హర్యానాలో నాన్ జాట్ ఓట్లన్నీ బిజెపికి పడడం, ముఖ్యంగా బీసీ ఓట్లను కమలనాథులు హస్తగతం చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా బీసీలు బిజెపి వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కూడా బీసీ వర్గాలన్నీ బిజెపి వైపు చూస్తున్నాయని వారిని కలుపుకు పోవడానికి తనకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని ఎంపి ఈటల రాజేందర్ పార్టీ పెద్దలకు చెబుతున్నారు.
తెలంగాణలో పెద్ద ఎత్తున బీసీలు, మాదిగల సభ నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఈటలను పార్టీ పదవి చేపట్టకుండా అడ్డుకోవడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి బిసిమోర్చా కన్వీనర్ లక్ష్మణ్ తెగ యత్నాలు చేస్తున్నారు.
గతంలో బండిసంజయ్ ను కూడా వారు ఇలాగే దెబ్బతీశారని, ఇప్పుడు తనను కూడా వారు అలాగే దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఈటల ఢిల్లీలో పార్టీ పెద్దలకు వివరించారు.
కిషన్ రెడ్డితో సంప్రదించకుండా ఈటల, ఏలేటి ఇద్దరూ కలిసి రైతు ధర్నా నిర్వహించడం పార్టీపై ఈటల పట్టు పెరుగుతోందనడానిక నిదర్శనంగా భావిస్తున్నారు.
కరప్టెడ్ కింగ్ ఇప్పుడు వాష్ అయ్యాడు బిజేపీ లో చేరి
vc available 9380537747
Eetela is the Mastermind behind Bandi Sanjay change as Party President..Now he is trying to throw the blame on Kishanreddy