ఆయన సైలెంట్ వెనక ?

వైసీపీలో చూస్తే రెండు వర్గాలు పలాసలో బలంగా ఉన్నాయి. ఒక వర్గం సీదరిని వ్యతిరేకిస్తోంది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీదరి అప్పలరాజు సడెన్ గా సైలెంట్ అయ్యారు. ఆయన ఎపుడూ హడావుడి చేస్తూ ఉండేవారు. కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడంలో ముందు ఉండేవారు. అటువంటి ఆయన మౌనంగా ఉండడంతో పార్టీలో చర్చ సాగుతోంది.

ఆయన పార్టీ నాయకులకు సైతం అందుబాటులోకి రావడంలేదు అని అంటున్నారు. పలాసలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు గౌతు శిరీషతో రాజకీయంగా ఢీ అంటే అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన డాక్టర్ గారు ఇపుడు ఎవరికీ కనిపించకుండా పోవడమేంటన్నది అంతా తర్కించుకుంటున్నారు.

వైసీపీలో చూస్తే రెండు వర్గాలు పలాసలో బలంగా ఉన్నాయి. ఒక వర్గం సీదరిని వ్యతిరేకిస్తోంది. ఆ వర్గంలోని వారు సీదరిని తప్పించి నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలను తమ వర్గానికి అప్పగించాలని కోరుతున్నారు. సీదరి తమను మంత్రిగా ఉన్నపుడు పట్టించుకోలేదు అన్న ఆవేదనతో కూడా పార్టీ వారు ఉన్నారని చెబుతున్నారు. ఇలా రెండు వర్గాలను సరిచేసుకుని రాజకీయాలు చేయాల్సిన డాక్టర్ గారు వైరాగ్యంలోకి వెళ్ళారా అన్నది హాట్ టాపిక్ గా ఉంది. సీదరి విషయంలో చూస్తే వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడు అని పేరు.

ఆయన మళ్ళీ దూకుడు పెంచాలని పార్టీలోని అత్యధికులు కోరుకుంటున్నారు. యువకుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి నాలుగేళ్ళ పాటు మంత్రిగా చేసిన సీదరి స్వపక్షంలోని వర్గ పోరుకు కినిసి దూరం అవుతున్నారా లేక అధికార పక్షం ఆయనను టార్గెట్ చేయడంతో వ్యూహాత్మకమైన మౌనం పాటిస్తున్నారా అన్నది కూడా పార్టీలో తర్కించుకుంటున్నారు.

5 Replies to “ఆయన సైలెంట్ వెనక ?”

  1. జగన్ రెడ్డి పార్టీ లో అందగాళ్ళకు మాత్రమే ప్రవేశం..

    ఇతను అందగాడు కాదని జగన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడేమో..

    రాజకీయాల్లో మేల్ క్యాస్టింగ్ కౌచ్ ప్రవేశపెట్టిన ఘనత జగన్ రెడ్డి కే దక్కుతుంది.. ట్రెండ్ సెట్టర్..

Comments are closed.