రేవంత్‌ దేశంలోనే ఫ‌స్ట్‌.. గురువు గారి వంతు ఎప్పుడు?

తెలంగాణ‌లో మాదిగ‌ల‌కు 9 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ రేవంత్‌రెడ్డి స‌ర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది.

దేనిలో అయినా తానే ఫ‌స్ట్ అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌ర‌చూ అంటుంటారు. టెక్నాల‌జీ వాడ‌కంలో త‌న త‌ర్వాతే ఎవ‌రైనా, అలాగే మ‌హిళా సంఘాల్ని ఏర్పాటు చేయ‌డంలోనూ, ఐటీ రంగాన్ని ప్రోత్స‌హించ‌డంలోనూ, జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది తానే అని చంద్ర‌బాబు అనేక సార్లు చెప్పారు. కొన్ని అంశాల్లో ఆయ‌న చొర‌వ‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు.

కానీ రేవంత్‌రెడ్డి స‌ర్కార్ తాజాగా ఒక విష‌యంలో దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింది. అదేటంటే.. తెలంగాణ‌లో మాదిగ‌ల‌కు 9 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ రేవంత్‌రెడ్డి స‌ర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. గ‌త ఏడాది ఆగ‌స్టులో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై రాష్ట్రాల‌కు స్వేచ్ఛ‌నిస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. మాదిగ‌ల‌కు అనుకూలంగా ఆ తీర్పు వుంది.

ఈ తీర్పు వ‌చ్చిన త‌ర్వాత మాదిగ‌ల‌కు అనుకూలంగా రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ దేశంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన మొద‌టి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. చంద్ర‌బాబు శిష్యుడిగా రేవంత్‌ను స‌మాజం చూస్తుంది. కానీ రేవంత్ మాత్రం చంద్ర‌బాబు స‌హ‌చ‌రుడిగా మాత్ర‌మే చెప్తారు. ఏది ఏమైనా స‌మాజ కోణంలో ఆలోచిస్తే, శిష్యుడు దూకుడుపై వుంటే, గురువు గారైన చంద్ర‌బాబు మాత్రం మాదిగ‌ల రిజ‌ర్వేష‌న్‌పై న‌త్తతో పోటీ ప‌డుతున్నారు.

పైగా చంద్ర‌బాబుతో ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. వ‌ర్గీక‌ర‌ణ‌కు తాము అనుకూల‌మే అని ఇప్ప‌టికే కూట‌మి స‌ర్కార్ ప్ర‌క‌టించింది. మ‌రి ఆచ‌ర‌ణ‌లో మాత్రం జాప్యం ఎందుకు చేస్తున్న‌దనే ప్ర‌శ్నఎమ్మార్పీఎస్ నుంచి వ‌స్తోంది.

తెలంగాణ‌లో మాదిగ‌ల‌కు 9 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన రేవంత్‌రెడ్డి స‌ర్కార్ తీరుపై మంద‌కృష్ణ మాదిగ మౌనందాల్చారు. నిన్న‌టి వ‌ర‌కూ ఆయ‌న మౌనం పాటించారు. పూర్తి వివ‌రాలతో ఇవాళ మాట్లాడ్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వ‌ర్గీక‌ర‌ణ‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ ముంద‌డుగు వేయాలంటే చాలా ప‌నులు చేయాల్సి వుంది. ఇంత‌కూ చంద్ర‌బాబు వంతు ఎప్పుడ‌నేదే ఇప్పుడు ప్ర‌శ్న‌.

5 Replies to “రేవంత్‌ దేశంలోనే ఫ‌స్ట్‌.. గురువు గారి వంతు ఎప్పుడు?”

  1. ప్రభుత్వం లో కీలక అధికార ఉద్యోగాల్లో వున్న ( హిందూ*మతం వదిలేసినా కూడా, ఉద్యోగం కోసం ఇంకా తాము హిందూ అనే అ*బద్ధం చెప్పి అంబేద్కర్ పెట్టిన రూల్స్ కి వ్యతిరేఖంగా వున్న) మాల సామా*జిక వర్గం వారు ఊరుకోరు.

    అసలే ఆ రెండు సామాజ్జక వర్గాలకి ఉప్పు నిప్పు.

    1. వీరు హిందూ మతం వదిలేసి క్రైస్తవ మతం మరి కొత్తగా వెళ్లే చర్చ్ ల లో కూడా మాల , మాదిగ సామాజిక వర్గాల చర్చి లు వేరుగా వుంటాయి. వేరే వారిని తమ చర్చ్ లోకి రానివ్వరు.

      ఆ వేరే సామాజిక వర్గం వారితో బంధాలు( పెళ్ళిళ్ళు, పేరంటాలు..) కలుపుకోరు.

  2. Arey andhralo maala eakkuva untaru maadiga thakkuva so late avuddi but telangana lo maala kante maadigalu eakkuva ventane implementation chesthunnaru intha chinna logic marchipoyav nu journalist vena asalu

Comments are closed.