జంపింగ్ ఎమ్మెల్సీ కరివేపాకు అయ్యారా?

వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్సీ ఇపుడు ఆ పార్టీలో కరివేపాకు అయ్యారా అని సొంత అనుచరులే ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు సరిగ్గా…

వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్సీ ఇపుడు ఆ పార్టీలో కరివేపాకు అయ్యారా అని సొంత అనుచరులే ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీకి జై కొట్టారు. ఆయన పార్టీ మారకుండానే ఇటు నుంచి అటు చేయాల్సిన సాయమంతా చేశారు.

దాంతో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కోళ్ళ లలిత కుమారి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాంతో ఆయనను వైసీపీ పక్కన పెట్టేసింది. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం మీద అనర్హత వేటు వేయించింది. అయితే అది చెల్లదంటూ కోర్టుకు వెళ్ళి విజయం సాధించిన రఘురాజు ఇపుడు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు.

ఈలోగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడం వైసీపీ అభ్యర్ధిని ప్రకటించడం అన్నీ జరిగాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా న్యాయ పోరాటం ద్వారా గెలుచుకున్న రఘురాజు మరో నాలుగేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

అలా ఆయన అధికార హోదాతో కూడా టీడీపీలోకి వస్తే తనకు రాచ మర్యాద జరుగుతుందని అనుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తారు అనుకున్నారు. ఆయనకు ఎస్ కోట, వేపాడ మండలాలను అప్పగిస్తామని, అసెంబ్లీ పునర్ విభజన తరువాత ఎమ్మెల్యేగా పోటీకి చాన్స్ ఇస్తామని ఆయన సతీమణికి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామని నామినేటెడ్ పదవులలో అనుచరులకు అవకాశాలు ఇస్తామని ఎన్నో హామీలు గుప్పినారట.

తీరా ఇపుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది టీడీపీ నేతలు మాత్రం ఆయనను సొంత మనిషిగా చూడడం లేదని ఆయన అనుచరులు మధన పడుతున్నారు. అంతే కాదు ఆయనను ఎమ్మెల్యే వర్గీయులు దూరం పెడుతున్నారుట. అధికార కార్యక్రమాలు వేటికీ ఆహ్వానం లేదని పార్టీ సమావేశాలకు పిలుపే లేదని అంటున్నారు.

ఒడ్డుకొచ్చాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా రాజు గారి పరిస్థితి మారిందని అంటున్నారు. వైసీపీకి దూరమై టీడీపీకి భారమై మొత్తంగా కరివేపాకుగా అయిన రఘురాజు రాజకీయం ఏమి అవుతుందో అని అనుచరులు కలత చెందుతున్నారుట. అవసరాలు తీరిపోయాయి వాడుకోవడాలు అయిపోయాయి అందుకే ఇలా అని అంటున్నారు. ఇదే అసలైన రాజకీయం అని అంటున్నారు.’

5 Replies to “జంపింగ్ ఎమ్మెల్సీ కరివేపాకు అయ్యారా?”

  1. ఆ….. ఎవరినా Y.-.C.-.P వదిలి వెళ్ళితె నువ్వు ఆమాత్రం ఎడవకుండా ఎలా ఉంటావులె!

  2. ఆయన కరివేపాకు కాడా అయ్యాడా కొత్తిమీర కట్టయ్యాడా తెలియదు గాని నీకు మాత్రం గుద్దలో కాలినట్టుంది. బయటికి పోయిన వాడు ఏడుస్తున్నారో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం తెగ ఏడి చేస్తున్నావు కదరా గ్యాస్ ఆంధ్ర . వైసీపీ శృంగార పురుషుల్లో ఒకడైన అవంతి శ్రీనివాస్ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజనమా చేశారు. ఇంకా పోస్ట్ పెట్టలేదే ? వాడు అటువంటివాడు ఇటువంటి వాడు అని ఇంకా దీర్ఘాలు తీయలేదు ఏమి ?

  3. మంగళగిరి లో ఆర్కే, చిలకలూరిపేట లో మర్రి రాజశేఖర్, కుప్పం లో భరత్, భీమవరం లో గ్రంథి శ్రీనివాస్ వీళ్ళంతా కూరలో కరివేపాకులే కదా..

Comments are closed.