ఈసారి సంక్రాంతికి మూడు సినిమా కోడి పుంజులు బరిలోకి దిగుతున్నాయి. ఈ మూడు సినిమాల ట్రయిలర్లు రెడీ అవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో బయటకు రాబోతున్నాయి. ఇప్పటికే ట్రయిలర్ల రఫ్ కట్ లు రెడీ అయిపోయాయి. ఫైనల్ కట్ లు ఫిక్స్ అయితే, నేపథ్య సంగీతం జోడించి బయటకు వదులుతారు. ట్రయిలర్లకు కూడా డిఐ లాంటి అదనపు హంగులు ఎలాగూ తప్పవు.
గేమ్ ఛేంజర్ ట్రయిలర్ 4న బయటకు వచ్చే అవకాశం వుంది. భారీ సినిమా కావడంతో ట్రయిలర్ నిడివి మూడు నిమిషాల కన్నా ఎక్కువే వుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కంటెంట్ కు సంబంధించి కొంత అవగాహన వుంది. ఇప్పుడు కొత్తగా ఏం చూపిస్తారు అన్నది చూడాలి. పాటలు, భారీతనం చూపించేసారు. కంటెంట్ కొంత పరిచయం చేసారు. హీరో రామ్ చరణ్ రెండు షేడ్స్ పరిచయం చేసేసారు. అందువల్ల ట్రయిలర్ లో అంతకు మించి ఏం చూపించబోతున్నారన్నది కాస్త ఇంట్రస్టింగ్ విషయమే.
గేమ్ ఛేంజర్ ట్రయిలర్ కన్నా ముందుగా నందమూరి బాలకృష్ణ డాకూ మహరాజ్ ట్రయిలర్ బయటకు వచ్చే అవకాశం వుంది. రెండున విడుదలకు వీలు అవుతుందేమో అని ప్రయత్నిస్తున్నారు. ఈ ట్రయిలర్ ఎలా వుంటుంది అన్న అసక్తి వుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ కంటెంట్ బయటకు రాలేదు. పాత్రల పరిచయం కాలేదు. అందువల్ల కచ్చితంగా ఈ ట్రయిలర్ కు అలాంటి అట్రాక్షన్ వుంటుంది. ట్రయిలర్ కట్ అటు యాక్షన్, ఇటు ఎమోషన్ రెండూ మిక్స్ చేసి వదులుతున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పెట్టుకుని వస్తున్న సినిమా వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబినేషన్ ది. ఈ సినిమా కంటెంట్ ఇప్పటికే ఎక్కువే వచ్చింది. రెండు పాటలు వచ్చాయి. బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరో పాట రాబోతోంది. దాని తరువాతనే ట్రయిలర్ వుంటుంది. అయిదు లేదా అరు తేదీల్లో ట్రయిలర్ విడుదల వుండొచ్చు. ఏపీలోని ఏదో ఒక టౌన్ లో ట్రయిలర్ విడుదల చేయాలనే ఐడియా వుంది. ఈ ట్రయిలర్ మొత్తం హీరో, ఇద్దరు హీరోయిన్ల మీదనే వుంటుందని తెలుస్తోంది. సినిమా కథ ఎలా స్టార్ట్ అవుతుంది. ఎలా ముందుకు సాగుతుంది అన్నది ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ట్రయిలర్ లో చూపించే విధంగా కట్ వుంటుందని తెలుస్తోంది.
మొత్తానికి న్యూ ఇయర్ ఫస్ట్ వీక్ లో మూడు ట్రయిలర్లు వస్తున్నాయి. బీ రెడీ.
We are waiting for game changer