సెలబ్రిటీ వివాదాల్లో మహిళలే బాధితులా..!

పురుషాధిక్య సమాజంలో మహిళలకే అవమానాలెక్కువ. ఇది కాదనలేని సత్యం. ఆ మహిళ సెలబ్రిటీ అయితే ఆ బాధ ఇంకా ఎక్కువ.

పురుషాధిక్య సమాజంలో మహిళలకే అవమానాలెక్కువ. ఇది కాదనలేని సత్యం. ఆ మహిళ సెలబ్రిటీ అయితే ఆ బాధ ఇంకా ఎక్కువ. ఎన్ని వివాదాలు చూసుకున్నా మహిళలే టార్గెట్ అవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సమంత.

ఎప్పటి విడాకులు.. వదలని వివాదాలు

నాగచైతన్య- సమంత విడాకులు తీసుకొని దాదాపు మూడేళ్లు అవుతోంది. వాళ్లిద్దరూ ఎవరి జీవితాలు వాళ్లు చూసుకున్నారు. నాగచైతన్య అయితే మరో అడుగు ముందుకేసి త్వరలోనే మరో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. చూస్తుంటే, సమంత కంటే నాగచైతన్యనే తొందరగా ఆ ఇష్యూ నుంచి మానసికంగా బయటకొచ్చాడు. అయితే సమంత మాత్రం ఇన్నేళ్లయినా ఇప్పటికీ విడాకులకు సంబంధించి విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంది.

తన విడాకులకు సంబంధించి వచ్చిన ఎన్నో కామెంట్స్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా పలుమార్లు స్పందించింది సమంత. మయొసైటిస్ కారణంగా శారీరకంగా ఇబ్బంది పడుతూనే.. ఈ విమర్శలు, ట్రోలింగ్ కారణంగా మానసికంగా కూడా తీవ్ర క్షోభ ఎదుర్కొంటోంది.

రేణుదేశాయ్ బాధ వర్ణనాతీతం

సమంతతో పోల్చుకుంటే, రేణుదేశాయ్ బాధ మరింత ఎక్కువ. పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ విడిపోయిన తర్వాత ఆమె ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన బాధ అంతాఇంతా కాదు. బాధాకరమైన విషయం ఏంటంటే.. విడిపోయి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక మూల రేణు దేశాయ్ పై ట్రోలింగ్ నడుస్తూనే ఉంది. అది పవన్ పై తమకున్న అభిమానమని ఆయన ఫ్యాన్స్ భావించడం మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ ఆరోగ్యం కూడా క్షీణించింది.

ఆర్తిని టార్గెట్ చేసిన హీరో ఫ్యాన్స్

తాజాగా ఈ బాధితుల లిస్ట్ లోకి ఆర్తి కూడా చేరింది. ఎప్పుడైతే జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడో ఆ క్షణం నుంచి ఆర్తిపై ట్రోలింగ్ మొదలైంది. తను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానని, పిల్లల సంరక్షణే తనకు ముఖ్యమని, అందుకే విడాకుల అంశంపై స్పందించనంటూ ఆమె ప్రకటన ఇచ్చింది. అయినప్పటికీ ఆమెను హీరో ఫ్యాన్స్ విడిచిపెట్టలేదు. తన విడాకుల విషయంపై జయం రవి స్పందిస్తున్న ప్రతిసారి, ఆర్తిపై ట్రోలింగ్ ఎక్కువవుతోంది.

సూపర్ స్టార్ కూతురని కూడా చూడలేదు..

ఈ విషయంలో రజనీకాంత్ కూతుర్ని కూడా విడిచిపెట్టలేదు జనం. హీరో ధనుష్, ఐశ్వర్య విడిపోయిన వెంటనే తప్పంతా ఐశ్వర్యదే అన్నట్టు ఆమెపై విరుచుకుపడ్డారు ధనుష్ అభిమానులు. ఆమె రజనీకాంత్ కుమార్తె అనే విషయాన్ని కూడా మరిచి, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు.

మెగా డాటర్ కూ తప్పని తిప్పలు..

చివరికి మెగా కాంపౌండ్ కు చెందిన నిహారిక కూడా బాధితురాలిగా మిగిలింది. తన వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ, చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయినప్పుడు నిహారికపై సోషల్ మీడియాలో చాలా పోస్టులు పడ్డాయి. తప్పంతా నిహారికదే అన్నట్టు కొంతమంది విమర్శలు చేయడాన్ని కాంపౌండ్ హీరోలు కూడా తట్టుకోలేకపోయారు. కొన్నాళ్ల పాటు ఆమె బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.

జీవీ ప్రకాష్ నుంచి విడిపోయినప్పుడు సైంధవి కూడా ఎన్నో అవమానాలు చూసింది. అంతెందుకు, అభిషేక్-ఐశ్వర్య కలిసే ఉన్నారు. కానీ వాళ్లు విడిపోతున్నారని, ఐశ్వర్యదే తప్పంటూ ప్రచారం జరుగుతోంది. నయనతార-శింబు విడిపోయినప్పుడు కూడా నయనతారనే అంతా టార్గెట్ చేశారు.

ఇలా చెప్పుకుంటూపోతే సినీ పరిశ్రమలో చాలామంది కనిపిస్తారు. విడిపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతం. అందులో తప్పెవరది అనే చర్చ బయట వ్యక్తులకు అనవసరం. దీనికితోడు ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఏకపక్షంగా మహిళలనే నిందించడం తప్పు.

25 Replies to “సెలబ్రిటీ వివాదాల్లో మహిళలే బాధితులా..!”

  1. ఇన్ని రోజులు మీ Paytm కుక్కలు చేసిన నీచమైన trolls ను సిగ్గులేకుండా వేరే వాళ్ళ మీదకి తోసేస్తున్నవా అతి తెలివి GA….YS SHARMILA గారిని కూడా వదిలిపెట్టని నీచమైన బతుకులు మీవి…

  2. That comes with the job description ra GA. Ivannintiki prepare aithene cinema and political field lo nilabadedi. Trisha ni inkaa horrible ga annadu few months ago AIADMK MLA. emayindi. idi anthe. lite lelo.

  3. సైతాన్ వేదాలు వల్లించినట్ల్లు, 10కి 9 మంది ఫేక్ పేర్లు పెట్టుకొని పక్కనవాల్లని తిట్టడమే ధ్యేయం అలాంటి వారిని పెంచి పోషిస్తూ కేవలం తప్పుడు ఆర్టికల్స్ ,విద్వేషపూరిత కామెంట్స్ ద్వారా వ్యాపారం చేసుకొనే నువ్వుకూడా నీతులు చెప్పడమే

  4. నెనెవరినైనా విమర్సిస్తా ..నన్నెవరు ఎమి అనకూడదు అనె సూత్రం తొ సంబందం లెకుండా అందరిమీద రెచ్చొపొవడం అనెది మన పీకె గారికి వున్న గొప్ప గుణం

    అందుకె ఎమి అనక పొయినా కార్తి నుండి సారి చెప్పించుకొని పైసాచిక అనందం పొందాడు

    ఇప్పుడెమొ తమిళొళ్ళ చెప్పుదెబ్బలు తప్పించుకొవడానికి సందర్బం లెకుండా తమిలనాడు వెల్లి తమిల నటులను పొగిడే పనిలొ మన ఉప ముఖ్యమంత్రి ..12 రొజులనుండి లడ్డు పెరు చెప్పి పరిపాల గాలికొదెలిసె డ్రామాలెస్తున్నాడు

  5. ఒక ఉదయ్ కిరణ్, ఒక హృతిక్ రోషన్, ఒక చైతన్య, ఒక కెల్లి, ఒక కమల్, ఒక ప్రభుదేవా, ఒక సంజయ్ దత్ etc.

    వాళ్ళ ని చూసి కూడా ఈ మాట అంటున్నావా రామకృష్ణా..

    బాయ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బెస్టి, రాఖీ భయ్యా etc. కాన్సెప్ట్ ఫాలో అవుతున్నట్లు లేవు.. ఏ కాలం వాడివి భయ్యా నువ్వు

Comments are closed.