తిరుప‌తిలో డార్లింగ్ మంత్రి చిచ్చు!

ఎన్ని అరాచ‌కాలు చేసినా ఏమీ కాద‌ని, త‌మ పంతం నెగ్గింద‌ని డార్లింగ్ మంత్రి, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన వాళ్లు సంతోషిస్తూ వుండొచ్చు. కానీ ప్ర‌తిదానికీ ఓ లెక్క వుంటుంది.

ప్ర‌పంచంలోనే తిరుప‌తికి ఓ ప్ర‌త్యేక స్థానం. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి పాదాల చెంత కొలువుదీరిన తిరుప‌తికి ఆధ్మాత్మిక విశిష్ట‌త వ‌చ్చింది. కొండ‌పైన శ్రీ‌వారు, కొండ కింద ప‌ద్మావ‌తి అమ్మ‌వారు, ఆ దేవ‌దేవుని మాతృమూర్తి అయిన వ‌కుళామాత ఆల‌యం. తిరుప‌తి అంటే ప్ర‌శాంత‌త‌కు, భ‌క్తిత‌త్వానికి నిల‌యం. అలాంటి తిరుప‌తిలో కేవ‌లం డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకోడానికి డార్లింగ్ మంత్రి నేతృత్వంలో చిచ్చు పెట్టారు.

ఇంత వ‌ర‌కూ తిరుప‌తి వాసులు క‌నీవినీ ఎరుగ‌ని విధంగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల ఆస్తుల విధ్వంసం, కిడ్నాప్‌ల‌కు తెర‌లేపారు. దీంతో న‌గ‌ర‌వాసులు ఇంత‌కాలం ఏదైతే తిరుప‌తి గురించి గొప్ప‌గా చెప్పుకుంటున్నామో, ఆ న‌గ‌ర‌మేనా ఇది? అని ఆందోళ‌న‌తో ప్ర‌శ్నించుకునే ద‌య‌నీయ స్థితి. తిరుప‌తి విద్యాల‌యాల నిల‌యం.

గ‌తంలో తిరుప‌తి ఎస్వీ యూనివ‌ర్సిటీ, ఆర్ట్స్ కాలేజీల‌లో విద్యార్థుల మ‌ధ్య గొడ‌వ‌లు వుండేవి. ఇవేవీ పెద్ద‌గా న‌గ‌రంపై ప్ర‌భావం చూపేవి కావు. కానీ డార్లింగ్ మంత్రి త‌న ప‌ద‌విని కాపాడుకోడానికి, క‌నీస బ‌లం లేని చోట, బ‌లాత్కారానికి తెగ‌బ‌డి, ర‌చ్చ‌ర‌చ్చ అయ్యేలా చేశార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తిరుప‌తిలో గ‌త ఐదేళ్ల‌లో ఊహించ‌ని అభివృద్ధిని న‌గ‌రం సొంతం చేసుకుంది. న‌గ‌రానికి న‌లువైపుల నుంచి క‌నెక్టివిటీ రోడ్లు, ఏకంగా 20 మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌తో ఆస్తుల విలువ పెరుగుద‌ల‌, అలాగే టీటీడీ ఉద్యోగుల‌కు ఇళ్ల స్థ‌లాలు, వేత‌నాల పెంపు, ద‌శాబ్దాల త‌ర‌బ‌డి నిషేధిత జాబితాలో ఉన్న భూముల‌కు విముక్తి, న‌గ‌రంలో నాలుగు కూడ‌ళ్లలో ఒక్కో చోట స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల విగ్ర‌హాలు, సంగీతంతో మంత్ర ముగ్ధుల్ని చేసే వాయిద్య ప‌రిక‌రాల ఏర్పాటు, భ‌క్తుల్ని త‌న్మ‌యుల్ని చేసేలా అడుగ‌డుగునా సౌండ్ సిస్ట‌మ్‌… వావ్ ఇంత గొప్ప న‌గ‌రంలో జీవితం ఎంత హాయో అనుకునేవారు.

తిరుప‌తిలోనే పుట్టి పెరిగిన వాళ్లు కేవ‌లం 15 శాతం జ‌నాభా మాత్ర‌మే. మిగిలిన వాళ్లు తిరుప‌తి విశిష్ట‌త రీత్యా, అక్క‌డ ప్ర‌శాంతంగా జీవితాన్ని గ‌డ‌పొచ్చ‌ని ఇష్టంతో వ‌చ్చిన వాళ్లే. ఇక నిత్యం వేలాదిగా త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌తో తిరుప‌తి న‌గ‌రం కిట‌కిట‌లాడుతోంటోంది. ఎంతో సుంద‌ర‌మైన‌, క‌నుల‌విందు చేసే కొండ పాదాల చెంత‌, వీనుల‌విందు క‌లిగించే అన్న‌మ‌య్య ప‌ద‌కీర్త‌న‌ల్ని ఆస్వాదిస్తూ బ‌తుకుతున్న తిరుప‌తిని ఎక్క‌డి నుంచో వ‌చ్చిన‌ డార్లింగ్ మంత్రి త‌న మెహ‌ర్బానీ కోసం చిచ్చు ర‌గిల్చారు.

గ‌త వారం రోజులుగా తిరుప‌తి వాసులు వైసీపీ కార్పొరేట‌ర్లు, సాక్ష్యాత్తు ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, న‌గ‌ర ప్ర‌థ‌మ మ‌హిళ డాక్ట‌ర్ శిరీష‌ ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై ప‌ట్ట‌ప‌గ‌లే రౌడీమూక‌లు దాడుల్ని, సినీ ప‌క్కీలో కొట్టుకుంటూ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దాడుల్ని చూశారు. ఏమైంది మ‌న న‌గ‌రానికి? ఎందుకిలా? అని తిరుప‌తి న‌గ‌ర మ‌న‌సు క్షోభ‌కు గురైంది. తిరుప‌తి అంటే టెంపుల్ సిటీ. దేవుడు నిత్యం సంచ‌రించే న‌గ‌ర‌మ‌ని స్థానికులు న‌మ్ముతారు.

అయితే ఎన్ని అరాచ‌కాలు చేసినా ఏమీ కాద‌ని, త‌మ పంతం నెగ్గింద‌ని డార్లింగ్ మంత్రి, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన వాళ్లు సంతోషిస్తూ వుండొచ్చు. కానీ ప్ర‌తిదానికీ ఓ లెక్క వుంటుంది. దేవుడు లేదా ప్ర‌కృతి అంద‌రి స‌ర‌దాల్ని తీరుస్తుంది. తిరుప‌తి మ‌న‌సుని గాయ‌ప‌రిచిన వాళ్లెవ‌రూ ప్ర‌శాంతంగా ఉండ‌రు, ఉండ‌లేరు. మ‌నుషులతో ఆట‌లాడితే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ… కొంత కాలంగా తిరుప‌తి, తిరుమ‌ల కేంద్రంగా ఎవ‌రితో ఏం ఆడుతున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

5 Replies to “తిరుప‌తిలో డార్లింగ్ మంత్రి చిచ్చు!”

  1. మావోడు దేవున్నే ప్రత్యర్థిగా భావించి ఎదిరించి, నువ్వు ఉన్న కొండకే నేను రావాలా అంటూ.. ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్ వేసి దేవుణ్ణే తన కాళ్ళ దగ్గరికి రప్పించి ఆడుకున్నాడు తెలుసా??

  2. 2019 లో భూమన రెడ్డి మెజారిటీ 708 ఓట్లు , ఆ లెక్క లో చూసుకున్నా సగం డివిజన్లు రావాలి రావాలి టీడీపీ కి కానీ వైకాపా కి 48/50 ఎలా వచ్చాయి ? అభ్యర్థులని బెదిరించి 90 % డివిజన్లని ఏకగ్రీవం చేసుకున్న రౌడీలు భూమన తండ్రి కొడుకులు పి చ్చి రెడ్డి లెక్కలు ఆపి 2019-2024 లోకల్ బాడీ ఎలక్షన్ చిత్రాలు యూట్యూబ్ లో చూడు !! బందిపోటు దొంగలు వచ్చి దొంగతనం తప్పు మాట్లాడుతున్నారు

Comments are closed.