మోదీ కి ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్న నితిన్ గడ్కరి!

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్నారు. మీ ఏర్పాట్లు మీరు చేసుకొమ్మని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆయనకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.…

కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్నారు. మీ ఏర్పాట్లు మీరు చేసుకొమ్మని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆయనకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. నిజానికి గత పది సంవత్సరాలుగా నితిన్ గడ్కరి మోదీకి పక్కలో బల్లెంగా ఉన్నప్పటికీ మోదీ ఆయనను ఏమీ చేయలేకపోతున్నారు. అందుకు కారణం ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండదండలు ఉండడమే.

మొదటి సారి మంత్రివర్గంలో నరేంద్రమోదీ ఆయనకు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖతో పాటు షిప్పింగ్ , జలవనరులు, నదీజలాల అభివృద్ది శాఖను, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖను కేటాయించారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ సలహాలను మోదీ స్వీకరించే పరిస్థితిలో ఉండేవారు. 2019లో మోదీ మరో సారి అఖండ మెజారిటీతో ఎన్నికైన తర్వాత నితిన్ గడ్కరి నుంచి రెండు శాఖలను తప్పించి కేవలం రవాణా, జాతీయ రహదారుల శాఖనే మిగిల్చారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశాల్లో గడ్కరి సూచనలను పెడచెవిన పెట్టేవారు. ఒక సమయంలో గడ్కరి తన పైలును పక్కన పడేసి “మోదీజీ, మీరు మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే నన్నెందుకు కొనసాగిస్తున్నారు.. కావాలంటే తీసేయండి..” అని అనాల్సి వచ్చింది. దీనితో మోదీ వెనక్కు తగ్గారు.

అయినప్పటికీ నితిన్ గడ్కరి ప్రాధాన్యతను మోదీ తగ్గించడం ప్రారంభించారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే బిజెపి పార్లమెంటరీ బోర్డు నుంచి, కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి గడ్కరిని తొలగించారు. గడ్కరికి పోటీగా మరో మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. గడ్కరితో పాటు మధ్యప్రదేశ్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ను కూడా ఈ నిర్ణయాధికార కమిటీల నుంచి మోదీ తప్పించి తనదే రాజ్యంగా వ్యవహరించసాగారు.

ఒక దశలో నితిన్ గడ్కరి తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పడం సాగించారు. జీవితంలో రాజకీయాలకన్నా ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయి.. ఒక సభలో నితిన్ గడ్కరి ప్రకటించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఆయనతో మాట్లాడి బుజ్జగించారు. రాజకీయాల్లో ఓపిక అవసరమని నచ్చచెప్పడంతో గడ్కరి శాంతించారు.

నిజానికి మోదీ హయాంలో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖల్లో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న శాఖ నితిన్ గడ్కరి హాయాంలోని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మాత్రమే. ఆయన హయాంలో దేశంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అమలు అవుతున్నాయి. వీటన్నికి ఘనత మోదీ తానే ఆపాదించుకుని వాటిని ప్రారంభించడం చేస్తున్నారు.

నితిన్ గడ్కరికి అజాత శత్రువుగా పేరున్నది. దాదాపు అన్ని పార్టీల నేతలు ఆయనతో సఖ్యతగా ఉంటారు. అభివృద్దికి సంబంధించిన విషయంలో అందరు ముఖ్యమంత్రులు తనను కలుసుకుని ఇచ్చిన విజ్ఞప్తులను గడ్కరి సీరియస్ గా తీసుకుంటారు. నిజానికి మోదీ హయాంలో అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప మంత్రులు ఇతర రాజకీయనాయకులకు అప్పాయింట్ మెంట్ ఇవ్వరు. కాని గడ్కరి ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవరిహస్తారు. దేశంలో అన్ని పార్టీల నేతలతో నేరుగా మాట్లాడగల స్నేహ సంబంధాలను ఆయన కొనసాగిస్తారు.

2024లో మోదీకి మెజారిటీ రాకపోవడంతో నితిన్ గడ్కరి చాలా క్రియాశీలకంగా మారారు. ఆర్ఎస్ఎస్ ఆయనను తన ప్రయత్నాలు తాను చేసుకొమ్మని చెప్పింది. కాని మోదీ గడ్కరి ఎత్తులను వమ్ము చేశారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేయకుండా నేరుగా ఎన్డీఏ మిత్రపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జెడి(యు) అధినేత నితీష్ కుమార్ లను కార్పోరేట్ కంపెనీల అధినేతల ద్వారా వశపరుచుకున్నారు. కేంద్ర మంత్రీ పీయూష్ గోయెల్ ద్వారా అదానీ, అంబానీ లాంటి వారు బిజెపి మిత్రపక్షాలకు నిధులు పంపిణీ చేశారు.

నిజానికి జగన్ చంద్రబాబు నాయుడును జైలులో వేయడం మోదీ సహకారం లేకుండా జరిగేది కాదు. చంద్రబాబును బలహీనపరిచేందుకు, తన వద్దకు వచ్చి మొర పెట్టుకునేందుకు వీలుగా ఆయన జగన్ ను వాడుకున్నారు. చేసేది లేక చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ ను రాయబారానికి పంపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో సహా పలువురు ప్రయత్నించడం వల్ల లోకేశ్ అమిత్ షాను కలుసుకుని కాళ్లా వేళ్లాపడడంతో బిజెపి, తెలుగుదేశంల మధ్య సంధి కుదిరింది.

నిజానికి జగన్ అంటే మోదీకి ఇష్టం ఉన్నప్పటికీ జగన్ చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు, జగన్ గ్రాఫ్ పడిపోవడం గురించి ఆయనకు ఇంటలిజెన్స్ సమాచారం అప్పటికే రావడంతో చంద్రబాబును లొంగదీసుకునేందుకు ఆయన ఎత్తుగడలు ప్రారంభించారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దని జగన్ ఢిల్లీకి వచ్చి కోరినప్పటికీ మోదీ వినలేదు. “జగన్, రాజకీయాల్లో ఇది మామూలే. నీతో పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు కదా, ఆర్ఎస్ఎస్ కూడా చంద్రబాబుతో వెళ్లమని చెబుతోంది. అయినా మన మధ్య స్నేహం ఎక్కడ పోతుంది.. చంద్రబాబు తో పొత్తు విజయవంతం కాకపోతే నీవున్నావు కదా” అని మోదీ చెప్పారు.

జైలుకు వెళ్లడం వల్ల బలహీనపడ్డ చంద్రబాబును లొంగదీసుకోవడం, కార్పొరేట్లను ప్రయోగించడంతో మోదీ విజయవంతం అయినందుకే చంద్రబాబు మోదీకి మెజారిటీ రాకపోయినప్పటికీ బిజెపి సర్కార్ కు మద్దతు నీయాల్సి వచ్చింది. ఒకరంగా చంద్రబాబు మోదీకి రుణపడాల్సిన పరిస్థితి కల్పించారు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత నితిన్ గడ్కరి చంద్రబాబుకు సందేశం పంపినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. “గడ్కరీ సాబ్, నేను మోదీకి కట్టుబడి ఉన్నాను. ఇప్పటికి నన్ను వదిలేయండి..” అని చెప్పారు.

నిజానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పటికే నితిన్ గడ్కరిని కలిసి తన సహకారాన్ని అందచేస్తానని తెలిపారు. మోదీ కాకుండా ఎవరు ప్రధాని అయినా తాను మద్దతునిస్తానని హామీ ఇచ్చారు. కానీ మోదీ ఎత్తుగడల వల్ల, చంద్రబాబు, నితిష్ సహకరించడం వల్ల గడ్కరి చేసిందేమీ లేకపోయింది.

అయితే ఇల్లలుకగానే పండుగ కాదని మోదీకి తెలుసు. బిజెపికి 240 సీట్లు మాత్రమే లభించడంతో పార్టీలో మెల్లగా లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ లో రాహుల్ విజృంభిస్తుంటే, మోదీని సమర్థించేవారు లేకపోయారు. శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి పక్కలోబల్లెలుగా మారారు. రాజ్ నాథ్ సింగ్ నవ్వుతూ కూర్చున్నారు. తనకు మద్దతుగా నిలిచే స్మృతి ఇరానీ కూడా ఓడిపోవడంతో మోదీ నిర్మలా సీతారామన్, అనురాగ్ థాకూర్ వంటి తేలికపాటి నేతలపై ఆధారపడవలిసి వచ్చింది. బిజెపి ఎంపిలు క్రమంగా గడ్కరిని కలుసుకోవడం ప్రారంభించారు.

విశ్వసనీయ కథనాల ప్రకారం ఆర్ఎస్ఎస్ మోదీని 75 సంవత్సరాలు పూర్తయ్యే లోపు తప్పుకొమ్మని చెప్పినట్లు తెలిసింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో మోదీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. అమృత కాలం ఆయన విశ్రాంతిలో గడపాల్సి వస్తుంది. ఈ లోపు సంఘ్ పరివార్ గడ్కరిని సిద్దం కమ్మని చెప్పింది. హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బిజెపి ఓటమి తప్పదని ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది.

నవంబర్ లో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు, ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ ఎన్నికల్లోనూ బిజెపికి పరాజయం తప్పదని అంటున్నారు. దీనితో మోదీ ని లెక్కచేసే వారి సంఖ్య తగ్గిపోతోంది వందరోజుల్లో చేసిన ఘనతను చెప్పుకునేందుకు ఆయన ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును ఎవరూ పట్టించుకోవడం లేదు. వచ్చే ఏడాది జరిగే బడ్జెట్ సమావేశాలు మోదీకి చాలా కీలకంగా మారనున్నాయి. అప్పటికి అయిదు రాష్ట్రాల్లో మోదీ పరాజయం పూర్తవుతుంది.

ప్రతిపక్షాలు కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ చేయాలని చేస్తున్న డిమాండ్ వారికి బీసీ వర్గాల్లో మద్దతు పెంచుతోంది. రాహుల్ గాంధీ ఓబీసీ, అల్ప సంఖ్యాక వర్గాలకు నాయకుడుగా మారారు. మరో సారి బిజెపి అగ్రవర్ణాల పార్టీగా గుర్తింపు పొందడం మొదలైంది. అందుకే ఆర్ఎస్ఎస్ కలుగ చేసుకుని కులజనగణన చేస్తే తప్పేమిటని మోదీని ప్రశ్నించింది. కోయంబత్తూరు లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశలో కులజనగణనకు సంఘ్ పరివార్ వ్యతిరేకం కాదని ప్రకటించింది. దీనితో మోదీ అయోమయంలోపడ్డారు. ఇప్పుడు కులజనగణన చేస్తే ఇన్నాళ్లూ తాను చేసిన అభివృద్ది సరైన వారికి చేరలేదని తానే చెప్పినట్లవుతుంది. ప్రతిపక్షాల ఉచ్చులో పడక తప్పనిసరి అవుతుంది. కాగా కేంద్రమంత్రివర్గంలో పలువురు మంత్రులు ఈ సారి ఆర్ఎస్ఎస్ సూచించిన వారే. మెజారిటీ తగ్గడంతో మోదీ సంఘ్ పరివార్ మాట వినాల్సి వచ్చింది.

బండిసంజయ్ లాంటి వారిని మంత్రివర్గంలో తీసుకోవాల్సి వచ్చింది. యుపి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ లాంటి వారిపై పెత్తనం చలాయిద్దామనుకున్నా సంఘ్ పరివార్ పడనీయడం లేదు. గత నెల మోహన్ భాగవత్ స్వయంగా యోగీ ఆదిత్యానాథ్ వద్దకు వెళ్లి ఆయనకు పూర్తి అండదండలిస్తానని ప్రకటించడంతో మోదీ వెనక్కు తగ్గారు. చివరకు మోదీ బిజెపి జాతీయ అధ్యక్షుడుగా తన మనిషిని నియమించుకోలేని పరిస్థితిలో పడ్డారు. గత కొద్ది నెలలుగా బిజెపి జాతీయ అధ్యక్షపదవి నియామకం పెండింగ్ లో పడింది. ఆరోగ్యమంత్రి అయిన పార్టీ అధ్యక్షుడు నడ్డా నామమాత్రంగా కొనసాగుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో మోదీ తన రోజులు తానే లెక్కపెడుతూ ఏదో ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు. నితిన్ గడ్కరి తన రోజులకోసం ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ కార్పోరేట్లు ప్రభుత్వంపై ఆధారపడకూడదని స్పష్టించారు. “మీరు ప్రభుత్వానికి దూరంగా ఉండండి.. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నదన్న దానిపై మీకు ప్రమేయం లేదు. ప్రభుత్వం విషకన్య లాంటిది. తనతో ఎవరు వచ్చినా కబళిస్తుంది” అని హెచ్చరించారు. విషకన్య లాంటి మోదీని కౌగలించుకోకూడదని ఆయన అంబానీ, అదానీలను హెచ్చరిస్తున్నారా? అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

26 Replies to “మోదీ కి ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్న నితిన్ గడ్కరి!”

  1. 😂😂 ఇప్పుడు మన అన్నయ్య కూడా కార్పొరేట్ లెవెల్ లో…. క్రిస్టియన్ ,మైనారిటీ వోట్స్ ను మోడీ దగ్గర తాకట్టు పెడుతున్నాడు అని డైరెక్ట్ గా చెప్తున్నావ GA…..🤦🤦

  2. ఈ ఆర్టికల్ రాసినోడు ఎవడో గానీ, ఏదో చూసినట్లు వీడు విన్నట్లు, దగ్గరుండి అన్నీ చేసినట్లు జాతకాలు చెబుతున్నట్లు ఉంది… వీడు జర్నలిస్థా,జాతకాలు చెప్పేవాడ అర్థం కావట్లేదు?

    1. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర శిష్యరికం చేసి వచ్చి ఉంటాడు!

  3. గడ్కరీ సాబ్ బెస్ట్ లీడర్.. ఈ రోజు బీజేపీ చెప్పుకొనే ఘనతలన్నీ ఆయన సాధించినవే..

    మోడీ గారు, నిర్మలమ్మ గౌరవంగా తప్పుకుంటే బెటర్.. ఇప్పటి వరకు మధ్యతరగతి వెన్ను విరిచింది చాలు

  4. ఇంతవరకు పచ్చమీడియా ఈయన కి జాకీలు వేసేది, ఇప్పుడు ఇతర కుటుంబ పార్టీ మీడియా లు కూడా తోడు అయ్యాయా?

  5. సొంత ప్రాంతం లో పార్టీ ని బలోపేతం చెయ్యలేని నాయకుడు మోడీ గారికి ప్రత్యామ్నాయమా? ఈయన కంటే ఒక బండి సంజయ్, ఒక అన్నామలై, ఒక బిశ్వశర్మ (హిమంత) నయం!

    1. ఇన్నాళ్లు మీ వయసును దృష్టిలో పెట్టుకుని మీకేదో మంచి విశ్లేషణాత్మక జ్ఞానం ఉంది అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది మీరు నమో అంధ భక్తులని

  6. ఈయన ప్రధాని అయితే మరో చరణ్ సింగ్, చంద్రశేఖర్ లాగా ఆరునెలల ప్రధాని అవుతారు అంతే!

  7. ఈ మీడియా స*న్నా*సు*లు బీజేపీ ని మత పార్టీ అంటారు కాని కుల, ప్రాంత, భాష వైషమ్యాలు రెచ్చగొడుతున్న రాహుల్ గా*డిని నాయకుడు గా అవతరిస్తున్నాడు అని స్తోత్ర పాఠాలు చదువుతారు.

  8. ఒక్కో ఎదవ ఒక్కో వంటకం వండుతాడు

    గడ్కరీని గతంలో చంద్రబాబ్ఉ తాలుకు పచ్చమాఫియా ప్రదానిని చేసింది, ఇప్పుడు ఊడగొట్టబడిన జగన్ తాలూకు బులుగు మాఫియా చేస్తున్నది.

    ఇంతకీ గడ్కరీ ఎన్ని సీట్లు గెలిపించగలడో మనకు తెలిసింది RSS BJP పెద్దలకు తెలియదా ? పోనీ గడ్కరీగారు తాను రేసులో ఉన్నట్లు హింట్ ఇచ్చారా ?

    అంటే ఈ ఎదవ ప్రకారం గడ్కరీ అయితే మోడీ కన్నా ఎక్కువ సీట్లు గెలిపిస్తాడని అనుకోవాలా ?

    మరి ఈ ముండమోపి కిరాయిరాతగాడికి హింట్ ఎవరు ఇచ్చారు. RSS BJP ఆఫీసుల్లో దొడ్లు కడిగేవాడు సమాచారం ఇచ్చాడేమో మనకు తెలియదు. ఈ అణాకాణీ రాతగాళ్ళు రాసేదీ సందుమూల చెప్పుకునే సొల్లు ఆధారంగానే కదా !

  9. గెలవదనుకున్న చత్తీస్‍ఘడ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీజేపీ గెలవటం మోడీ ఫెయిల్యూర్

    అలాగే ఒరిస్సా గెలవటం కూడా మోడి పతనానికి నిదర్శనం

    రెండు టర్మ్ ల తర్వాత కూడా హర్యానాలో సగం సీట్లు కైవసం చేసుకోవటం, తెలంగాణాలో కాంగ్రెస్ తో సమానంగా తెరాసా కన్నా ఎక్కువగా సీట్లు గెలవటం కూడా ఓటమి క్రిందే లెక్క

    తమిళనాడులో స్వంతంగా 13% కూటమిగా 18% ఓట్లు సాధించటమూ కేరళలో క్రైస్తవ ఇస్లామిక్ పార్టీలనూ చైనా కమ్యూనిస్టులనూ తట్టుకుని పోటాపోటీగా నిలవటం ఒక సీటు గెలవటం సుమారు 60 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ద్వితీయస్థానంలో ఉండటం కూడా ఘోరపరాజయానికి నిదర్శనమే.

    కర్నాటక రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ను మట్టి కరిపించి అత్యధిక స్థానాలు గెలవటం అత్యంత దయనీయస్థితికి దర్పణం

    పనికిమాలిన ప్రతి ఎదవా పెన్ను పుచ్చుకుంటే వచ్చేది ఇలాంటి చెత్తరాతలే

    ఇలాంటి ఎదవల రాతలు నమ్ముకునే జగన్ చంకనాకిపోయాడు

  10. గెలవదనుకున్న చత్తీస్‍ఘడ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీజేపీ గెలవటం మోడీ ఫెయిల్యూర్

    అలాగే ఒరిస్సా గెలవటం కూడా మోడి పతనానికి నిదర్శనం

    రెండు టర్మ్ ల తర్వాత కూడా హర్యానాలో సగం సీట్లు కైవసం చేసుకోవటం, తెలంగాణాలో కాంగ్రెస్ తో సమానంగా తెరాసా కన్నా ఎక్కువగా సీట్లు గెలవటం కూడా ఓటమి క్రిందే లెక్క

    తమిళనాడులో స్వంతంగా 13% కూటమిగా 18% ఓట్లు సాధించటమూ కేరళలో క్రైస్తవ ఇస్లామిక్ పార్టీలనూ చైనా కమ్యూనిస్టులనూ తట్టుకుని పోటాపోటీగా నిలవటం ఒక సీటు గెలవటం సుమారు 60 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ద్వితీయస్థానంలో ఉండటం కూడా ఘోరపరాజయానికి నిదర్శనమే.

    కర్నాటక రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ను మట్టి కరిపించి అత్యధిక స్థానాలు గెలవటం అత్యంత దయనీయస్థితికి దర్పణం

    హిమాచల్ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కు ఒక్క సీటు దక్కకుండా గెలుచుకున్నది

    కాశ్మీర్ లో సగం సీట్లు గెలుచుకుంది. అస్సాం త్రిపుర నార్త్ ఈస్ట్ దుమ్ము దులిపింది

    పనికిమాలిన ప్రతి ఎదవా పెన్ను పుచ్చుకుంటే వచ్చేది ఇలాంటి చెత్తరాతలే

    ఇలాంటి ఎదవల రాతలు నమ్ముకునే జగన్ చంకనాకిపోయాడు

  11. తెలుగు ఇండస్ట్రీ లో కథలు లేవు రావు అని ఏడ్చే బదులు అక్కడికి వెళ్లి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు కదా మంచి పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ కి ఉండాల్సిన హంగు ఆర్బాటం అన్ని ఉన్నాయ్…..

  12. కధ మాములు గ లేదు గ అసలు ….ప్రతి పేర లోను ట్విస్ట్ లు 100 సెంటర్స్ అల్ ఇండస్ర్టీ రికార్డ్స్ బ్లాస్ట్ అయిపోతుంది దెబ్బకి….మధ్యలో కామెడీ “మన మధ్య స్నేహం ఎక్కడికి పోతుంది” ఇది హైలైట్ ఈ సీన్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్

  13. చందమామ కధల భలే ఉంది. ఇక మోడీ జగన్, బాబు గద్గరి ల సంభాషనలైతే హైలైట్. మోడీ కి ఉన్న చరిష్మా గడ్కరీ కి అస్సలు లేదు. అసలు దేశం లో సగం మంది జనాలకి గడ్కరీ ఎవరో కూడా తెలియదేమో

  14. చాన్నాళ్ల తరువత మంచి కామిక్ చదివాం.అప్పుడప్పుడూ ఇలాంటివి చదివితే రిలీఫ్గా వుంటుంది. ముఖ్యంగా Modi-Jagan మధ్య సంభాషణ జరిగిందని భ్రమపడుతూ రాసిన డైలాగులు అయ్యితే హైలెట్ 😀🤣👏👏👏

  15. Mothaniki ye article rasina andulo CBN lekunda matram rayaledu veedu..Jagan graph padipoindi ani telisi CBN ki maddathu ichadu antadu..malli CBN ni kalla daggaraki rappinchukunnadu antadu..ippudu evari valla NDA govt nilabadindi anedi matram rayadu. Ento veedi potta kuti kosam CBN ni vadukuntunnadu..ala kuda CBN GA gaadiki help chesthunnadu

  16. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసే కొత్త పలుకు చదువుతున్నట్లుంది.

Comments are closed.