ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావులో అసంతృప్తి ఎందుకు?

ఇంత‌కూ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌న‌సులో ఏముందో చెబితే క‌దా, చంద్ర‌బాబు తీర్చ‌డానికి? చిన్న‌పిల్ల‌ల్లా త‌న‌కు తానుగా అల‌క‌బూనితే ఎట్లా?

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఏం ఆశిస్తున్నారు? ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఆయ‌న్ను ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ నియ‌మించింది. కానీ ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకోలేదు. ఆ ప‌ద‌వితో ఆయ‌న సంతృప్తి చెంద‌లేద‌ని టీడీపీ అనుకూల మీడియా చంద్ర‌బాబుకు స‌మాచారం చేర‌వేసింది.

మ‌రోవైపు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుతో పాటు ప‌ద‌వి పొందిన మ‌రో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ సంతోషంగా ఉన్నారు. ఢిల్లీలో ఏపీ భ‌వ‌న్ కేంద్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారునిగా ఠాకూర్ నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు.

ఇప్ప‌టికీ ఏబీ వెంకటేశ్వ‌ర‌రావు కోరుకున్న‌ట్టుగా ఆయ‌న‌పై వైసీపీ ప్ర‌భుత్వం పెట్టిన కేసుల్ని కూట‌మి ప్ర‌భుత్వం ఎత్తేసింది. ఏబీవీ స‌స్పెన్ష‌న్ కాలంలో జీత‌భ‌త్యాల‌న్నింటినీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ ప్ర‌యోజ‌నాలే కాకుండా, ఆయ‌న రుణం తీర్చుకునేందుకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా నియ‌మించారు. టీడీపీకి తాను చేసిన సేవ‌ల‌కు ఇది చిన్న ప‌ద‌వి అని ఆయ‌న అసంతృప్తికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇంత‌కూ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌న‌సులో ఏముందో చెబితే క‌దా, చంద్ర‌బాబు తీర్చ‌డానికి? చిన్న‌పిల్ల‌ల్లా త‌న‌కు తానుగా అల‌క‌బూనితే ఎట్లా? అనే ప్ర‌శ్న టీడీపీ వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. టీడీపీకి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు సేవ‌ల్ని గుర్తు పెట్టుకునే, ఆయ‌న‌కు కావాల్సిన‌వ‌న్నీ చేశామ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా, క‌మ్మోళ్ల‌కు ఏమీ చేయ‌ర‌ని విమ‌ర్శించిన త‌ర్వాతే, ఆ విమ‌ర్శ‌లు త‌ప్ప‌ని పాల‌కులు నిరూపించుకున్న వైనాన్ని నాయ‌కులు గుర్తు చేస్తున్నారు.

పోలీస్ అధికారిగా విధుల నుంచి ఏబీవీ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసినా, టీడీపీకి సేవ‌ల విష‌యంలో ఆయ‌న అవిశ్రాంతంగా ప‌ని చేస్తూనే ఉన్నారు. టీడీపీ తీవ్రంగా వ్య‌తిరేకించే వైఎస్ జ‌గ‌న్‌పై ఆ పార్టీ శ్రేణులు సంతోషించేలా వాడు, వీడు అంటూ నోరు పారేసుకుంటున్నారు. అలాంటి త‌న‌కు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఏంట‌ని ఆయ‌న భావ‌నా? ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఏమైనా కోరుకుంటున్నారా? అనే అనుమానం టీడీపీ వ‌ర్గాల్లో లేక‌పోలేదు. ఏబీవీ అల‌క తీర్చే మార్గాన్ని టీడీపీ అన్వేషిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏబీవీ లాంటి న‌మ్మ‌క‌స్తుడైన మాజీ పోలీస్ అధికారి టీడీపీకి అవ‌స‌రం.

3 Replies to “ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావులో అసంతృప్తి ఎందుకు?”

  1. మరి నువ్వు అయన్నెమి చెసావ్!

    లెని కెసు పెట్టి, విచారణ పెరుతొ 4 గేల్లు అయనని సర్వీసుకి దూరం గా పెట్టావ్! సుప్రీం కొర్ట్ చెప్పినా వినలెదు! మరి అయన కి మండదా? మరి వాడు వీడు అనక తు.-.గ్ల.-.క్ గారు అంటాడా?

Comments are closed.