టీడీపీలో బిగ్ వికెట్ డౌన్… ?

అదేంటో విశాఖ తెలుగుదేశం పార్టీకి అసలు రోజులు బాగాలేనట్లుగా ఉన్నాయి. లేకపోతే పోయిన వారు పోగా ఉన్న వారు కూడా గుడ్ బై కొడతామంటూ సంకేతాలు ఇవ్వడమేంటి. Advertisement విశాఖ సిటీలో రెండేళ్ల క్రితం…

అదేంటో విశాఖ తెలుగుదేశం పార్టీకి అసలు రోజులు బాగాలేనట్లుగా ఉన్నాయి. లేకపోతే పోయిన వారు పోగా ఉన్న వారు కూడా గుడ్ బై కొడతామంటూ సంకేతాలు ఇవ్వడమేంటి.

విశాఖ సిటీలో రెండేళ్ల క్రితం నాలుగు సీట్లు గెలిచిన టీడీపీ తన సత్తా చాటింది. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో బలమైన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా పోలోమంటూ వైసీపీ రూటు పట్టేశారు. 

ఇక ఒక టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరారు. మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. అది స్పీకర్ పరిశీలనలో ఉంది. ఉన్న ఇద్దరిలో ఒకాయన సైలెంట్.

ఇలా టీడీపీలో సీన్ ఉంది. ఇక పార్టీ పరంగా చూసుకుంటే అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ మీదనే భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆ ఇబ్బందులో ఉంటే ప్రధాన కార్యదర్శిగా గట్టిగా వాయిస్ వినిపిస్తున్న ఒక బలమైన నాయకుడు తాను పార్టీకు గుడ్ బై కొడతాను అంటూ గట్టిగానే సంకేతాలు ఇస్తున్నారు. 

అధినాయకత్వం పోకడలు నచ్చకనే ఆయన తప్పుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన కనుక తప్పుకుంటే మాత్రం టీడీపీకి విశాఖలో సముద్రమంత కష్టాలు వచ్చినట్లే అంటున్నారు. మరో వైపు గెలిచిన కార్పోరేటరల్లో ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. మరి కొందరు ఆయన బాటలో ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి విశాఖ టీడీపీలో  ఏం జరుగుతుందో.