జగన్ పై బాలకృష్ణ ఫైర్.. అసలు కథ అది!

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బాలకృష్ణ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేశారు. అది ఒక ప్రెస్ నోట్ రూపంలో! హిందూపురంలో బాలకృష్ణ ఆఫీసు నుంచి ఆ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. ఎమ్మెల్యేగా హిందూపురానికి…

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బాలకృష్ణ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేశారు. అది ఒక ప్రెస్ నోట్ రూపంలో! హిందూపురంలో బాలకృష్ణ ఆఫీసు నుంచి ఆ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. ఎమ్మెల్యేగా హిందూపురానికి బాలకృష్ణ ఎలాగూ అందుబాటులో ఉండరు. అయితే అక్కడ నుంచి ప్రెస్ నోట్లు విడుదల అయిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజా ప్రెస్ నోట్ ఒకింత కామెడీగా ఉంది. ఆ ప్రెస్ నోట్లో జగన్ ప్రభుత్వాన్ని బాలకృష్ణ విమర్శించేశారు.

విత్తన వేరుశనగ పంపిణీ సక్రమంగా లేదని, రైతులకు విత్తనాలను అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందని హిందూపురం ఎమ్మెల్యేగారు తేల్చారు. ఆ మేరకు విమర్శలతో ప్రెస్ నోట్ విడుదల చేశారు.
అయితే కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్టుగా ఉంది బాలకృష్ణ తీరు. ఎందుకంటే.. విత్తన వేరుశనగ పంపిణీలో సమస్యలు తలెత్తడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంది.

ఎందుకంటే… విత్తన వేరుశనగ పంపిణీ అనేది గత నెలరోజుల వ్యవహరం కాదు. అంతకన్నా ముందు నుంచినే మొదలు కావల్సిన ప్రక్రియ. విత్తన వేరుశనగను పంచేది గత పక్షంరోజుల నుంచినే అయినా, సేకరించే ప్రక్రియ గత ఆరునెలల్లో జరగాల్సిన అంశం!

అప్పటి ప్రభుత్వం విత్తనాలను సేకరించి పెట్టాల్సింది. ఇప్పుడు వాటి పంపిణీ జరగాలి. అయితే అప్పుడు విత్తన సేకరణలో అలసత్వంగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు కొంతవరకూ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించకుండా ప్రెస్ నోట్ విడుదల చేశారు బాలకృష్ణ. ముందుగా చేసి పెట్టాల్సిన పనిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విఫలం అయ్యిందని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది బాలకృష్ణ తీరు!

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి