యవ్వనంలో పొందే తొలి తొలి సెక్స్ అనుభవం ప్రతి ఒక్కరికీ నిస్సందేహంగా మధురమైనదే. ఆ అనుభవం కూడా ఇష్టంతో జరిగితే.. ఆ అనుభూతికి హద్దే ఉండదు. అయితే.. అలాంటి సమయంలో కూడా… బోలెడన్ని సందేహాలు! అంత వరకూ లేని అనుభవం అది, ఎంతగానో కోరుకునే అనుభవం అది. అలాంటప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా.. జరిగేది రసాభసే!
దేహాల కలయికకు సంబంధించి ఎన్నో సందేహాలు తొలి శృంగారానుభూతికి ముందు ఉండనే ఉంటాయి. వాటి గురించి నివృత్తి చేసే నిపుణులు ఏమంటారంటే.. ఫస్ట్ సెక్స్ ను మధురానుభూతిగా మార్చుకోవడం కష్టమేమీ కాదని అంటున్నారు. కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించుకుంటే చాలని చెబుతున్నారు. అవేమిటంటే..
అవతల వాళ్ల పూర్తి సమ్మతి తెలసుకోవడం.. తొలి సెక్స్ కు సంబంధించిన ఫస్ట్ కండీషన్ ఏమిటంటే, మీ పార్ట్ నర్ పూర్తి సంసిద్ధంగా ఉన్నారా లేదా.. అనేది తెలుసుకోవడం! ఆడ అయినా, మగ అయినా.. పూర్తిగా పరస్పర సమ్మతితో ఉండటం తొలి సెక్స్ అనుభవాన్ని అందంగా మార్చే తొలి మెట్టు. మీ పార్ట్ నర్ మీకు ఎంతగా తెలిసినా, పరస్పరం మీరు ఎంత అర్థం చేసుకున్నా.. తొలి శృంగారానుభవానికి మాత్రం పరస్పర పూర్తి సమ్మతి ఉండాల్సిందే. అప్పుడే అది పండుతుంది.
వేరే ఒత్తిళ్లు వద్దు.. ఒక్కసారి పరస్పర సమ్మతి దొరికాకా.. ఇక వేరే ఒత్తిళ్లు పెట్టుకోకూడదు. అప్పుడు శృంగారం మాత్రమే మ్యాటర్!
మాట్లాడుకుంటూ.. ఒక్కసారి కదనరంగంలోకి దిగాకా.. ప్రతి నిమిషం ఒకరి గురించి మరొకరు కేర్ తీసుకోవడం అవసరం. ఏ మాత్రం అన్ కంఫర్టబుల్ లేకుండా చూసుకోవాల్పిన బాధ్యత పరస్పరం ఉంటుంది.
పలు రకాల శృంగారం.. ఓరల్ సెక్స్, వెజినల్ సెక్స్, ఎనల్ సెక్స్.. ఇలాంటి భిన్నఅనుభవాలు ఉన్నప్పటికీ, తొలి అనుభవంలో ప్రయోగాలు అంత గొప్పవి కాకపోవచ్చు.
ఫోర్ ప్లే దే కీలక పాత్ర.. తొలి అనుభవంలో ఫోర్ ప్లేదే కీలక పాత్ర. వందో అనుభవం లో కూడా దానిదే కీలక పాత్ర. అసలు యాక్ట్ కన్నా ముందు.. వీలైనంత ఎక్కువ సేపు ఫోర్ ప్లేతో పరస్పరం రంజింపజేసుకోవడం ఉత్తమమైన పని.
సెక్స్ అంటే ఫన్ కూడా..అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తొలి అనుభవం పరీక్ష లాంటిదే అయినా, అది బోలెడంత ఫన్ తో కూడుకున్నది కూడా. ఈ విషయంలో అతిగా ఆలోచించడం కన్నా, సరదా సరదాగా గడిపిస్తే అదే బోలెడంత మధురానుభూతి. అది యవ్వనానికి వచ్చిన వారికి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు కూడా!