ఇది కచ్చితంగా షాక్ కి గురయ్యే అంశం. ఈ సారి చంద్రబాబు కుప్పంలో ఓడిపోబోతున్నారంటూ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చెబుతోంది. నలభై ఏళ్ల తిరుగులేని చంద్రబాబు వైభవానికి తన నియోజకవర్గంలో కూడా తెరపడుతోందని తెలుస్తోంది. చంద్రబాబు ఓటమికి కారణం అక్కడి ప్రజల్లో పెరిగిన వైకాపాపై సానుకూలత అని చెబుతున్నారు. గతంలో తెదేపాకే ఓటు వేస్తూ వస్తున్నా చాలా కుటుంబాలు ఈసారి వైకాపాకి వెయబోతున్నట్టు తెలుస్తోంది.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా దారుణమైన ఓటమి చవిచూడబోతున్నారని అదే రిపోర్ట్ చెబుతోంది. పవన్ ఓటమి కాబోవడానికి కారణం పిఠాపురం ప్రజలు అసలు అతనిని సీరియస్ గా తీసుకోవట్లేదని, దానికి తోడు వర్మ వర్గం పైకి మద్దత్తు ఇస్తున్నట్టు కనిపిస్తున్నా వెనుక వ్యవహారం వేరే నడుస్తోందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్.
ఇక బాలకృష్ణ కూడా ఈసారి స్థానిక వైకాపా సానుకూలత వల్ల హిందూపురంలో ఓడిపోబోతున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే నారా లోకేష్ మంగళగిరి నుంచి ఈ సారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారంటూ గ్రౌండ్ రిపోర్ట్ తెలియజేస్తోంది. గత ఎంతో కాలంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మమేకం కావడం వల్ల లోకేష్ గెలుపుకి సానుకూల వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది.