కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాడు. ఆయన ఎప్పటినుంచో వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడు. ఆయన చాలాసార్లు తెలంగాణకు చివరి అగ్రకుల సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ తరువాత బీసీ నాయకుడు సీఎం అవుతాడని చెప్పాడు. మల్లన్నకు రెడ్డి సామాజిక వర్గమంటే చాలా మంట. ఈమధ్య ఒక సభలో ఆ సామాజిక వర్గంపై తీవ్ర విమర్శలు చేశాడు.
కులగణన సర్వే నివేదికను కూడా వ్యతిరేకించాడు. దాని ప్రతిని తగలబెట్టాడు. కులగణన సర్వే నివేదికను నకిలీ నివేదికగా మల్లన్న అభివర్ణించాడు. ఈ సర్వేను బీసీ నాయకుల సామాజిక-రాజకీయ ఆకాంక్షలను అణిచివేయడానికి చేసిన కుట్రగా అభివర్ణించాడు. సర్వేలో పేర్కొన్న గణాంకాలు పూర్తిగా తప్పుడు డేటాగా పేర్కొంటూ, ప్రభుత్వ ఉద్దేశాలు బహిర్గతమయ్యాయని, బీసీలకు న్యాయం జరగదని ఆరోపించాడు.
తీన్మార్ మల్లన్న తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో మార్పులు చూశాడు. ప్రజాస్వామ్య విధానాలను, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికే వ్యతిరేకంగా మాట్లాడటంతో, ఆయన నిజంగా ఏ పార్టీకి చెందిన నేత అనేది ప్రశ్నార్థకమైంది.
కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని అన్నాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందని అన్నాడు. బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, చేతులు దులిపేసుకునే కార్యక్రమం చేసిందని విమర్శించాడు. మల్లన్నను ఇంతకాలం భరించిన కాంగ్రెస్ పార్టీ ఇక భరించలేని స్థితికి వచ్చింది.
ఆయన చేస్తున్న ప్రకటనలపైన టీపీసీసీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఆయనపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ టికెట్‌పైన ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న.. కొద్దినెలలుగా వివిధ అంశాలపైన పార్టీ విధానాలకు విరుద్ధంగా స్పందిస్తూ వస్తున్నాడు.
అయినా ఆయన విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేకు వ్యతిరేకంగానూ తీన్మార్ మల్లన్న మాట్లాడటం పట్ల సీరియస్ అయ్యారు. పార్టీ నేతల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు నాయకులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులూ చేశారు. తీన్మార్ మల్లన్న ప్రకటనల పట్ల ఆగ్రహంగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు.
మల్లన్న పైన వచ్చిన ఫిర్యాదులపైన ఒకటి రెండు రోజుల్లో క్రమశిక్షణ చర్యల కమిటీ భేటీ అయి.. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తుందని సమాచారం. ఇటీవల బీసీ గర్జన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 75 ఏళ్లుగా బీసీ నేత ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని.. బీసీలలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తనకు సంతోషమన్నాడు.
తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అవుతాడని మోత్కుపల్లి నరసింహులు చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. తాను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన అభిమానం కొద్ది ఆ మాట అనొచ్చని.. కానీ తాను ఎప్పుడు ఆ మాట చెప్పలేదన్నాడు. “నేను పని చేస్తున్న కార్యకర్తను మాత్రమే.. ప్రజలకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు.
అవకాశం వస్తే ప్రధానమంత్రి అయితా.. ఎందుకు ఊకుంటా.. బీసీలలో ఎవరు ముఖ్యమంత్రి అయినా నేను హ్యాపీ. చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి. బీసీలం చైతన్యవంతమయ్యాం.. గత పరిస్థితులు లేవు. మా ఓట్లు మాకు వేసుకున్న తర్వాత మేమే కదా.. మా ప్రజలే కదా మంత్రులు, ముఖ్యమంత్రులు.. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం సమయంలోనే చెప్పిండు.. రాష్ట్రం వచ్చినక మరో ఉద్యమం వస్తది.. ఆ ఉద్యమం కచ్చితంగా ఈ నిమ్న వర్గాలది అయి ఉంటది అని ఆయన చెప్పిండు.
ఇవాళ జరుగుతుంది అదే.. కానీ రేవంత్ రెడ్డి 10 ఏళ్లు అయినా.. 20 ఏళ్ళు అనుకోండి తప్పేముంది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కావాలి లేకపోతే ఉప ప్రధాని కావాలని కోరుకుంటా.. మేము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినాము. ఈ దీనికి లీడర్ నేను కాదు. బీసీ ప్రజలు. ఎవరికి భయపడం. ఓట్లు మావి.. మా బీసీల ఓట్లు లేకుండా ఎవరైనా ఒక వార్డ్ మెంబర్ గెలిచారా..?
మేము ఎవరికి భయపడాలి..? మేము ఎందుకు భయపడాలి..? మేము ఇన్ని సంవత్సరాలు భయపడుకుంటుంటేనే కదా.. మా పరిస్థితి ఇట్లా ఉంది. మేము ఎప్పుడో గర్జించాల్సింది.. కానీ సందర్భం సమయం ఆసన్నమైంది. దాన్ని బట్టి పోతా ఉన్నాం..హైదరాబాద్ రెడ్లు, వెలమలతోనే యుద్ధం 100%. రాజకీయ పరమైన యుద్ధం. వ్యక్తిగతమైనటువంటి యుద్ధం కాదు. మమ్మల్ని తిడితే మేము ఊరుకోం. ఈటితో కొడితే పత్తరితో కొడతాం.. మేము ఎందుకు ఊకుంటాం.. నేను మా ప్రజల బాధ మాట్లాడుతున్నా.. ” అని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చాడు. మొత్తం మీద బీసీల గురించి తీన్మార్ తెగించి మాట్లాడుతున్నాడు.
Seven, nine, nine, seven, five, three, one, zero, zero, four :- CB work
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, vc
He is fit for TDP. TDP is looking bc leader