జీవీఎంసీకి అవార్డుల పంట

ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా ఉన్న జీవీఎంసీకి అవార్డులు వరించి వస్తున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు గాంచిన విశాఖ చాలా విషయాల్లో బెటర్ గా ఉంటుంది. దాన్ని గుర్తిస్తూ కేంద్ర…

ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా ఉన్న జీవీఎంసీకి అవార్డులు వరించి వస్తున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు గాంచిన విశాఖ చాలా విషయాల్లో బెటర్ గా ఉంటుంది. దాన్ని గుర్తిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆరు కీలకమైన విభాగాల్లో అవార్డులను అందించింది.

అందులో అర్బన్ ప్లానింగ్, బయో డైవర్సిటీకి సంబంధించిన దానితో పాటు, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్ విభాగంలోనూ, మొబైలిటీ అండి ఎయిర్ క్వాలిటీ విభాగంలోనూ అవార్డులు లభించాయి. 

ఇక వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలోనూ విశాఖ ది బెస్ట్ గా ప్రశంసలతో పాటు అవార్డుని అందుకుంది. ఇంతకు ముందు స్వచ్చ సర్వేక్షణ్, స్వచ్చ భారత్ కు సంబంధించి కూడా జీవీఎంసీ అవార్డులను సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉండగా రానున్న రోజులలో మరిన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులను జీవీఎంసీ సొంతం చేసుకోవాలని అంతా ఆశిస్తున్నారు. ఆ దిశగా కచ్చితమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లుగా జీవీఎంసీ కమిషనర్ జి సృజన పేర్కొన్నారు.