తిరుమ‌ల‌లో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం!

క‌శ్మీర్‌లో ప‌ర్యాట‌కుల్ని టెర్ర‌రిస్టులు పొట్ట‌న పెట్టుకున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా భ‌ద్ర‌తపై కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది. ఇందులో భాగంగా ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన హిందూ క్షేత్రం తిరుమ‌ల‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. నిఘా వ‌ర్గాల…

క‌శ్మీర్‌లో ప‌ర్యాట‌కుల్ని టెర్ర‌రిస్టులు పొట్ట‌న పెట్టుకున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా భ‌ద్ర‌తపై కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది. ఇందులో భాగంగా ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన హిందూ క్షేత్రం తిరుమ‌ల‌లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌తో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్ని చేప‌ట్ట‌డం విశేషం.

తిరుమ‌ల‌కు చేరుకునే అన్ని మార్గాల్లోనూ ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టారు. ముఖ్యంగా అలిపిరి చెక్‌పోస్టులోనూ, ఘాట్‌రోడ్ల‌లోనూ విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు. సాధార‌ణంగా అలిపిరి త‌నిఖీ కేంద్రం వ‌ద్ద క్షుణ్ణంగా భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటారు. అయితే ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌పై హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌త్యేకంగా తిరుమ‌ల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించారు.

ఇందులో భాగంగా శ్రీ‌వారి ఆల‌యం చుట్టూ భ‌ద్ర‌తా సిబ్బంది మోహ‌రించారు. భ‌క్తుల రూపంలో అసాంఘిక శ‌క్తులు చొర‌బ‌డ‌కుండా ప్ర‌తిదీ క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. అలాగే తిరుమ‌ల‌లో భ‌ద్ర‌తా సిబ్బంది డేగ కన్ను వేశాయి. దేశంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించాల‌నే కుట్ర‌తో టెర్ర‌రిస్టులు ఎంత‌కైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు, వాళ్ల అమాన‌వీయ చ‌ర్య‌లు తెలియ‌జేస్తున్నాయి.

అందువ‌ల్ల ఏ మాత్రం అజాగ్ర‌త్త చూపినా, భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌ని భ‌ద్ర‌తా సిబ్బంది క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. తిరుప‌తిలో కూడా ప్ర‌ధానంగా ఆర్టీసీ బ‌స్టాండ్‌, రైల్వేస్టేష‌న్‌, అలాగే ప‌లు ఆల‌యాల వ‌ద్ద త‌నిఖీలు చేప‌ట్టారు. ఏ చిన్న అనుమానం క‌లిగినా, వెంట‌నే అదుపులోకి తీసుకుని విచారణ‌కు వెనుకాడ‌డం లేదు.

5 Replies to “తిరుమ‌ల‌లో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం!”

  1. ఏం సైట్ ఇది, అంత పెద్ద విఘాతం జరిగితే ఒక్క వ్యాసం కూడా లేదు 

  2. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

  3. Needhi news paper aa only gossip paper aa…kaneesam chinna article kuuda ledhu..yentha sepuu jagan ninpogadadam prabhutvanni tittadam…thu

Comments are closed.