తిరుపతి ఆధ్యాత్మికక్షేత్రం. అక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హింసాత్మకంగా ఉండేవి కావు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ ప్రశాంత పాలనే ఉంటూ వచ్చింది ఇన్నాళ్లూ. కానీ తాజాగా సీన్ మారింది. ఎన్నికల వేళ ప్రాంతం వేడెక్కింది. హింస, కిడ్నాపుల పర్వం నడిచింది. ఎన్నికలంటే ఏదో అనుకునేరు! జస్ట్ డెప్యూటీ మేయర్ ఎలక్షన్ అంతే.
ఆ ప్రాంతంలో ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్న తెదేపా కూటమి డెప్యూటీ మేయర్ కుర్చీ లాక్కోవాలనుకుంది? ఎలా? ఎగస్పార్టీ వాళ్ల చేత కూడా ఓట్లేయించగలగాలి. అలా చేయాలంటే రౌడీయజమే మార్గమనుకున్నారు. లోకలా, పక్క జిల్లాల వాళ్లా, బెజవాడ బ్యాచా, ఇంకెవరన్నానా అనేది తెలీదు కానీ వైకాపా కార్పొరేటర్లు కనిపిస్తే దాడి చేసి, కిడ్నాప్ చేసి పట్టుకుపోయి వాళ్ల చేత ఓటేయించుకుని వదిలారు.
కిడ్నాప్ తర్వతా ఏం భయపెట్టారో, ఏ విధంగా మభ్యపెట్టారో తెలీదు కానీ వైకాపా వాళ్లు లొంగిపోయారు. ఈ రాజకీయ బలాత్కారానికి గురైన వైకాపా కార్పొరేటర్లు కరుణాకరరెడ్డి వద్దకు వచ్చి లబోదిబోమని సారీ చెప్పారు.
ఇదా ప్రజాస్వామ్యం?
దీని మీద ఈనాడు, జ్యోతి పత్రికలు రాయవేం?
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, హోం మినిస్ట్రీ కుంటుపడ్డాయని నిత్యం వాపోయే పవన్ కళ్యాణ్ మాట్లాడడేం?
ఉత్తపుణ్యానికే నోరు పారేసుకునే షర్మిల నోరు మెదపదేం?
“సబ్ కా సాథ్- సబ్ కా వికాస్” అని నినదించే భాజపా సౌండ్ చేయదేం?
ఎవ్వరూ కిమ్మనట్లేదు. అంతా గప్ చుప్.
ఇంతోటి దానికి ఎన్నికలెందుకు?
“వన్ నేషన్- వన్ ఎలక్షన్” సంగతి తర్వాత. అది చాలా పెద్ద విషయం. ముందు “వన్ స్టేట్ – వన్ ఎలక్షన్” పెట్టాలి. గెలిచిన ముఖ్యమంత్రి కార్పోరేషన్స్ ని డిసాల్వ్ చేసి, తనకు కావాల్సిన వాళ్లని నామినేట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎన్నికలు పెట్టడమెందుకు? ఈ బహిరంగ రాజకీయ మానభంగాలెందుకు? ఈ దిశగా రాజ్యాంగంలో మార్పులు అవసరమయ్యేలా ఉంది.
అయినా ఇక్కడొక చోద్యం చెప్పుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. 164 ఎమ్మెల్యే స్థానాలు, 21 ఎంపీ స్థానాలు వాళ్లవే. ఎక్కడ చూసినా వాళ్లదే అధికారం, వాళ్లదే హవా? ఒక్క తిరుపతి డెప్యూటీ మేయర్ పదవి కోసం ఇంత యాక్షన్ ఎపిసోడ్ దేనికి? కామెడీగా లేదు! ఒకవేళ వైకాపా అభ్యర్థి నెగ్గితే నష్టమేంటి? ఆ పదవితో అతనేం చేయగలడు?
గతంలో ఎప్పుడూ లేని హింస, రౌడీయిజం తిరుపతిలో ఇప్పుడు జరిగింది. అక్కడ తొలిసారిగా జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న తరుణంలోనే ఇది జరిగింది. రెండ్రోజుల అప్రజాస్వామికం రాజ్యమేలింది. బస్సుల మీద దాడి చేసి కిడ్నాపులు, ఇంటి మీదకొచ్చి ఎత్తుకెళ్లి ఓటేయించడాలు.. గతంలో ఎప్పుడూ చూడని దృశ్యాలు.
ఇలాంటి చర్యలవల్ల సాధించేదేంటి? రేపు అధికారం మారే రోజు వచ్చినప్పుడు అవతలి పార్టీ వాళ్లు దీనికి రెట్టింపు చేస్తారు. అప్పుడు మాత్రం తెదేపా మీడియా మొత్తం ఇదే వార్తని ప్రధానంగా చూపిస్తారు. ఇదా కావాల్సింది? ఇది ఒక్క తిరుపతిలోనే కాదు ఎక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నా రాష్ట్రంలో ఇదే వాతావరణం. అంత మెజారిటీ ఉన్నా ఎందుకంత అభత్రతా భావం?
జగన్ మీద రాజకీయ ప్రతీకారాలు తీర్చుకోవట్లేదు కనుక పైకి మాత్రం చంద్రబాబుని ధర్మరాజులా చిత్రీకరించే పనులు జరుగుతున్నాయి తెదేపా మీడియాలో. కానీ క్షేత్రస్థాయిలో జరిగే దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ అలాంటి సంఘటనలకి తావు ఇవ్వగలిగే ప్రభుత్వం నిజంగా తలచుకుంటే జగన్ ని, అతని అనుచరగణాన్ని, వైకాపా పాలనలో తెదేపా నాయకులపై నోరేసుకుని పడిపోయిన ప్రతి మంత్రిని ఇబ్బంది పెట్టగలరు. అంతటి కసి వాళ్లల్లో ఉంది. కానీ అలా పెట్టనీయకుండా ఆపుతున్నది ఎవరో మరి? చంద్రబాబులో ఉన్న ధర్మారాజా? లేక మోదీలో ఉన్న కృష్ణుడా? ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకోవచ్చు.
– హరగోపాల్ సూరపనేని
హారగోపాలా….బుర్ర దొబ్బినట్లు ఉంది..చెక్ చేయించుకో….తిరుపతి ఉప ఎన్నికలు గుర్తులేనట్లుఉన్నాయి
ఇక హింస, రౌడీయిజం గురించి మంచి లెక్చర్ ఇచ్చావ్ కానీ ఈ బుధి గత పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు ఉంటే ఇప్పుడు ఈ గతి పట్టేది కాదుగా?
అంత మెజారిటీ ఉండి ఎందుకు అంటావా? గత అయిదు ఏళ్ళ విధ్వంసం చూసాక బుద్ధి ఉన్న ఎవడైనా చిన్న అవకాశం అయినా ఇస్తారా?
areye babu soorapaneni haragopal….jaggubai nerpaadu veellu adhe aaharisthunnaru…aanadu gonthu vippi prasninchani sannasivi nuvvu…ippudu prasninche hakku neeku ledhu.
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, nvc
అమ్మ పత్తిత్తు సూరపనేని, ఇదే ప్రశ్నను ఇప్పుడు అడిగే దానిలో .001% అయిన గత 5 ఏళ్లలో ఒక్కసారైనా అడిగుంటే నువ్వు పత్తిత్తు కాకుండా వుండే వాడివి. ఏమి లాభం రా బాలరాజు నీవల్ల దేశానికి/ రాష్ట్రానికి?
Arre avuna mana vaadu cm gaa vunapudu nomination Kuda yekadaniki mana y chi pee vaalu ymei chesaeu chusam@
Inka em anipistundi neeku GA
Nine, nine, eight, nine, zero, six, four, two, five, five :- CB work