Advertisement

Advertisement


Home > Politics - Gossip

అసెంబ్లీలో మోగని 'గంట'.. కారణం రూ.500 కోట్లు?

అసెంబ్లీలో మోగని 'గంట'.. కారణం రూ.500 కోట్లు?

పొద్దున్న లేస్తూనే జగన్ ను ఎలా తిట్టాలి, ఏ విషయంలో విమర్శించాలని ఆలోచించే వ్యక్తి ఆయన. జగన్ ను తిట్టడానికే ఈయనకు మంత్రిపదవి ఇచ్చారేమో అనిపించేలా ఉండేది ఆయన వ్యవహార శైలి. అలా జగన్ ను తిట్టే బ్యాచ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆయన ఫొటో కాదు కదా, కనీసం ఆయన స్టేట్ మెంట్ కూడా వార్తల్లో రావడంలేదు.

ఇవన్నీ ఒకెత్తయితే, ప్రస్తుతం నడుస్తున్న బడ్జెట్ సమావేశాలు మరో ఎత్తు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం నుంచి కేవలం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గోరంట్ల.. ఇలా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. గంటా వాయిస్ మాత్రం వినిపించడం లేదు. అసలాయన అసెంబ్లీలో కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? గంటా ఎందుకింత మౌనం వహించారు?

మొన్నటివరకు ఈ వ్యవహారంపై చాలా ఊహాగానాలు నడిచాయి. కేవలం టీడీపీని వీడి వైసీపీలో చేరే ఉద్దేశంతోనే గంటా ఇలా సైలెంట్ అయ్యారని చాలామంది అనుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం గంటా మౌనం వెనక 500 కోట్ల రూపాయల భూపందేరం దాగుంది. అవును.. గంటా తెరవెనకే ఉండిపోవడానికి ప్రధాన కారణం ఈ 500 కోట్ల భూపందేరమే అంటున్నారు విశ్లేషకులు.

విశాఖలో భూముల ఆక్రమణలకు సంబంధించి గడిచిన ఐదేళ్లలో వచ్చిన కథనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగుదేశం నేతలు విశాఖలో విచ్చలవిడిగా భూముల్ని ఆక్రమించుకున్నారు. ప్రైవేటు భూముల్ని కబ్జాలు చేయడంతో పాటు.. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. వీటిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో పోరాటం చేసింది. కానీ తన అధికార బలంతో టీడీపీ దాన్ని తొక్కిపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం వెనక గంటా ఉన్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారింది. టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన వెంటనే అవినీతిరహిత పాలన అందిస్తానని శపథం చేశారు జగన్. చెప్పినట్టుగానే ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, అమరావతి భూములు, పోలవరం ప్రాజెక్టు.. ఇలా ఎన్నో అంశాలపై సమగ్ర దర్యాప్తునకు కమిటీని ఏర్పాటుచేశారు. అలా అవినీతిరహిత సమాజం దిశగా దూసుకుపోతున్న జగన్.. విశాఖ భూ ఆక్రమణలపై కూడా దృష్టిపెట్టారు. ఇదే గంటా భయానికి కారణం.

అసలు ఇవన్నీ కవర్ చేసుకునే ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారాలని అనుకున్నారు. వచ్చేది రాజన్న ప్రభుత్వం అనే విషయం గంటాకు ఎన్నికలకు 6 నెలల ముందే తెలుసు. అందుకే ఆయన ఎన్నికలకు ముందు నుంచే తన ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. విజయసాయిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి లాంటి నేతలు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెబుతారు.

అలా వైసీపీలో చేరడానికి తలుపులు మూసుకుపోవడంతో ప్రస్తుతం గంటా సైలెంట్ అయ్యారు. పాలనలో శరవేగంగా దూసుకుపోతున్న ఈ టైమ్ లో జగన్ పై విమర్శలు చేస్తే.. విశాఖ భూపందేరంతో పాటు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖలో జరిగిన అవకతవకల్ని కూడా జగన్ వెలికితీసే ప్రమాదముందని గంటా భావిస్తున్నట్టున్నారు.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?