నియోజకవర్గంలో గెలవలేనివాళ్లే కమలానికి దిక్కా!

గతంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారని వార్తలు గట్టిగానే వినిపించాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, సొంత పార్టీ పెట్టి ఎన్నికలను ఎదుర్కొని తన సత్తా ఏమిటో చూపించాకా…

గతంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారని వార్తలు గట్టిగానే వినిపించాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, సొంత పార్టీ పెట్టి ఎన్నికలను ఎదుర్కొని తన సత్తా ఏమిటో చూపించాకా కిరణ్‌ కుమార్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉమ్మడి ఏపీకి ఆఖరి సీఎం అనే అరుదైన ఘనతను కలిగినా కిరణ్‌ కుమార్‌రెడ్డి కనీసం సొంత నియోజకవర్గంలో కూడా సత్తా చూపించలేకపోయాడు. సొంత పార్టీ తరఫున తమ్ముడిని నెగ్గించుకోలేకపోయాడు. అదీ ఆయన చేవ.

ఇక ఎన్నికలు అయ్యాకా తన పార్టీ ఫెయిల్యూర్‌ మీద చిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి కూడా మాట్లాడలేకపోయాడు కిరణ్‌. ఫలితాలు రాగానే క్రియాశీలకంగా ఉండటం ఆపేశారాయన. రెండు మూడేళ్లు కామ్‌గా సమయం గడిపేశారు. అంతలోనే ఆయన బీజేపీలోకి చేరబోతున్నారనే లీకులు మొదలయ్యాయి.

అయితే బీజేపీలోని కమ్మ లాబీ అప్పుడు కిరణ్‌కు అడ్డుపడినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కిరణ్‌ను చేర్చుకోవడానికి లేదని అప్పుడు బీజేపీలోని కమ్మనేతలు గట్టిగా అబ్జెక్షన్స్‌ చెప్పడంతో ఆయన చేరిక అలా ఆగిపోయిందంటారు. కిరణ్‌ పరిస్థితి అలా ఉండగానే ఆయన తమ్ముడు తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయాడు. ఆ సమయంలో కిరణ్‌ కూడా టీడీపీలోకి చేరతాడనే ప్రచారం జరిగింది. అయితే అది మరీ దిగజారుడు అవుతుందని కిరణ్‌ ఆగినట్టున్నాడు.

ఇక తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా సొంత నియోజకవర్గంలో కిరణ్‌ తమ్ముడు నెగ్గలేకపోయాడు. తద్వారా తమ ఫ్యామిలీకి ఉన్న రాజకీయ సత్తా ఏమిటో చూపించాడాయన. కిరణ్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేసింది కానీ, ఏదైనా మాట్లాడింది కానీ లేదు. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ నిర్వహించిన సమీక్షలో కనిపించారాయన. అయితే ఇప్పుడు కిరణ్‌ భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

మళ్లీ మొదటకు వచ్చినట్టుగా ఉంది కథ. మరి కిరణ్‌ సత్తా ఏమిటో ఇదివరకే తేలిపోయింది. సొంత పార్టీ ద్వారా ఆయన, తెలుగుదేశం తరఫున పోటీచేసి ఆయన తమ్ముడు తమ రేంజ్‌ ఏమిటో చూపించారు. ఇలాంటి వారిని బీజేపీ చేర్చుకుంటోందట! వీళ్ల ద్వారా బలోపేతం కావాలని బీజేపీ కలలు కంటున్నట్టుగా ఉంది! ఏపీలో బలోపేతం కావాలనుకుంటే బీజేపీ చేయాల్సింది ఇలాంటి చేరికలను కాదు, రాష్ట్రానికి ప్రయోజనాన్ని కలిగించే ప్రత్యేకహోదాను ఇస్తే.. కమలం ఏపీలో ఎంతోకొంత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిన్న విషయాన్ని బీజేపీ అగ్రనేతలు ఆలోచించలేకపోతున్నారా!

సమ్మర్‌కి బంపర్‌ బిగినింగ్‌! హడలెత్తించిన మార్చి! ఆల్‌టైమ్‌ డిజాస్టర్‌!