జగన్ లో ‘మార్పు’ నిజమేనా? నమ్మేదెలా?

ఈ మాటలని ఎంతవరకూ నమ్మాలి అనేదే ఇప్పుడు ఆయనని నమ్ముకున్న కార్యకర్తల అంతర్మధనం.

“పొరపాటు తెలుసుకున్నాను. ఈ సారి అలా జరగనివ్వను. నేను మారిపోయాను. నా కొత్త అవతారం చూస్తారు” అని ఎవరైనా అన్నప్పుడు కేవలం మాటలు కాకుండా కొన్ని నిదర్శనాలు కూడా చూపాలి. అవి కనపడనప్పుడు అనుమానమొస్తుంది. మార్పు నిజమేనా లేక మాటల వరకేనా అనిపిస్తుంది.

తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

“ఈసారి జగన్‌ 2.0ని చూడబోతున్నారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. మిమ్మల్ని కష్టపెట్టేవాళ్లు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేయిస్తా”- ఇవీ ఆయన మాటలు.

కార్యకర్తలని విస్మరించడం తన ఓటమికి ఒకానొక ప్రాధాన కారణమని జగన్ తెలుసుకోవడం సంతోషం. తెలుసుకుని ఊరుకోకుండా బహిరంగంగా వ్యక్తపరచడం ఇంకా పెద్ద విషయం. కానీ ఈ మాటలని ఎంతవరకూ నమ్మాలి అనేదే ఇప్పుడు ఆయనని నమ్ముకున్న కార్యకర్తల అంతర్మధనం.

జగన్ చుట్టూ ఉన్న కోటరీని దూరం పెట్టకుండా ఉన్నంతవరకు తన మాటల్ని నమ్మే ప్రశక్తి ఉండదు. ఏ కార్యకర్త జగన్ ని కలవాలన్నా మధ్యలో ఆ కోటరీ వ్యక్తుల ద్వారా వెళ్లాల్సి రావడం; ఎవర్ని జగన్ ముందు పెట్టాలో, ఎవర్ని కలవనీయకూడదో ఆ కోటరీ నిర్ణయించడం అనేవి జరుగుతున్నంత కాలం మార్పు ఉత్తిదే అనుకోవాలి. అసలు కార్యకర్తలు జగన్ కి దూరమయ్యిందే కోటరీ వల్ల. ఆ ఒక్క బహిరంగ రహస్యం జగన్ తెలుసుకోవడం ముఖ్యం.

అసలు వైకాపా ఓటమికి దారి తీసిన ప్రధానమైన రాజకీయ అంశాలు ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

– కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి కోటరీ మనుషుల్ని అడ్డంగా పెట్టుకుని కమ్యూనికేషన్ దెబ్బ తీసుకోవడం
– వాలంటీర్లనే “పూర్తిగా” నమ్ముకుని, కార్యకర్తలకి పనిలేకుండా చేసి వాళ్లని నిర్వీర్యం చేయడం
– స్థానిక కార్యకర్తల్ని కాకుండా, ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన ఐపాక్ టీం ని నమ్ముకోవడం
– లిక్కర్ వ్యాపారాన్ని పార్టీలో ఎవ్వరికీ పంచకుండా, అమ్మకాలన్నీ పూర్తిగా చేతిలో పెట్టుకోవడం
– మూడు రాజధానుల జపం చేసినా, దాని కార్యాచరణకి కావాల్సిన సిస్టం మేనేజ్మెంట్ సమర్ధత లేకపోవడం

ప్రజల్లో ప్రభుత్వవ్యతిరేకతకి కారణాలు అనేకం ఉన్నా ప్రధానంగా జగన్ చేసిన రాజకీయ తప్పిదాలు మాత్రం ఇవే.

ఇప్పుడు ఒక్కక్కటీ కాస్త విపులంగా చెప్పుకుందాం

కార్యకర్తలు, ఎమ్మెల్యేలు..వీళ్లు నిత్యం ప్రజల్లో తిరిగే మనుషులు. ప్రజానాడి వీళ్లకి అర్ధమయినట్టు ఎవరికీ అర్ధం కాదు. ముఖ్యమంత్రి అనేవాడు తరచూ ప్రజల నాడి తెలుసుకుంటూ ఉండాలి. అది కూడా జనంలో ఉండేవాళ్లనుంచే తెలుసుకోవాలి. అలా కాకుండా చుట్టూ రాజకీయనాయకులు కాని నలుగుర్ని కోటరీ పేరుతో పెట్టుకుని వాళ్లు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి తెచ్చుకోవడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు. అసలా కోటరీ మనుషులకి ఎన్నికల్లో నిలబడిన అనుభవం కానీ, ప్రజాక్షేత్రంలో మమేకమయ్యే వ్యక్తిత్వం కానీ, పబ్లిక్ పల్స్ ని పట్టుకోగలిగే నేర్పు కానీ శూన్యం. వాళ్లు జ్ఞానశూన్యలని వాళ్లకి కూడా తెలిసే ఉంటుంది. అందుకే ప్రజలతో దగ్గరగా ఉండే కార్యకర్తలని, జిల్లా స్థాయి నాయకులని, ఆఖరికి ఎమ్మెల్యేలని కూడా జగన్ కి దగ్గరవకుండా చూసుకున్నారు కోటరీ సభ్యులు. ఎందుకంటే వాళ్లు దగ్గరైతే జగన్ వద్ద తమ ప్రాబల్యం పోతుందనే అభత్రతా భావం. మొత్తానికి వాళ్ల భయం ఏమో కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ని పూర్తి అంధకారంలోకి నెట్టి తమకు నచ్చిన సమాచారాన్ని మాత్రమే అందిస్తూ పార్టీని ముంచేసారు. పైగా వీళ్లు సొంత పార్టీ కార్యకర్తల మీదనే డ్రగ్స్ కేసులు పెట్టి లోపలేయించిన ఘనులు. తమ పవర్ ని ఎవరు చాలెంజ్ చేసినా అంత క్రూరంగా ప్రవర్తించిన ఘనులు కోటరీలో ఉన్నారు. కొందరి ఆస్తులు లాకున్నారు. ఇవన్నీ జగన్ కి తెలుస్తాయా? ఏమో!

జగన్ తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థల్లో ఒకటి వాలంటీర్ వ్యవస్థ. కానీ దానిని వాడాల్సినంతవరకే వాడి ఉండాల్సింది. వారికి, కార్యకర్తలకి సయోధ్య కుదిర్చి ఉండాల్సింది. వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి చేదోడుగా ఉండాలి తప్ప వాళ్ల ఉనికిని మింగేయకూడదు. ఆ సత్యం తెలుసుకునే నాటికి చేయిదాటిపోయింది. ఓటర్లకి వాలంటీర్లే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు. తమ ఎమ్మెల్యే ఎవరో కూడా వాళ్లు మరిచిపోయిన పరిస్థితి చాలా చోట్ల. ఎక్కడో “గుడ్ మార్ణింగ్” లాంటి డైలీ యాక్టివిటీతో జనంలో తిరిగిన కేతిరెడ్డి లాంటి ధర్మవరం ఎమ్మెల్యే తప్ప.. తక్కిన పలు నియోజకవర్గాల్లోని ప్రజలకి, తమ ఎమ్మెల్యేకి మధ్యన కమ్యూనికేషనే తగ్గిపోయింది వాలంటీర్ల వల్ల.

పార్టీ కార్యకర్తలు స్థానికులు. ఎవరి ఇబ్బందులు ఏవిటో, ఎవరి ఆలోచనలు ఏవిటో, ఎవరు ఏ పార్టీ ఓటర్లో వాళ్లకి బాగా తెలుస్తుంది. వాళ్లని పక్కనపెట్టేసి..సూటు బూటు వేసుకొచ్చి ఇంగ్లీషులో మాట్లాడే బీహార్ బ్యాచ్ ని “స్ట్రాటజిస్టులు” అని గౌరవించి, వాళ్లు చేసిన సర్వేలని నమ్మి, వాళ్లు చూపించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లని అరనవ్వుతో ఆస్వాదించి, వాళ్లకి కోట్లు కుమ్మరించి, వాళ్ల వ్యూహంలో తానే అభిమన్యుడైపోయిన పరిస్థితి జగన్ ది. అసలా ఐపాక్ ని అందరు జాతీయ నాయకులు ఎప్పుడో చీకొట్టి పక్కనపెట్టారు. అనుకున్నంత సీన్ వాళ్లకి లేదని, పైగా వాళ్లని నమ్ముకోవడం పూర్తిగా కరెక్ట్ కాదని వాళ్లు గ్రహించారు. అయినా కూడా జగన్ మాత్రం ఇప్పటికీ వాళ్లనే నమ్ముతూ, వాళ్లని దగ్గరపెట్టుకోవడం చోద్యంలోకెల్లా చోద్యం.

సాధారణంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో, ఇతరులో ప్రభుత్వం నుంచి ఏదో ఒక మేలు ఆశిస్తారు. వాటిల్లో ఒకటి లిక్కర్ లైసెన్స్. అసలా పరిస్థితే లేకుండా లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఐదేళ్లూ గడిపేయడం వల్ల, ఈ పార్టీ మళ్లీ నెగ్గితే మాత్రం తమకి ఒరిగేదేముంది అనుకున్న నాయక-అనుచర-గణం చాలానే ఉంటుంది. అందుకే వాళ్లు వైకాపా మళ్లీ గెలవాలని, గెలిచితీరాలని కోరుకోలేదు, కనుక ఆ దిశగా వాళ్లు పని చేయలేదు. అంతే కాదు, లిక్కర్ విషయంలో కోటరీ సభ్యులు చెప్పారని అసలు మంచి బ్రాండ్స్ దొరక్కుండా చేయడం, చీప్ లిక్కర్ ని అధిక ధరలకి అమ్మడం భయంకరంగా బెడిసికొట్టింది. ఇంత జరుగుతున్నా “లిక్కర్ పాలసీ సూపర్” అంటూ జగన్ ని ఊదరగొట్టారు కోటరీ సభ్యులు.

ఇక మరొకటి మూడు రాజధానుల తీర్మానం. ఈ విషయంలో ప్రకటన చేస్తే చాలదు. న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించాలి. దానికి సిస్టం మేనేజ్మెంట్ తెలియాలి. కనీసం హైకోర్టు నుంచి కూడా మద్దతు పొందలేకపోయిన పరిస్థితి. ఐదేళ్లైనా ఈ విషయం తేలక అమరావతి, వైజాగ్, కర్నూల్ – మూడు ప్రాంతాల్లోనూ పార్టీ దెబ్బతింది.

జగన్ తాను తప్పు తెలుసుకున్నానన్న మాటలు నమ్మాలంటే, సాక్ష్యంగా కొన్ని చేసి చూపించాలి.

ఒకటి, కోటరీకి ఉద్వాసన పలకడం- నేరుగా కార్యకర్తలతోటి, పార్టీ నాయకులతోటీ మాట్లాడుతూ ఉండడం; రెండు, ఐపాక్ కి మంగళం పాడడం; మూడు, సిస్టం మేనేజ్మెంట్ కి కావాల్సిన నెట్వర్క్ ఉన్న మనుషుల్ని, యంత్రాంగాన్ని తయారు చేసుకోవడం;

కార్యకర్తల్ని విస్మరించాననే సత్యం ఒక్కటి ఒప్పుకుంటే చాలదు. కోటరీని నమ్ముకుని తప్పు చేసానని ఒప్పుకోవాలి. మూడు రాజధానుల విషయంలో సిస్టం మేనేజ్మెంట్ తెలీక ఫెయిలయ్యానని ఒప్పుకోవాలి.
లిక్కర్ పాల్సీ బెడిసికొట్టిందని ఒప్పుకోవాలి.

అంతే కాదు, ప్రస్తుతం జరుగుతున్నట్టు లీడర్లని కూర్చోబెట్టి స్పీచులిచ్చి పంపడం కాదు. వాళ్లతో వ్యక్తిగతంగా, కొందరితో ఏకాంతంగా ముచ్చటించాలి. అప్పుడే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ముచ్చటించడాలు లేకుండా ప్రసంగం మాత్రమే ఇస్తానంటే మరోసారి దెబ్బ తినడం ఖాయం. అన్నిటికంటే ముఖ్యంగా జగన్ భ్రమలోంచి బయటకి రావాలి. కూర్చుంటే నెగ్గుతాను అనే ఊహని వదిలేయాలి. మళ్లీ కష్టపడాలి. తొలిసారి పాదయాత్రతో కష్టపడ్డాడు, గెలిచాడు. ఈ సారి తన చుట్టూ ఉన్న సిస్టం లోని తప్పులని సరిద్దుకుని తెలివితో ప్లాన్ చేసుకోవడంలో కష్టపడాలి.

ఇవన్నీ చేయకుండా జగన్ 2.0 వెర్షన్ కష్టమే. తాను పలికన మాటలకి సాక్ష్యంగా ఎటువంటి మార్పులు తన చేతల్లో చూపిస్తాడో చూడాలి. అంతవరకు గుడ్డిగా నమ్మకుండా వేచి చూడాలి కార్యకర్తలు.

శ్రీనివాసమూర్తి

53 Replies to “జగన్ లో ‘మార్పు’ నిజమేనా? నమ్మేదెలా?”

  1. జగనే సొంత చెల్లి కి చెందిన ఆస్తులు నొక్కేశాడు. ఇంకోసారి అవకాశం ఇస్తే జనాల ఆకులు కూడా నాకేస్తాడు అని జనాలకి అర్థం అయింది.

    1. ABBA cha chamba has distributed all his properties to his siblings and poor people , after 50% share from family properties to girls she is demanding total what a Soorpanakka, the commented person how much u have given ur property tour sister from urs hardwork of business?????

      1. Orei nayana… adi aayana tandri mukhya mantri aynappudu sampaadinchina aasthi ra… tandri aasthi samana hakku pillalu idhariki untundi… chandrababu own ga sampadinchukunnaadu… ivvatam ivvakapovatam aayana vyakthigatham.

      2. తన ఆస్తి నొక్కేసాడని.. ఆ చెల్లి షర్మిలే ఊరూ వాడా ప్రచారం చేసుకుని చెప్పుకుంటోంది.. ఆ విషయం చెప్పడం కూడా తప్పేనా..

        మరి.. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం.. ఎన్టీఆర్ వెన్నుపోటు మాటలను మీరు ఇప్పుడు కూడా తిప్పేసుకొంటున్నారు కదా.. ఆ మనిషి కూడా లేడు ఇప్పుడు.. మీరు ఆయన మాటలను వాడుకుంటే తప్పు లేనిది.. బతికున్న షర్మిల మాటలను మేము వాడుకొంటే తప్పా..?

      3. ఆస్తి అనేది స్వంత విషయం. వదిలెయ్యండి కానీ పాలన్ మాత్రం చండాలం. అసలు ఎప్పుడు అవే నవరత్నాల పాలన అంతే భవిష్యత్ కాదా చూడాలి విషన్ లేకుండా ఈ రోజు నాకు ముఖ్యం ఎంత దొరికితే అంతా అప్పులు పట్టుకొస్తా వీలయినంత తింటూ తినిపిస్తూ రాష్ట్రం ఎలా పోయినా పట్టించుకోని అనుకునే బాపతు

  2. వొటమికి కారణాలు.

    1. తు.-.గ్ల.-.క్ పాలన

    2. నియంత్రుత్వం, లక్ష సాదింపులు

    3. అబిరుద్ది పూర్తి గా గాలికి వదిలెయటం

    4. రాజదాని ని విద్వంసం చెయటం

    5. దొం.-.గ కెసులతొ చెంద్రబాబు ని జై.-.ల్ లొ పెట్టటం

  3. వొటమికి కారణాలు.

    1. తు.-.గ్ల.-.క్ పాలన

    2. నియంత్రుత్వం, కక్ష సాదింపులు

    3. అబిరుద్ది పూర్తి గా గాలికి వదిలెయటం

    4. రాజదాని ని విద్వంసం చెయటం

    5. దొం.-.గ కెసులతొ చెంద్రబాబు ని జై.-.ల్ లొ పెట్టటం

  4. రాస్ట్ర చరిత్ర లో నవరత్నాల మాత్రమే నా పాలన మిగతా అంత కాదు అని చెప్పిన ఏకైక జీవి జగన్. మంచయిన మునిగి పోయిన ఆయనది ఒకటే మాతా .అడ్జస్ట్ అవడం ఆయన జీవితం లో లేదు . పాలన అంతే రాజధాని. నిధులు పరిశ్రమ లు శాంతి భద్రత లు. యువత ఆశలు. నీటి పారుదల ప్రాజెక్టు లు విద్యుత్ ఇలా ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి . కానీ నవ రతనాల రెండు పేజీలు మాత్రమే నా పాలన వీటి కోసం ఏదయినా చేశా అన్నాడు చేశాడు.

  5. లిక్కర్ లో అంత వాళ్ళ ఇష్టం వాళ్ళే సిండికేట్ . పంపిణీ వాళ్ళదే సరఫరా వలదే ఇసుక వాలల్దే అక్రికి ఇక్కడ కూడా జగన్ ఒక బ్రాండ్. పేద వాడికి తినడానికి డబ్బు లిస్తా .ఇసుక గనులు మద్యం ఇతర ఆదయాలు గురించి అడగొద్దు అని ధైర్యంగా చెప్పి ఇవి మీవి ఆ వి మావి. అని చెప్పిన దమ్మున్న నాయు కుడు జగన్ ఏస్ హీ ఐజ్ a brand

  6. జగన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన లో ప్రత్యేకం ఏంటో తెలుసా..

    10 మందిని అడిగితే.. 10 కారణాలు చెపుతారు..

    100 మందిని అడిగితే .. ఒక్కొక్కరు ఒక్కో కారణం .. 100 కారణాలు చెపుతారు..

    ల క్ష మందిని అడిగితే.. తడుముకోకుండా.. ల క్ష కారణాలు చెపుతారు..

    కోటి మందిని అడిగితే.. రిపీట్ అనేదే లేకుండా.. కోటి కారణాలు చెపుతారు..

    ..

    ఇక అంతకుమించి అడిగే ఓపిక, అవసరం మనకు ఉండవు..

    ఎందుకంటే.. ఇంత దరిద్రాన్ని ఐదేళ్లు ఎలా భరించామో మనమీద మనకే జాలి వేస్తుంది..

    ఇలాంటి వాడికి “ఒక్క అవకాశం” ఇచ్చినందుకు.. మనమీద మనకే కోపం వేస్తుంది ..

    ..

    ఇంతా జరిగాక కూడా.. వాడు ప్రతి వారం వచ్చి 2.0, 3.0, 4.0 అంటూ వీడు చెప్పే సొల్లు మనం ఇంకా వింటున్నందుకు… మనమీద మనకే అసహ్యం వేస్తుంది..

  7. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు.. జగన్ ఓటమికి తన వ్యవహారశైలితో బాటూ సవా లక్ష కారణాలున్నాయి. ఏ నిర్ణయంలోనూ, అమలులోనూ చిత్తశుద్ధి లేదు. అధికారం ఇచ్చినా దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు మారాను అంటే ఎవడికి కావాలి. మొదట తల్లీ, చెల్లిని దగ్గరకు తీసుకొని నీలో వచ్చిన మార్పును చూపు.

  8. 2.0 లెదు తొక్కలెదు! ఒక్క చాన్సు అంటె ఇచ్చారు! నువ్వు చెసిన విద్వంసం చూసాకా, మల్లి ఎవడన్నా నీకు వొటు వెస్తాడా?

  9. సజ్జలు నీ తీసేసి ఆ ప్లేస్ గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డి గారికి ఇవ్వాలి , అప్పుడు జగన్ నీ నమ్మొ చ్చు. అంతేగా, అంతేగా

  10. మ్యాటర్ సంగతి పక్కన పెట్టి.. అర్జంట్ గా హెడ్డింగ్ మార్చండి sir .. చాలా వెటకారంగా ఉంది..

  11. నీ ఆత్రం తప్ప నువ్వు ఎన్ని ఆర్టికల్స్ రాసినా వాడి కుం టి ఆ తు కూడా నిక్క పెట్టదు. అసలు అన్నిటికి మూలకారణం ల ం గా పులికేశి నే . బి జ్జల గాడి లాంటి శిఖండులని అదుపుచేయలేని లం గా గాడు వాడికి రాజకీయాలు అనవసరం

  12. మారెను అని చెప్పడానికి జగన్ ఆద్యుడు కాదు. బాబు వాడేసి ఒదిలేసిందే. పాత చరిత మర్చిపోతే ఎలా? డప్పు పత్రికలు వాటిని ప్రమోట్ చేశాయి. సో రాజకీయాలు , నేతి బీరకాయులు ఒకతే. రాజకీయ నాయకులు ఎవరైనా అంతే . మెహ్హ్ ..మెహ్హ్ .. ప్రజలు.

  13. వాడు మాట్లాడే తీరు చూస్తుంటే..నో doubt…. పూర్తిగా మింగేసింది. మళ్ళా వాడి మాటలకి బలవంతపు నవ్వు..చప్పట్లు…హతవిధీ.ఇంతకన్నా దౌర్భాగ్యం వుండదేమో.. …30 ఏళ్ళు..వెంట్రుక పీకలేరు…ఏంది ఈ మాటలు??బిల్డ్ up బాబాయ్ లు కూడా సిగ్గుతో చస్తారు వీడి మాటలు వింటే!:)

  14. జగన్ 2.O అంటే – వీడి పార్టీ 2029 వరుకు ఉంటే వచ్చే సీట్స్ 2 గాని లేక సున్నా గానీ అని వాడి feeling.

    ika ( . ) ante meeke telusugaa

  15. లెవెనన్నాయ్.. లండన్ కలలు కంటున్నావ్ మంచిదే కానీ, ఇటువంటి మాటలతో మీడియా లో క్యామిడీ పీస్ గా మారి .

    ట్రోల్స్ MEMES కి stuff గా మారడం తప్ప క్యాడర్ కి నమ్మకం భరోసా రాదు infact క్యాడరే నవ్వుతున్నారు.

    లండన్ మందులు పనిచెయ్యడం లేదు కానీ KIM సలహా తో NORTH KORIA మందులు వాడు.. Set అవుతావు.. ఏమంటావ్??

  16. 1.0 లో ప్రజల కోసం తపన పడ్డావా? తపన పడితేనే 11 ఇంచులు ఇచ్చారు ఇక, మళ్ళీ గెలిపిస్తే

    2.0 లో ఓట్లేసిన ప్రజల కోసం కాకుండా కార్యకర్తల కోసమే పని చేస్తా, ప్రజలని అస్సలు పట్టించుకోను అంటే 11 నుండి యాడికి తీసుకెళ్తారో నీ ఊహకే వదిలేస్తున్నా

  17. ప్రజాస్వామ్యానికి ముఖ్యమైంది అధికారపక్షం తో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి మనకు నచ్చకపోయినా వాళ్ళు చెప్పేది విని ఇష్టమైతే పాటించాలి లేకపోతె పక్కన పెట్టేయాలి అంతే కానీ రోడ్ మీదకు వస్తే లోపలేసేస్తాం అడిగితె కేసు లు బనాయించేస్తాం ఆస్తులు లాక్కుంటాం ఆర్థికంగా నష్టపరుస్తాం వ్యాపారాలు నాశనం చేసేస్తాం అంటే పార్టీ పరిస్థితి ఇలాగ ఉంటది ఈయనగారి ఓట్లు వేసేటోళ్లు కేవలం పధకాలొల్లే వేస్తారు వాళ్ళు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేస్తారు ఈయన గారు 80

    % ఓటర్ లకు రోడ్ లు కూడా వేయకుండా ఇచ్చానంటున్నాడు అందులో సగం మందికి ఈయన కన్నా ఎక్కువ ఇస్తే చాలు ఎవరైనా గెలుస్తారు 40 శాతం పధకాలొల్లే కు నుఎట్రాల్ వోటింగ్ తోడైతే మల్లి ఇదే రిజల్ట్స్ ఈయన జన్మలో గెలవరు ప్రజాస్వామ్యవాదులు ఎవరు గౌరవించి వోటెయ్యరు

  18. లండన్ వెళ్లి వచ్చినతరువాత మార్పు క్లియర్ గా కనిపిస్తుంది!! హోమియోపతి try చేస్తే better ఏమో రా!!

  19. చార్లీచాప్లిన్ లేని లోటును ఇలాంటి కామెడీ స్టేట్మెంట్స్ తో తీరుస్తున్న జగ్స్..

    కార్యకర్తలు కార్యకర్తలు అంటున్నాడు కానీ జనాల్ని పట్టించుకుంటా అని మాట వరసకి కూడా చెప్పలేదు.

    అసలే ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లేదు..

    మళ్ళీ దాన్ని హైలైట్ చేయటానికి గా. స్. ఆంధ్ర పడుతున్న కష్టాలు చూస్తుంటే నవ్వాలో జాలిపడాలో అర్థం కావట్లే..

  20. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

  21. ఎన్నికలు ముందు గిట్లానే అన్నాడు, మొత్తం పీకేసి 11వెంట్రుకలు మాత్రమే ఉంచారు. అయినా వాడు ప్రజల కోసం పోరాడుతాడు అంటే మీరెలా నమ్మారు రా స న్నా సు ల్లారా, వాడి త ల్లికి చె ల్లికే న్యాయం చెయ్యలేని చె త్త వె ధ వ వాడు. ఇంకా ప్రజలకేం చేస్తాడు. అన్నీ మూస్కొని..

  22. జగన్ ని కోటరీ తప్పు దోవ పట్టించింది సరే. మరి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా?మూడు రాజధానుల వ్యవహారంలో ఏదో ఒక రోజున అన్న పశ్చాత్తాపపడతాడు అని అప్పుడే చెప్పాను. కానీ నువ్వేం చేశావు? అది మాస్టర్ స్ట్రోక్ అని పొగిడేసావు. ముఖ్యంగా మీ ఎమ్బీయస్ ప్రసాద్ అయితే వ్యాసాలకి వ్యాసాలు కుమ్మేశాడు.

  23. Nuvvu entha pedda article raasina..anna niku appontment ivvadu…. kuli dabbule isthadu… nuvvu aa kotari dati .. anna pakkana cheri inkoncham ekkava sampadiddam ane alochana maanesi… paytm lekkalu chusukunte sari.

  24. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది nud call

  25. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

Comments are closed.