మంగ్లీకి ద‌ర్శ‌నం.. రామ్మోహ‌న్‌పై టీడీపీ శ్రేణుల ఫైర్‌!

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడిపై సొంత పార్టీ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నాయి.

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడిపై సొంత పార్టీ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నాయి. టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసిన వారిని కుటుంబ స‌భ్యుల‌తో స‌మానంగా ప్రాధాన్యం ఇవ్వ‌డమే వాళ్ల కోపానికి కార‌ణ‌మైంది. టీడీపీ కోసం ప‌ని చేసిన వాళ్ల‌ను ప‌ట్టించుకునే దిక్కులేద‌ని, కానీ జ‌గ‌న్ కోసం పాట పాడి, వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన మంగ్లీతో అంట‌కాగ‌డం ఏంట‌ని రామ్మోహ‌న్‌నాయుడిని సొంత పార్టీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు ఏకిపారేస్తున్నారు.

ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా వేకువ జామున ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌, కుటుంబ స‌భ్యులు, సింగ‌ర్ మంగ్లీతో క‌లిసి క్షీరాభిషేక సేవ‌లో అర‌స‌వల్లి స‌త్య‌నారాయ‌ణ స్వామివారిని ద‌ర్శించుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్టు రామ్మోహ‌న్‌నాయుడు సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాగే ఫొటోల్ని షేర్ చేశారు. మంగ్లీని వెంట‌బెట్టుకుని వెళ్ల‌డాన్ని టీడీపీ సోష‌ల్ మీడియా జీర్ణించుకోలేక‌పోతోంది.

గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌పై మంగ్లీ పాట పాడిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట చాలా పాపుల‌ర్ అయ్యింది. అలాగే వైసీపీ హ‌యాంలో ఎస్వీబీసీ చానెల్‌లో మంగ్లీ అధికార హోదా ద‌క్కించుకున్నారు. ల‌క్ష‌ల జీతంతో పాటు ఆమెకు ప్రొటోకాల్ ఇచ్చారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్‌ను మంగ్లీ క‌లిసేవారు. ఈ సంగ‌తుల‌న్నీ అంద‌రికీ తెలిసిన‌వే.

వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అనుభ‌వించి, నేడు మ‌ళ్లీ కూట‌మి ప్ర‌భుత్వంలోనూ ప్ర‌త్యేక మ‌ర్యాద‌ల్ని కేంద్ర మంత్రి ఇవ్వ‌డం ఏంట‌ని టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబుపై పాట పాడాల‌ని అడిగితే, క‌నీసం ఆయ‌న పేరు ప‌ల‌క‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని మంగ్లీని ఏ ర‌కంగా వెంట‌బెట్టుకుని వెళ్తార‌నే టీడీపీ కార్య‌కర్త‌ల‌ ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి స‌మాధానం ఏంటో చూడాలి.

9 Replies to “మంగ్లీకి ద‌ర్శ‌నం.. రామ్మోహ‌న్‌పై టీడీపీ శ్రేణుల ఫైర్‌!”

Comments are closed.