ఆరోగ్య పరీక్షల కోసం ఆ టైమ్ లో వెళ్తారా?

ఎవరైనా రొటీన్ హెల్త్ చెకప్ కోసం సాధారణ వేళల్లో వెళ్తారు. టెస్టులు చేయించుకొని ఇంటికొచ్చేస్తారు. అవసరమైతే హాస్పిటల్ లో ఓ రోజు ఉంటారు. కానీ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మాత్రం…

ఎవరైనా రొటీన్ హెల్త్ చెకప్ కోసం సాధారణ వేళల్లో వెళ్తారు. టెస్టులు చేయించుకొని ఇంటికొచ్చేస్తారు. అవసరమైతే హాస్పిటల్ లో ఓ రోజు ఉంటారు. కానీ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మాత్రం ఆరోగ్య పరీక్షల కోసం ఉదయం 3 గంటలకు హాస్పిటల్ కు వెళ్లారు. ఆ పార్టీ విడుదల చేసిన అధికారిక ప్రకటన చూస్తే ఇదే విషయం అర్థమౌతుంది.

విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనేది వాస్తవం. ఆయనను ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారాయన. అయితే కొద్దిసేపటి కిందట పార్టీ మాత్రం, విజయ్ కాంత్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, రొటీన్ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని ప్రకటించి అనుమానాలు రేకెత్తించింది.

రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఉదయం 3 గంటలకు ఎవరైనా హాస్పిటల్ కు వెళ్తారా? ఒకవేళ వెళ్లినా 2 రోజుల పాటు హాస్పిటల్ లో ఉంటారా? ఇదే విషయాన్ని కార్యకర్తలు లేవనెత్తుతున్నారు. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, హాస్పిటల్ బయట ఆందోళనకు దిగారు.

గతేడాది కరోనా బారిన పడ్డారు విజయ్ కాంత్. వైరస్ సోకి ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ టైమ్ లో కూడా ఆయన హెల్త్ కండిషన్ పై పార్టీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. 

హాస్పిటల్ లో జాయిన్ అయిన 2 రోజులకు కరోనా అనే విషయాన్ని ప్రకటించారు. ఆయన కోలుకున్న తర్వాత కూడా మరోసారి హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు కూడా రొటీన్ హెల్త్ చెకప్ అంటూ కవర్ చేశారు.