ఉత్తరాంధ్రకు నిధులు తెస్తే గ్రేటే!

ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. దశాబ్దాలు గడచినా ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. అయితే విభజన తరువాత అయినా తలరాత మారుతుంది అనుకుంటే ఆ ఆశ కూడా ఎండమావిగా మారింది. విభజన చట్టంలో ఉత్తరాంధ్ర…

ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. దశాబ్దాలు గడచినా ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. అయితే విభజన తరువాత అయినా తలరాత మారుతుంది అనుకుంటే ఆ ఆశ కూడా ఎండమావిగా మారింది. విభజన చట్టంలో ఉత్తరాంధ్ర గురించి పేర్కొన్నారు. ఆర్ధికంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కూడా స్పష్టంగా తెలిపారు.

అయితే ఉత్తరాంధ్ర కు కేంద్రం నుంచి నిధులు వచ్చినది పెద్దగా లేదు. బుందేల్ ఖండ్ తరహా ప్రాజెక్టు ని మంజూరు చేసి ఉత్తరాంధ్రకు శాశ్వతంగా వెనకబాటుతనాన్ని తరిమివేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మేధావులు ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

కేంద్రం అయితే 2014 నుంచి మొదటి మూడేళ్ళూ ఒక్కో జిల్లాకు యాభై కోట్లు వంతున మూడు జిల్లాలకు కలిపి నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఇచ్చింది. ఆ నిధులను దేనికి ఖర్చు చేశారు అన్న దాని మీద యుటిలైజేషన్ సర్టిఫికేట్లను కేంద్రం రాష్ట్రాన్ని కోరిందని ఆ తరువాత నిధులు ఆపేసింది అని ప్రచారంలో ఉంది.

మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి ఆదుకుంటామని పేర్కొంది. ఆ నిధులు ఎన్ని ఇస్తారు ఏ విధంగా ఆర్ధికంగా ఊతం ఇస్తారు అన్నది అయితే ఎక్కడా స్పష్టత లేదు. గతంలో ఇచ్చినట్లుగా జిల్లాకు యాభై కోట్లు ఇస్తారా లేక బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ ని ఇస్తారా అన్నది ఎవరికి తోచిన తీరున వారు ఆలోచిస్తూ సంతృప్తి పడుతున్నారు.

లేటెస్ట్ గా చూస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆయన వెనకబడిన జిల్లాలకు కేంద్ర సాయం కోరుతారని బడ్జెట్ లో చెప్పిన విధంగా చేయమని గుర్తు చేస్తారని అంటున్నారు. అదే జరిగి కేంద్రం ఉత్తరాంధ్ర కు నిధులు ఇచ్చినా స్పెషల్ గ్రాంట్స్ రూపంలో సాయం చేసినా ఈ ప్రాంతం ధన్యత చెందినట్లే. ఉత్తరాంధ్రకు ఆ మేరకు సాయం కేంద్రం చేత చేయించినట్లు అయితే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ధన్యత సాధించినట్లే అని అంటున్నారు.

3 Replies to “ఉత్తరాంధ్రకు నిధులు తెస్తే గ్రేటే!”

  1. మన అన్న కి 11×2 ఎంపీ లు ఉన్నపుడు ఎన్నో నిధులు తెచ్చి ఉత్రాంధ్ర డెవలప్ చేసేస్తే .. మళ్ళి నిధులు తేమంటావు ఏమిటి ..

Comments are closed.