మళ్లీ మొదలైన పవన్ షూటింగ్

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఓ బ్లాక్ షూటింగ్ చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ మొదలైంది.

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఓ బ్లాక్ షూటింగ్ చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ మొదలైంది. ఇదే లాస్ట్ షెడ్యూల్ అంటున్నారు చాలామంది.

కొంతమంది మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, పవన్ కల్యాణ్ ఇప్పటివరకు 3 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ 3 రోజుల్లో పని పూర్తవ్వదనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే, బ్లాక్ షూటింగ్ కు వారం రోజులు పడుతుందని, ఆమధ్య స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు కాబట్టి.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో కీలకమైన మార్పు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులోకి ఆఖరి నిమిషంలో అనుపమ్ ఖేర్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తప్పుకున్నారంట. ఆ స్థానంలో సత్యరాజ్ ను తీసుకున్నారట.

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇది మూడో పెద్ద ఎగ్జిట్. ఇంతకుముందు అర్జున్ రాంపాల్ తప్పుకున్నారు, ఆ స్థానంలో బాబీ డియోల్ ను తీసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైంది హరిహర వీరమల్లు. ప్రాజెక్ట్ లేట్ అవ్వడంతో, ఈ సినిమా నుంచి పాక్షికంగా తప్పుకున్నాడు క్రిష్. అతడి స్థానంలో మిగిలిన పనిని జ్యోతికృష్ణ పూర్తిచేస్తున్నాడు.

పవన్ కాల్షీట్లు కేటాయిస్తే, ఈ నెలాఖరుకు టోటల్ షూట్ (ప్యాచ్ వర్క్ తో సహా) పూర్తిచేయబోతున్నారు. సకాలంలో షూటింగ్ పూర్తయి, గ్రాఫిక్ వర్క్ కూడా అందుబాటులోకి వస్తే.. మార్చి 28కి సినిమా రిలీజ్ అవుతుంది.

4 Replies to “మళ్లీ మొదలైన పవన్ షూటింగ్”

  1. హరిహర వీరమల్లు కాస్త హరిఓం వీర సొల్లు అయ్యింది. పాపం నిర్మాత

Comments are closed.