‌లో.. ఆ పార్టీ లో చేరి, అధికార ప్ర‌తినిధి త‌ర‌హా హోదాలో నిత్యం పార్టీ ఆఫీసులో కూర్చుని, చంద్ర‌బాబు నాయుడు, కిర‌ణ్ కుమార్ రెడ్డిల‌పై విరుచుకుప‌డే వారిలో వాసిరెడ్డి ప‌ద్మ ఉండేవారు. అప్ప‌టికి ఆమె ప్ర‌జారాజ్యం పార్టీలో ప‌ని చేసి వార్త‌ల్లో నిలిచారు. ఆ త‌ర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంబ‌టి రాంబాబు, తెలంగాణ‌కు చెందిన ఒకరిద్ద‌రు నేత‌లు, వాసిరెడ్డి ప‌ద్మ‌, భూమ‌న త‌ర‌చూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ప్రెస్ మీట్లు పెట్టే వారు. వారి వార్త‌ల‌కు సాక్షిలో పూర్తి క‌వ‌రేజ్ ఉండేది. ఈనాడులో ఒక చిన్న ముక్క వేసే వారు.

అలా ఒక రోజు వాసిరెడ్డి ప‌ద్మ వార్త ఒక‌టి ఈనాడులో య‌థారీతిన ఒక సింగిల్ కాల‌మ్ లో ప్ర‌చురితం అయ్యింద‌ట‌, ఆ రోజున రామోజీ త‌న రివ్యూ.. వాసిరెడ్డి ప‌ద్మ వార్త ప‌క్క‌న‌, “ఈమె వార్త అవ‌స‌ర‌మా..” అన్న‌ట్టుగా ఒక కామెంట్ రాశార‌ట‌! వాసిరెడ్డి ప‌ద్మ వార్త ఈనాడులో అచ్చైన ఆఖ‌రి రోజు అదేన‌ట‌! అప్ప‌టికే ఆ ప‌త్రిక‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ కు ఇచ్చే ప్రాధాన్య‌తే డ‌బుల్ కాల‌మ్. అది కూడా పేజీల‌కు పేజీలు జ‌గ‌న్ మీద వ్య‌తిరేక క‌థ‌నాలు అయ్యాకా, ఎక్క‌డైనా జ‌గ‌న్ దీక్షో చేస్తే.. ప‌డిక‌ట్టు ప‌దాల‌తో చిన్న వార్త వ‌చ్చేది.

అలాంటిది వాసిరెడ్డి ప‌ద్మ విమ‌ర్శ‌లు ప్ర‌చురితం అయ్యే స‌రికి రామోజీ కి కోప‌మొచ్చిందేమో! ఆ త‌ర్వాత ఆమె ఏపీ మ‌హిళా కమిష‌న్ ప‌గ్గాలు తీసుకున్నాకా ఏమైనా వార్త‌లు ప్ర‌చురితం అయ్యాయేమో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. ఎప్పుడూ ఆమె పేరే ఈనాడులో ప్ర‌చురితం కాలేద‌ట‌! మ‌రి ఇప్పుడు వాసిరెడ్డి ప‌ద్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాబ‌ట్టి, ఇక ప్ర‌ముఖ ప్రాధాన్య‌త ద‌క్క‌వ‌చ్చునేమో!

18 Replies to “వాసిరెడ్డి ప‌ద్మ వార్త‌ను చూసి రామోజీరావు!”

  1. వాళ్ళు ఎవరి వార్తలు రాయాలో చెప్పడానికి మనం ఎవరము…?

    అయినా సాక్షి లో లాగా సిగ్గు లేకుండా తప్పుడు కథనాలు వుండవు కదా…

  2. వాసిరెడ్డి పద్మ గారి భర్త వాటికన్ కన్వర్టటెడ్ గొర్రె బిడ్డ.

    ఆ వాటికన్ కోటా లోనే ఆ పార్టీ పదవి ఇచ్చారు అప్పట్లో.

  3. రేపటి నుండి సాక్షి లో ఆమె వార్తలు ఉంటాయా, అది కూడా చెప్పండి.

  4. చచ్చిన రామోజీ వార్త వ్రాయమన్నాడా లేదా అనేది తర్వాత. మొన్నటికి మొన్న ఏడేళ్ల బాలికను డబ్బు కోసమో, ఆ బాలిక తండ్రి మీద పగ కోసమో ఓ మహిళ హత్యా చేస్తే దానికి కూడా అత్యాచార హత్యా అని ప్రచారం చేయడం మాత్రం సాక్షికే చెల్లింది.

  5. ఎ ఆదారాలు లెకుండా, చనిపొయిన వారిమీద కూడా ఇలాంటి గాలి వార్తలు ఎన్నయినా రాయవచ్చు GA!

    ఇంతకీ వాసిరెడ్డి ప్రద్మ రిజైన్ చెస్తూ జగన్ గురించి ఎమన్నారొ నువ్వు రాసావా?

Comments are closed.