ఆ జిల్లాపై వైసీపీ ఫోకస్

పోయిన చోట వెతుక్కోమని ఒక పాత సామెత ఉంది. రాజకీయ నాయకులకు బహు చక్కగా ఇది వర్తిస్తుంది.

పోయిన చోట వెతుక్కోమని ఒక పాత సామెత ఉంది. రాజకీయ నాయకులకు బహు చక్కగా ఇది వర్తిస్తుంది. వైసీపీ విషయమే తీసుకుంటే ఆ పార్టీకి 2024 ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి. 2019లో మొత్తం అన్ని స్థానాలనూ అనకాపల్లి జిల్లాలో గెలుచుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో బోణీ కొట్టలేదు.

దాంతో అనకాపల్లి జిల్లాలో బలపడాలని వైసీపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ నేత, బలమైన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అనకాపల్లి జిల్లా బాధ్యతలను వ్యూహాత్మకంగానే వైసీపీ అధినాయకత్వం అప్పగించింది.

హెచ్చు సంఖ్యలో ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికే ఈ నియామకం అని అంటున్నారు. లేటెస్ట్ గా తాడేపల్లిలో కరణం ధర్మశ్రీ అధినేత జగన్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటుని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించాల్సిన అవసరాన్ని, బాధ్యతను గుర్తు చేస్తూ అధినేత దిశా నిర్దేశం చేశారు.

ఇప్పటికే జిల్లా పరిధిలో పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్న వైసీపీ నేతలు అధినేత సూచనలతో మరింత దూకుడు చేయాలని నిర్ణయించారు. రూరల్ బెల్ట్ లో వైసీపీకి గట్టి పట్టు ఉంది. సూపర్ సిక్స్ హామీలు నెరవేరకపోవడంతో పాటు ఇతర అనేక కారణాల వల్ల కొత్త ప్రభుత్వం మీద నెమ్మదిగా పెరుగుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి జిల్లా వైసీపీ పెద్దలు కార్యాచరణను రూపొందించేందుకు పనిలో పడ్డారు. రాజకీయ కేంద్రంగా చెప్పుకునే అనకాపల్లి పరిధిలో వైసీపీని బలోపేతం చేస్తే ఈ ప్రభావం విశాఖ జిల్లా మీద కూడా పడుతుందని స్థానిక ఎన్నికల నాటికి ఫ్యాన్ పార్టీ జోరు చేయడం ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు.

17 Replies to “ఆ జిల్లాపై వైసీపీ ఫోకస్”

  1. Some time ago in this same website they mentioned that there is no guarantee that these so called incharges will be offered assembly tickets. If that is true, is he a new scape goat?

    1. కడుపైనతరువాత బిడ్డ బైటికి రావటానికి తొమ్మిది నెలలు కనీసం సమయం పడుతుంది. మరి ప్రభుత్వం వచ్చి ఇంకా కనీసం సంవత్సరం పూర్తి కాలేదు. అప్పుడే సూపర్ సిక్స్ అమలు కాలేదు ప్రభుత్వ వ్యతిరేకత వంకాయ అనుకుంటూ వ్యసాలు. రేయ్ అసలు కాస్తన్నా సిగ్గుందారా? థు ఎదవ నా…….

  2. పోయింది సొంత ఆస్థి కాదు .. ప్రజలు ఇచ్చింది .. మళ్ళి ఇవ్వాల్సింది ప్రజలు ..

  3. కరెక్ట్…అప్పట్లో అసెంబ్లీ లో పద్యాలూ, బుర్ర కధలతో జగన్ ని పొగిడేవాడు…ఈయన అయితే కరెక్ట్….మంచి బుర్ర కథలు చెప్తాడు

  4. జిల్లా పార్టీ భాద్యతలు ఇస్తే సరిపోతుందా సామాజిక వర్గం మొత్తం జై కొడతారా పార్టీ కి..

  5. అయ్యి బాబోయ్, ఎంత పని జరిగి పోనాది! కూటమి మింద పెజా ఎతిరేకత వచ్చేసుండాదా? ఇంకేటి సేత్తాం

Comments are closed.