వ‌ల‌స‌దారులకు యుద్ధ విమానాలా .. ట్రంప్ బోలెడంత ఖ‌ర్చు!

అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల విష‌యంలో తామెంత సీరియ‌స్ గా ఉన్న‌దీ ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి ట్రంప్ యుద్ధ విమానాల‌నే అందుకోసం వాడుతున్నార‌నే మాట వినిపిస్తూ ఉంది.

అమెరికాలో అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల‌ను వారి సొంత దేశాల‌కు పంపే మిష‌న్ ను ప్రారంభించేశారు ఆ దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. వ‌చ్చి రాగానే ఆగ‌మేఘాల మీద విమానాల‌ను పంపుతున్నారు. అక్ర‌మ‌వల‌స‌దారుల‌ను గుర్తించి, వారిని విమానాల్లోకి ఎక్కించి, వారి స్వ‌దేశాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఇప్ప‌టికే ఇండియాలో కూడా ఇలాంటి విమానం ఒక‌టి ల్యాండ‌య్యింది. దాదాపు వంద మందికి పైగా భార‌త అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను అందులో ఇండియాకు త‌ర‌లించారు. అమృత్ స‌ర్ లో ఆ విమానం ల్యాండ‌య్యింది.

అయితే అది ఒక యుద్ద విమానం! ఒక వార్ ఎయిర్ క్రాఫ్ట్ లో అక్ర‌మ‌వ‌ల‌స‌దారులు వంద మందిని ఇండియాకు త‌ర‌లించింది ట్రంప్ ప్ర‌భుత్వం! గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ విమానం ఖర్చును ఎవ‌రో కాదు, అమెరిక‌న్ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంది. అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి డ‌బ్బులు వ‌సూలు చేయ‌కుండా, మీరు దేశాన్ని వ‌దిలితే చాల‌న్న‌ట్టుగా దీనికి ట్రంప్ స‌ర్కారు ఖ‌ర్చు పెడుతూ ఉంది.

అది కూడా ఈ ప్ర‌క్రియ కోసం యుద్ధ విమానాల‌ను వాడుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం! మామూలు పౌర విమానంతో పోలిస్తే యుద్ద విమానం రాక‌పోక‌ల‌కు ఖ‌ర్చు ఎక్కువ అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అక్ర‌మ వ‌ల‌స దార్ల‌ను ఇండియాకు త‌ర‌లించ‌డానికి అమెరిక‌న్ గ‌వ‌ర్న‌మెంట్ వాడిన యుద్ధ విమానాన్ని బ‌ట్టి.. ఒక్కోరి త‌రలింపుకు క‌నీస ఖ‌ర్చు నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా! వంద‌మంది, వారిని తర‌లించ‌డానికి 55 మంది సైనికులు, అధికారులు.. ఇదంతా ఖ‌ర్చే!

పౌర విమానంలో వారిని త‌ర‌లించి ఉంటే.. ఒక్కోరిపై క‌నీస ఖ‌ర్చు 55 వేల రూపాయ‌లు మాత్ర‌మే అయ్యేద‌ని, అయితే యుద్ధ విమానం కావ‌డంతో ఆ ఖ‌ర్చు ఒక్కోరిపై క‌నీసం నాలుగు ల‌క్ష‌ల వ‌ర‌కూ అవుతోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు!

మ‌రి అంత ఎక్కువ ఖ‌ర్చు పెట్టి ట్రంప్ యుద్ధ విమానాల‌నే ఎందుకు వాడుతున్నారు? అంటే.. అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల విష‌యంలో తామెంత సీరియ‌స్ గా ఉన్న‌దీ ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి ట్రంప్ యుద్ధ విమానాల‌నే అందుకోసం వాడుతున్నార‌నే మాట వినిపిస్తూ ఉంది. అలాగే అమెరికా దేశంలో ఉన్న అక్ర‌మ‌వ‌ల‌స‌దార్ల‌లో భ‌యం పుట్టించ‌డానికి కూడా ఈ యుద్ధ విమానాల కాన్సెప్ట్ ప‌నికి వ‌స్తుంద‌నుకుంటున్నార‌ట‌! యుద్ధ విమానాలు అంటే, ఎందుకొచ్చిన గొడ‌వ అన్న‌ట్టుగా కొంద‌రు అక్ర‌మ వ‌ల‌స‌దార్లు పెట్టేబేడా స‌ర్దుకుంటారు కూడా కాబోలు.

అయితే ఈ యుద్ధ విమానాల‌ను మ‌న‌దేశం అయితే సులువుగా దిగ‌నిస్తోంది కానీ, కొన్ని దేశాలు మాత్రం త‌మ దేశానికి సంబంధించిన పౌరుల‌నే అమెరికా అలా యుద్ధ‌విమానంలో తీసుకొస్తామంటే వాటి ల్యాండింగ్ కు అనుమ‌తిని ఇవ్వ‌మ‌ని అంటున్నాయ‌ట! అమెరికా యుద్ధ విమానాలు త‌మ దేశంలో దిగ‌డానికి అనుమ‌తి ఉండ‌ద‌ని మెక్సికో ప్ర‌క‌టించింది. కావాలంటే పౌర విమానంలో అక్ర‌మ‌వల‌స‌దార్ల‌ను తెచ్చుకోవ‌చ్చు కానీ, యుద్ధ‌విమానాల‌కు మాత్రం నో ల్యాండింగ్ అంటోంది. మ‌రీ ఈ విష‌యంలో ట్రంప్ వైఖ‌రి ఎలా ఉంటుందో!

13 Replies to “వ‌ల‌స‌దారులకు యుద్ధ విమానాలా .. ట్రంప్ బోలెడంత ఖ‌ర్చు!”

  1. Pure political stunt, and all business coming to halt in USA, and its going to crash housing market, and meat production. Because of tariffs on Chania, meat exports will stop from China (pork, beef). Local forms are not able to get workers. We will see results of these in next 30 days.

  2. ఈ వలసలు అనేవి సర్వ సాధారణం…. వాళ్ళ రూల్స్ ప్రకారం తిరిగి పంపొచ్చు.. కానీ ఇలా యుద్ధ విమానాల్లో..కాళ్ళకి సంకెళ్లు వేసి పంపడం సరికాదు. ఆ దేశాన్ని కలు పుకుంటమ్ ఈ దేశాన్ని కొంటాం అని విర్రవీగటం ఆయా దేశ సార్వభౌమత్వాన్ని హేళన చేయటమే అవుతుంది..ఫ్రీ ట్రేడింగ్ అని WTO లు బొంగు భూషణలు అని ఇప్పుడు మోయలేనంత టారిఫ్ లు వేయటం అమెరికా కి మంచిది కాదు.పరిస్థితి లు ఎప్పుడూ ఇలానే వుండవు..తేడా వచ్చిన రోజు ఏ దేశం సపోర్ట్ గా రాదు..

Comments are closed.