టీటీడీలో సూప‌ర్‌బాస్‌!

టీడీపీ శ్రేణులకు ఇంత‌కూ అధికారంలో పెత్త‌నం త‌మ‌దా?. బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌దా?

టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడు, బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి సూప‌ర్‌బాస్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. టీటీడీ చైర్మ‌న్‌గా మీడియా ఛానెల్ అధిప‌తి బీఆర్ నాయుడిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏరికోరి నియ‌మించారు. పేరుకే బీఆర్ నాయుడు చైర్మ‌న్ అని, వ్య‌వ‌హారాల‌న్నీ టీటీడీ స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి చ‌క్క‌బెడుతున్నార‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌భుత్వంలో టీడీపీ పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజ‌కీయ నాయ‌కుడు కాక‌పోవ‌డం, స్వామి వారిని సేవ చేసుకునే ప‌ద‌వి ద‌క్కింద‌నే ఆనందంలో ఎవ‌రినీ ప‌ట్టించుకోకుండా, భానుప్ర‌కాశ్‌రెడ్డికి పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నే రీతిలో ఆ రెండు పార్టీల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

టీటీడీ అనుకూల మీడియా అధినేత మాత్ర‌మే కావ‌డం, రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో ఎలాంటి అనుబంధం లేదు. ఇదే స‌మ‌యంలో బీఆర్ నాయుడి టీవీ ఛానెల్‌లో భాను నిత్యం డిబేట్ల పేరుతో కూచుని, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ, ఆ యాజ‌మాన్యానికి చేరువ అయ్యారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ నాయుడికి తిరుప‌తిలో అత్యంత స‌న్నిహిత వ్య‌క్తిగా మారిపోయారు.

స‌హ‌జంగా బీజేపీలో భానుపై విమ‌ర్శ ఏంటంటే.. ఆయ‌న రెండు చోట్ల మాత్ర‌మే క‌నిపిస్తుంటార‌ని. ఒక‌టి విమానాశ్ర‌యంలో, రెండు తిరుమ‌ల ఆల‌యం ఎదుట‌. ఇవి కాకుండా అద‌నంగా భాను రెగ్యుల‌ర్ విధులు ఏంటంటే… టీడీపీ అనుకూల ఛానెల్స్ డిబేట్స్‌లో పాల్గొన‌డం. టీటీడీ చైర్మ‌న్‌కు ఉన్న ప‌రిమితులు, అలాగే త‌న పాల‌క మండ‌లి స‌భ్య‌త్వాన్ని అడ్డు పెట్టుకుని టీటీడీలో చైర్మ‌న్ త‌ర్వాత‌, అంతా తానే అనే భావ‌న క‌లిగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి.

గ‌తంలో మాదిరిగా టీటీడీలో బ‌ల‌మైన ఉన్న‌తాధికార వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం, తెలుగుదేశం నుంచి స్థానికంగా ఎవ‌రూ బోర్డు స‌భ్యులు లేక‌పోవ‌డం, జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు పాత్ర ఏంటో అర్థంకావ‌డం లేదు. దీంతో భానుప్ర‌కాశ్ ఆడిందే ఆట‌, పాడిందే పాట‌గా మారింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి స‌భ్యుడైన న‌ర‌సింహ‌యాద‌వ్‌, తిరుప‌తిలో బ‌ల‌మైన టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌, మంత్రి లోకేశ్‌కు స‌న్నిహితుడైన వ‌ర్మ టీటీడీ చైర్మ‌న్ బీఆర్‌నాయుడిని క‌లిసి స్థానిక స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు వెళ్లారు.

ఈ సంద‌ర్భంలో చైర్మ‌న్ ప‌క్క‌న భాను ఆశీనులై వుండ‌గా, కీల‌క టీడీపీ నేత‌లంతా ప్ర‌తిప‌క్ష నేత‌ల్లా దీనంగా కూచున్నారు. ఈ స‌న్నివేశం చూసిన టీడీపీ శ్రేణులకు ఇంత‌కూ అధికారంలో పెత్త‌నం త‌మ‌దా?. బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌దా? అనే అనుమానం త‌లెత్తింది. అయిన‌ప్ప‌టికీ లోకేశ్‌కు, పార్టీకి విధేయులైన‌, స‌న్నిహితులైన నేత‌ల ప‌రిస్థితే ఇట్లా వుంటే, మ‌నం చేయ‌గ‌లిగేది ఏముంది? తిరుప‌తిలో త‌మ వాళ్ల‌ను గౌర‌వంగా చూసుకోవాల‌ని అనుకుంటే టీడీపీ పెద్ద‌లు జోక్యం చేసుకోవాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

4 Replies to “టీటీడీలో సూప‌ర్‌బాస్‌!”

  1. WASTE TTD BOARD CHAIRMAN BOLLIGADU, NEWGEN NAIDU.. HE PAID LUMPSUM AMOUNT AND DID PIMP WORK TO CBN AND BECAME TTD CHAIRMAN OKKADANNA MANCHI VAADU VUNNADU TTD BOARD LO ANTHA COLLECTION AGENT LU..TTD NEW ID CARDS ICHI 3 MONTHS AVUTHUNDI AND INTAVARAKU SETTLEMENT LEDHU VALLA FAMILIES KI…VEEDI OWN MONEY EMANNA ISTUNNADA? JAGAN EE BETTER ANIPISTUNDI…

Comments are closed.