మేథస్సు.. ఖర్చు తగ్గించడంలో చూపించరాదా?

ఈ ఐదు పరిపాలన భవనాల కోసం ఏకంగా 73 శాతం పెంపు.. ఇంచుమించు రెండు వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అంటే ప్రజల గుండె కలుక్కుమంటుంది.

చంద్రబాబునాయుడు అమరావతి రాజధానిని గొప్పగానే కలగన్నారు. అప్పట్లో అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాల నిమిత్తం ఐకానిక్ టవర్లను ప్లాన్ చేశారు. అసెంబ్లీ, హైకోర్టు వంటి ఐకానిక్ టవర్లు కాకుండా.. ఐదు ఆకాశహర్మ్యాల సముదాయంగా జీఏడీ ఐకానిక్ టవర్లు ఉన్నాయి. ఆయన గత పాలన కాలంలో డిజైన్లు బడ్జెట్ ప్రతిపాదనలు అన్నీ తయారుచేసిన తర్వాత.. అధికారం చేతులు మారింది.

జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత.. అమరావతిని పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత.. మళ్లీ అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు. అంతవరకు మంచిదే.. ఏపీ ప్రజలకు ఒక భారీస్థాయి రాజధాని ఏర్పడుతుందని అనుకోవచ్చు. అయితే.. పరిపాలన కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఐదు ఐకానిక్ టవర్ల విషయంలో మారిన అంచనాల గురించిన వివరాలే గుండె గుభేల మనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు తన మేథాసంపత్తిన, వ్యూహరచనా సామర్థ్యాన్ని బడ్జెట్ అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగించలేకపోతున్నారే అని ప్రజలు ఆవేదన చెందే పరిస్థితి.

అమరావతిలో పరిపాలన కేంద్రంగా ఐదు ఐకానిక్ టవర్లను ప్లాన్ చేశారు. వీటిలో ప్రధానమైన జీఏడీ భవనం బేస్ మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా ఉంటుంది. మిగిలిన నాలుగు హెచ్ఓడీ టవర్లు 39 అంతస్తులతో ఉంటాయి. ఈ భవనాల కోసం డిజైన్లు సిద్ధం చేసి 2018లోనే మూడు ప్యాకేజీల కింద టెండర్లు 2703 కోట్ల అంచనా వ్యయంతో పిలిచారు. అప్పట్లో పునాదులు కూడా పడ్డాయి.

జగన్ సర్కారు పట్టించుకోకపోవడం వల్ల అప్పట్లో పునాదులు తవ్విన ప్రాంతాల్లో బాగా నీరు నిలిచి చెరువును తలపించేలా మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇన్నాళ్లుగా అక్కడి నీటిని తోడివేసే ప్రక్రియ చేపడుతూ వచ్చింది. ప్రస్తుతం నీటిని తోడివేయడం పూర్తవుతోంది. త్వరలోనే వీటికి కూడా టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అప్పటికి ఇప్పటికీ పెరిగిన అంచనా వ్యయంలో తేడా ఎంతో తెలుసా? సుమారు రెండు వేల కోట్లు! సహజంగానే ఇదంతా కూడా జగన్ పాపమేనని నిందించడానికి కూటమి నాయకులు సిద్ధంగా ఉంటారు.. అది వేరే సంగతి.

2018 నాటి అంచనాల ప్రకారం ఈ అయిదు టవర్ల అంచనా వ్యయం 2703 కోట్లు. ఇప్పుడు పెరిగిన వ్యయం దృష్ట్యా అది 4687 కోట్లకు చేరిందని అంటున్నారు. అంటే అంచనా వ్యయం ఏకంగా 73.34 శాతం పెరిగిందన్నమాట. ఈ ఐకానిక్ భవనాలను డయాగ్రిడ్ పద్ధతిలో నిర్మిస్తున్నారని, అందుకోసం స్టీల్ ఎక్కువగా వాడాల్సి ఉంటుందని, దాని ధర అప్పటికీ ఇప్పటికీ బాగా పెరిగిందని రకరకాల కారణాలు చెబుతున్నారు.

నిజానికి అసెంబ్లీ, హైకోర్టులకు కూడా ఐకానిక్ భవనాలనే ప్లాన్ చేశారు. జగన్ వాటిని కూడా పట్టించుకోలేదు. వాటి వ్యయం కూడా ఇప్పుడు బాగా పెరిగింది. కానీ.. హైకోర్టు భవనం అంచనాలు 21.9 శాతం, అసెంబ్లీ భవనం అంచనాలు 33.8 శాతం మాత్రమే పెరిగాయి. పైగా ఆయా భవనాల్లో ఇప్పటి ఆధునిక సాంకేతికతకు తగ్గట్టుగా అనేక కొత్త జోడింపులు కూడా చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఆ మాత్రం పెంపు ఉన్నా కూడా .. జగన్ నిర్లక్ష్యం కారణంగానే.. ఆ పెంపు జరిగిందని అనుకోవచ్చు. అదే సమయంలో.. ఈ ఐదు పరిపాలన భవనాల కోసం ఏకంగా 73 శాతం పెంపు.. ఇంచుమించు రెండు వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అంటే ప్రజల గుండె కలుక్కుమంటుంది.

చంద్రబాబునాయుడు.. మేథావులైనా ఇంజినీరింగ్ నిపుణులతో చర్చలు జరిపించి.. ఆ డిజైన్లకు నిర్మాణరీతుల్లో చిన్న మార్పులు చేయించడం ద్వారా.. ఖర్చు తగ్గించే ప్రయత్నం చేయవచ్చు కదా.. అని ప్రజలు ఆశిస్తున్నారు.

13 Replies to “మేథస్సు.. ఖర్చు తగ్గించడంలో చూపించరాదా?”

  1. రివర్స్ టెండరింగ్ అంటూ 3000 కోట్ల రంగులేసి, కోర్ట్ దె0గితే దాన్ని తీయ్యడానికి 8000 కోట్లు ఖర్చుపెట్టి ఆదా చేసినట్టా??

      1. కులం భ్రమలోంచి బయటకి రండి .. మనకి అన్ని కులాల ప్రజలు ఇంచింది పదకొండు .

  2. అదా అంటే

    కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో సొంత ప్యాలెస్ కిటికీల కి రంగులు, 30 అడుగుల ఐరన్ గోడ కట్టుకోవడం తెలుసా??

  3. నువ్వు మరీ మబ్బుగాడిలా నటించకు ga….. అంచనాలు పెంచకుండా నొక్కేయడం ఎలాగ?

  4. నువ్వు విశాకలొ ఒక ప్యాలెస్స్ కట్తుకొవటానికె 500 కొట్లు కర్చు చెసావు!

    అమరవతిలొ ఒక్కొకటి సుమారు 50 అంతస్తుల 5 నిర్మాణాలు అని! మరి కర్చు కాకుండా ఎలా ఉంటుంది గురువిందా?

      1. అవి HOD, సెక్రటెట్, తదితర ప్రబుత్వ భవనాలు రా గూట్లె! అయన ఉంటానికి కట్టుకున్న ప్యాలెస్స్ కాదు! వెళ్ళి జగన్ ని అడుగు! నువ్వు ఉండదానికి కట్తుకొనె ప్యాలెస్స్ కి మెము ఎందుకు డబ్బులు కట్టని రా అని!

  5. Annual inflation 6% సరిపోయింది రా యెర్రి పుష్పం…మీరు ఎంత ఏడ్చినా గొఱ్ఱె సమాధి completed

Comments are closed.