అతిగా ఊహించుకుంటున్న చంద్రబాబు!

‘సహజంగా ప్రతి ఒక్కరికీ అత్యంత ఇష్టమైనది తన పేరు’ అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు. అందుకోసమే.. ఏ వ్యక్తితో పరిచయం అవుతున్నా.. తమకంటె కిందస్థాయి వారైనా సరే.. వారిని పేరుతో పిలిస్తే ఎక్కువ…

‘సహజంగా ప్రతి ఒక్కరికీ అత్యంత ఇష్టమైనది తన పేరు’ అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు. అందుకోసమే.. ఏ వ్యక్తితో పరిచయం అవుతున్నా.. తమకంటె కిందస్థాయి వారైనా సరే.. వారిని పేరుతో పిలిస్తే ఎక్కువ సంతోషిస్తారనేది ఒక అధ్యయనం. అలా ప్రతివాడికీ తన గురించి తనకు చాలా ఇష్టం ఉంటుంది. కొందరికి తన అందంపై తనకు అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చంద్రబాబునాయుడుకు మాత్రం.. ప్రజలు తనను దారుణంగా తిరస్కరించినా కూడా.. తన శక్తి సామర్థ్యాలపై అతిగా నమ్మకాలు ఇంకా మిగిలి ఉన్నట్లున్నాయి.

చంద్రబాబు.. తాను కుప్పంలో అడుగుపెట్టిన తర్వాత.. చరిత్రలో తొలిసారిగా అత్యల్ప మెజారిటీని అందించిన, ఒక రౌండులో తనకంటె ప్రత్యర్థికే మెజారిటీ కట్టబెట్టిన ఓటర్లను కలుసుకోవడానికి కుప్పం వెళ్లారు. అక్కడి కార్యకర్తలతో మాట్లాడుతూ… రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తానే పెద్ద సమస్యగా మారిపోయినట్లున్నదంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

ప్రజావేదిక నిర్మాణాన్ని కూలగొట్టడం, తాను నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు ఇవ్వడం గురించి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అక్రమాలపై చర్య తీసుకోవడంలో భాగంగా జరిగిన నిర్ణయాలను కూడా తన హీరోయిజం చూసి జగన్ సర్కారు భయపడుతుననట్లుగా బిల్డప్ ఇవ్వడం అనేదతి చంద్రబాబుకు మాత్రమే చెల్లింది.

నిజానికి జగన్ ప్రభుత్వం దూకుడుచూసి బాబు సిగ్గుపడాలి. ప్రజావేదిక అనే నిర్మాణాన్ని కేవలం కమిషన్ల కక్కుర్తితో అనుమతులే లేకుండా ప్రభుత్వ సొమ్ము తగలేసి నిర్మించినందుకు బాధపడాలి. ఇన్నాళ్లుగా రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహించే తరహాలో… లింగమనేని ఇంట్లో అద్దెకు ఉన్నందుకు, తన అరాచకత్వం ఇప్పుడు బయటపడినందుకు ఆయన బాధపడాలి.

తక్షణం దానిని ఖాళీచేసేసి.. ప్రభుత్వం అక్రమ నిర్మాణాల్ని కూల్చేట్లయితే.. తాను అందుకు సహకరిస్తాననే సంకేతాలు ఇవ్వాలి. ఇలాంటి వ్యవహారం నుంచి రాజకీయ లబ్ధి పొందదలచుకుంటే.. వైకాపా వారికి చెందిన నిర్మాణాలు ఎక్కడెక్కడ అక్రమంగా ఉన్నాయో లెక్కతీసి.. మీ సమాధానం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.

అంతేతప్ప… తనను చూసి జగన్ సర్కారు జడుసుకుంటున్నట్టుగా.. ఈ చర్యలకు రంగు పులిమితే ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. ఆ విషయం ఆయన తెలుసుకోవాలి. 

జగన్‌ ఇంత దైర్యంగా చెప్పగలుగుతున్నారేమిటి