కూలిస్తే కూలిపోతారు

అన్ని వర్గాలని సంతుష్టపరచాల్సిన ప్రభుత్వం ఇళ్లు కూలుస్తూ టెన్షన్ పెట్టడమేమిటి?

కూలిస్తే కూలిపోతారు. యాదృచ్ఛికమో, కర్మ సిద్ధాంతమో.. మరి ఇంకేదో కారణమో తెలీదు కానీ బిల్డింగులు కూల్చిన ముఖ్యమంత్రులు పదవులు పోయి కూలిపోతారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజావేదిక నుంచి, సబ్బం హరి వంటి ప్రత్యర్థుల ఇళ్లవరకు జగన్ ప్రభుత్వంలో కూలాయి. తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పరాజయం పాలయ్యారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా సామాన్యప్రజల మీదకే వస్తున్నాడు. వాళ్ల ఇళ్లు కూల్చిన వీడియోలు హృదయవిదారకంగా ఉంటున్నాయి. కోపంతో ఆ పేదలు శాపాలు పెడుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. సున్నం చెరువు దగ్గరైతే ఇల్లు కూల్చి ఆ కుటుంబాలని పిల్లలతో సహా రోడ్డుపాలు చేసి కనీసం వాళ్లు తిన్నారా లేదా చూడకుండా, వానలో ఎక్కడ తలదాచుకున్నారో కూడా అడగకుండా వెళ్లిపోయిన ప్రభుత్వం ప్రభుత్వమా అని అడుగుతున్నారు?

నేరస్థుల్ని శిక్షిస్తేనే ఏదో పాయింట్ పట్టుకుని సీన్లోకి వచ్చే మానవ హక్కుల సంఘాలు ఇలాంటి సందర్భాల్లో ఎక్కడున్నాయో తెలీదు.

మహిళా హక్కుల కోసం పోరాడే మహిళా సంఘాలు గూడు పోయిన మహిళలు బహిరంగంగా స్నానం చెయ్యాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడున్నాయో తెలీదు.

అయ్యో పాపం అని బాధపడే ఆ చుట్టుపక్కల జనానికి ఆ కుటుంబానికి వానలో తడవకుండా చోటు ఇవ్వాలని ఎందుకు అనిపించలేదో తెలీదు.

ఇలాంటివి జరిగినప్పుడే కదా, నక్సలైట్లు పుట్టుకొచ్చేది. ఉన్న ఇంటిని కూల్చడమంటే, ఒంటి మీద బట్టల్ని చింపేసి నిలబెట్టిన దాంతో సమానం. నోటి దగ్గర కూడును లాక్కున్న దాంతో సమానం. కూడు, గూడు, బట్ట.. అని అందుకే అంటారు. ఇవి ప్రతి మనిషి యొక్క కనీస హక్కులు.

హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలవడమే కాదు.. సామాన్యుల జీవితాలు కూడా కుదేలవుతాయి. ఉదాహరణకి పిల్ల పెళ్ళి కోసం ఏ ఇల్లో, స్థలమో అమ్ముదామని యజమాని అనుకోవచ్చు. ప్రస్తుతం ఆ పెళ్లి ఘడియ వస్తే, ఇప్పుడా ఇల్లు అమ్ముడు పోదు. అమ్ముడైనా అనుకున్న రేటు రాదు.

అలాగే ఎఫ్ టి ఎల్ పరిధిలో తాతల నాటి స్థలం ఏదో ఒక సామాన్యుడికి ఉండొచ్చు. దానిపై అతను హక్కు వదులుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే, హైడ్రా చెప్పడం ప్రకారం కేవలం కాపురాలుంటున్న ఇళ్లను మాత్రమే కూల్చకుండా ఉంటాము అంటోంది. అంటే ఖాళీ స్థలాలని తీసుకుంటుందనే కదా. అలా భవిష్యత్తులో అవసరానికి అమ్ముకోవాలని పెట్టుకున్న సామాన్యుల స్థలాలు కూడా ప్రభుత్వం పాలవుతాయి.

ఇలా మిడిల్ క్లాస్ ని, పేదల్ని క్షోభ పెడుతూ మరో పక్కన తాను తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకి స్థలాలిస్తానని ప్రకటించాడు రేవంత్ రెడ్డి. ఎప్పటినుంచో పెండింగులో ఉన్న ఫైలేదో ఇప్పుడే కదలడంలో ఆంతర్యమేంటి? సామాన్యుల కన్నీటిని మీడియాలో కనిపించకుండా చేసే కుయత్నమా? స్థలాలకి ఆశపడి ప్రభుత్వ పరిపాలనని, హైడ్రాని పాజిటివ్ లైట్లో మాత్రమే జర్నలిస్టులు చూపిస్తారని ముఖ్యమంత్రి మనోగతమా?

అయినా జర్నలిస్టులకి తెలియనది కాదు. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే 10-15 ఏళ్లకి గానీ అలాట్ కాదు. అది కూడా దరఖాస్తు చేసిన అందరికీ రావు. అప్పటి ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. అక్కడ కూడా అయినవాళ్లకే పంపకాలుంటాయి. కనుక దానికి ఆశపడి జర్నలిస్టులు చేతులు ముడుచుకు కూర్చోరు. కొందరు కూర్చున్నా సోషల్ మీడియా వాళ్లు అసలే కూర్చోరు.

అయినా జర్నలిస్టులకి, ఐ.ఏ.ఎస్ లకి, ఎమ్మెల్యేలకి కాలనీలు కాలనీలు కట్టి స్థలాలు పంచడమనే సంస్కృతి ఏమిటో తెలీదు. నెలకి లక్షల్లో సంపాదించే వారికి ఈ వితరణ దేనికి? పేదలకి మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో టూ బెడ్రూం హౌసులు, ఈ ధనికులకి మాత్రం విశాలమైన స్థలాల్లో అన్ని వసతులతో కూడిన కాలనీలా? అయినవాళ్లకి పేరంటానికి పిలిచి బట్టలు పెట్టినట్టు, ప్రభుత్వాలు ఇలా అయినవాళ్లకు ఇళ్లను పెడుతుంటాయి. చంద్రబాబైతే అమరావతిలో జడ్జిలకి కూడా స్థలాలిచ్చారు.

ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి సోషలిజం?

ఇందిరమ్మ ఇళ్ల సంగతి దేవుడెరుగు.. కనీసం చెరువు పక్కన గుడిసెలో కూడా ఉండనీయకుండా కూలగొట్టి రోడ్డున పాడేస్తుంటే వాళ్లెటు పోవాలి? ప్రభుత్వం తీరు ఏంటో అర్ధం కావడంలేదు.

రేవంత్ రెడ్డి తన అన్న తిరుపతి రెడ్డికి నోటీసిచ్చాడు. కాస్త టైమిస్తే సామాను తీసుకుపోతాను, కూల్చేయండి అని మహాత్మాగాంధీ లెవెల్లో తిరుపతిరెడ్డి మీడియాకి చెప్పాడు. “అబ్బో ఏమి త్యాగం” అన్నాయి కొన్ని మీడియాలు. “నా తమ్ముడు సీయం అయితే నేనూ అంతకంటే పెద్ద డైలాగే కొడతాను” అన్నాడు అదే దుర్గం చెరువుకి చెందిన ఒకాయన.

ఇంతకీ తిరుపతి రెడ్డి ఇల్లు కూలుస్తుందా హైడ్రా?

ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజిని సెలవల్లో కూలుస్తానన్నాడు. కనీసం ఆ విషయాన్ని చెబుతూ నోటీసిచ్చాడా? ఎందుకంటే పిల్లలు వేరే కాలేజీలో సీట్ పొందాలి కదా ఈ లోగా! తాము చదువుతున్న విద్యాలయం ఇక ఉండదంటేనే కదా వాళ్లు ఆ ప్రయత్నాలు చేసుకోగలిగేది?

కేటీఆర్ ఫాం హౌజ్ ని కూలుస్తానన్నాడు? మళ్లీ చప్పుడు లేదే?

కళ్ల ముందు అయ్యప్ప సొసైటీలో ఇప్పటికీ ఏదో ఒక కొత్త నిర్మాణం జరుగుతూనే ఉంది. వాటి సంగతి చూడదా హైడ్రా?

ఇక్కడ ఈ ప్రభుత్వానికి పేదలే సాఫ్ట్ టార్గెట్. అయితే అది ఏ రేంజులో బెడిసికొడుతుందో తెలియట్లేదు ముఖ్యమంత్రికి. రాజకీయంగానే కాదు.. సామాజికంగా, వ్యాపారపరంగా, రియలెస్టేట్ పరంగా అన్ని విషయాల్లోనూ హైదరాబాద్ దెబ్బ తింటుంది.

వాన నీరు రోడ్ల మీద నిలవకూడదంటే డ్రైనేజ్ సిస్టం బలంగా ఉండాలి. పైప్ లైన్లు పెద్దవి వెయ్యాలి. అవన్నీ చేయకుండా, నెపాన్ని కేవలం ఆక్రమణల మీదకు నెట్టి ఇళ్లను కూలుస్తూ డైవర్ట్ చేస్తున్నట్టు ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలయ్యింది. మరో రెండున్నర నెలలైతే ఏడాది పూర్తవుతుంది. ఇప్పటి వరకు ప్రామిస్ చేసిన పథకాల మాటేవిటి? పరిపాలన ఎటు వెళ్తోంది? అన్ని వర్గాలని సంతుష్టపరచాల్సిన ప్రభుత్వం ఇళ్లు కూలుస్తూ టెన్షన్ పెట్టడమేమిటి? ఏదైనా సరే..పైన చెప్పుకున్నట్టు కూలిస్తే కూలిపోతారు.

– శ్రీనివాసమూర్తి

41 Replies to “కూలిస్తే కూలిపోతారు”

  1. మీరు రాసినది కొంతవరకు నిజం . చెరువుల ఆక్రమణ వలన అందరూ బాధలు పడుతున్నారు ! అభివృధ్ధంటే చెరువులను ఆక్రమించి అమ్ముకుని భవన నిర్మాణాలు ? చిన్న పెద్ద తేడాలుండకూడదు.

  2. మానవ హక్కుల సంఘాలు, మీడియా స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ కి ఎప్పుడో అమ్ముడు పోయాయి.

    1. Why BJP is silent? Why are they not fighting on behalf of these people? BJP is in power in central. They collapsed so many state governments in the past. Much better things are happening legally. That is the reason for their silence

      1. మీ మీడియా లో రాకపోతే వాళ్ళు ఏమీ చెప్పానట్లా? ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గార్ల ఫేస్బుక్ ప్రొఫైల్ ఫాలో అవ్వండి తెలుస్తుంది, అక్కడ పర్యటన చేసి నిరసన తెలుపుతున్నారు.

          1. ఈ మీడియా బీజేపీ ని బీజేపీ నాయకులని ఎవరైనా విమర్శలు చేస్తే దౌడు తీసి వచ్చి మరీ వేస్తాడు, అంతే కాని బీజేపీ సానుకూల వార్తలు వెయ్యడు.

  3. చెరువుల్లో ఆక్రమణలను సమర్ధించకూడదు. కాకపోతే పేద వాళ్లకు నష్టం నివారించే ప్రయత్నాలు ఉండాలి. అయినా రాజకీయనాయకుల గెస్ట్ హౌసెస్ కూల్చకుండా సామాన్య వాళ్ళ మీద పడ్డారంటే, ఇక్కడ వచ్చే వ్యతిరేక తో హైడ్రా ని మూసేసే ప్రయత్నం అయ్యిన్దోచు.

    రిస్టోర్ చేసిన చెరువుల్ని తవ్వి, దాని చుట్టూ కంచె లాంటిది వేసి ప్రొటెక్ట్ చెయ్యకపోతే ప్రభుత్వ నిబద్దత ని అనుమానించాల్సి ఉంటుంది. రాజకీయంగా తనని ఛాలెంజ్ చేసే వాళ్ళని చెక్ పెట్టడం వరకే నెమో ఈ వ్యవహారం. చూద్దాం ఏమవ్వుద్దో.

  4. పోనీ ఇదే media ఆక్రమణలు జరుగుతున్న ప్రదేశాన్ని చూపించి 24hrs న్యూస్ క్రియేట్ chesinda? లేదు illegal అంటే ఆ ఏరియా stringer కి పండుగ. అందుకని ఆ మాటే ettoddu. ఇక పేదలు ఖరీదయిన ఏరియా లో puttuku రావడం చాలా సహజం ఇండియా లో.

  5. సొల్లు అపరా మూర్తి. అంధ్ర లొ వరదలు చూడటం లెదా? అక్కడ నాలుగు రొజుల తరువాథ అయినా ఆ క్రిష్ణా నదిలొ గుండా బయటకి పొతాయి. మరి హైదరాబాదు లొ అంత వర్షం పడితె ఎలా?

    .

    1. ఎన్నొ ఎళ్ళు జరుగుతున్న ఆక్రమణలని, అరాచకాలని రెవంత్ నదుము బిగించి కదుగుతున్నారు. నీకు తిరిగి తిరిగి ఇది ఎక్కడ లొటస్ పండ్ మీద పదుతుందొ అని బయం గా ఉన్నట్తు ఉంది!

  6. దయచేసి పేద మధ్య తరగతి ప్రజల జోలికి వెళ్ళవద్దు. మీరేదో hyd కు మంచి చెయ్యాలని చూస్తున్నారు మంచిదే. అందులో భాగంగా వాళ్ళను రోడ్డు మీదకు లాగకండి.

  7. Yes. It is 100% correct.

    Pavan and babu were always telling that “kulchivethalatho modalaina government kuli pothundi” ani.

    Yes.. jagan demolished prajavedika after ten days of assuming power. His government was demolished. What about kutami. It started demolitions from the day results are out. Ycp main office was demolished in three hours. One mla demolished opponent’s house by sitting on jcb. So many buildings, ysr statues demolished.

    Similarly, revanth Reddy started demolitions.

  8. Grave mistake and blunder by the government. How demolitions are justified when poor and middle class people purchased flats without knowing the so-called FTL and Buffer zones.

    1. పూర్ means ఏదయినా చేసుకోడానికి కాదు ఇప్పటికే tax laa సొమ్ము లో సింహ భాగం వాళ్ళే తింటున్నారు . నలుగురు పిల్లలు కనీస దేశాన్ని నాశనం చేస్తున్నారు .చాలు ఇంకా

  9. మన గురించి రాయకు GA వాంతి వస్తుంది. 
    మనం ఇక చరిత్రలో చిరస్తాయి గా మిగులుతాం
  10. చాలా చెరువులు కూడా మనుషులు కట్టినవే.. అవసరం ఉంటే కొత్తవి కట్టుకోవచ్చు.. పాతవి పూడ్చుకోవచ్చు.. కాకపోతే దేనికైనా ఒక క్రమ పద్దతి పాడు ఉండాలి అంతే…

  11. I wonder why the media which so much coverage for prajavedika 5 years ago is singing praises of RR when he is demolishing middle class and lower middle class family homes. Removing squatters is one thing, but demolishing houses that have permissions from hmda and tax collection from ages is another thing altogether. Ento ee vintha. Entire media is silent on this bogus program called Hydra.

    1. Revanth is doing it with a right cause . Hyderabad facing facing sivere issue due to this occupation.Not like jagan just fir revenge he collapsed only prajaa vdmeshika later didn’t touch any other

      1. I am not questioning Praja vedika. I am talking about media double standards. Jagan demolishing is wrong. Same time what RR is doing is double wrong. Thinking that he will clear roads by demolishing homes is bad idea. 30 years ago kattina homes ki ippudu notices ivvadam nuvvu danni occupation anandam tappu. City needs underground drain infrastructure like London and NewYork, not demolitions and pulling people to roads.

  12. హైదరాబాద్ వరదలకు మునగ దు గట్టిగా వాన పడితే మునుగుద్ది అప్పుడు మనమే తిడతాం పోనీ రేవంత్ ఏదో మంచి పని చెట్సుంటే మనమే వినర్శిస్తునాం . మంచి ఎవరు చేసిన మంచి. జగన్ చేసింది రివెంజ్ . అంతే తప్ప ఒక మంచి సంకల్పం తో కాదు ఎందుకంటే జగన్ కూల్చిన వి నీటి వరదల బేసిస్ కాదు రివెంజ్ కోసం. పేద లు అనే కార్డు వాడి ఇప్పటికే చాల మంది అన్ని అరకాల తప్పులు చేస్తున్నారు . వైజాగ్ లో కొండల మీద కు ఎక్కిపోతున్నారు.అవి కొలిపోతే మలల్ ప్రభుత్వానిదే తప్పు అంటారు. మంచో రేవంత్ ముందుకు వెళ్ళతున్నాడు. వెళ్లనేయండి . చెరువులు నీటి తో u te evari ఇంట్లో వాడు సేఫ్ గా ఉండొచ్చు .వెల్ డన్ రేవంత్

  13. మోడీ గారు ఎంత G S T lu తీసుకుంటున్న. నానయ మయిన రోడ్ వేస్తున్నాడు . మంచి డిఫెన్స్ వెపన్స్ కొంటున్నాడు . Northeast roopu రేకలు మారాయి అలాగే ఆంధ్ర తెలంగాణ లో చాల రోడ్ లు వేశారు ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉదాహరణ లు ఉన్నాయి ఎవడో ఒకడు పిల్లి కి గంట కొట్టాలి . తపప్పదు ఎవడి ఒకడు I T comaony lu తేవాలి. ఎవడో ఒకడు బ్రిడ్జి లు కటాలి కాలేజీ లు కాటాలి . రోడ్డు లు వెయ్యల్ దాని వల్ల జనాలలో తహాతకలికంగా చెడ్డ అయిన కొన్నాళ్ళకి వాళ్ళే కరెక్ట్ అని తెల్స్తారు

  14. లోటస్ పాండ్ ప్రహరీ గోడ , వరండా వరకు అంతా ఆక్రమించిన స్థలమే అని , ఒక గ్రూప్ వన్ అధికారి దాన్ని కొలగొట్టడానికి ట్రై చేసారు, పైన అధికార అనుమతి లేకుండా.

    వెంటనే, ఆమ్రపాలి రెడ్డి గారు ( అప్పట్లో వైఎస్ఆర్సీపీ సిఫార్సు వలన ఢిల్లీ ప్రధానమంత్రి ఆఫీసు లో స్థానం సంపాదించారు అని అంటారు. అలా pmo ఆఫిస్ లొ సంగతులు తెలుసుకుని బెయిల్ పొడిగించి కిన్నారు అంటారు పవర్ సర్కిల్ లో వాళ్ళు) రంగము లోకి దిగి అతన్ని ట్రాన్స్ఫర్ చేసారు.

    ఇలా వుంటాయి, పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే.

    పైన జనాలు చూసేది, వినేది వేరు.

    తెర వెనుక జరిగేది వేరు.

  15. ఆ కులగొట్టిన ఫ్లాట్ లు అన్ని ప్రభుత్వ అనుమతి తో ఇచ్చినవే కాబట్టి, ఆ డబ్బు నీ బిల్డర్, అనుమతి ఇచ్చిన ప్రభుత్వ అధికారి దగ్గర వసూలు చేసి, ఆ పేద, మద్య తరగతి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్ కి ఇవ్వాలి. వేరే చోట కనీసం రెంట్ కి వుండటానికి ఆ డబ్బు అవసరం అవుతుంది.

    ఒక్కో విల్లా 4 కోట్లు పెట్టీ కొన్న వాళ్ళకి, వెనక వందల కోట్లు ఆస్తులు వుండే వుంటాయి. కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు.

    1. Aithe dabbunnodu papam chesinatta? Ilanti budhi neeku undavachu kaani govt ki undakudadu..chattam drusthilo andaru samaname..okadu poor ani rich meeda dvesham penchukovalsina pani ledu..chethanavte kashtapadi nuvu dhanavantudivi avvu..

  16. ము*క్కు దొర ఫాం హౌ*స్ నీ కదిలిస్తే, ఆ వంక తో తిరిగి రాజకీయ పోరాటం చేయడానికి ప్లాన్ చేసారు అని బోగట్టా.

    అలా చేస్తే , అనవసరంగా ముక్కు దొర కి ఎడ్జ్ దొరుకుతుంది.

    కాంగ్రెస్ లోనే రేవంత్ రెడ్డి వ్యతిరేఖ గ్రూప్ లు కూడా కాసుకుని కూర్చున్నాయి.

    అందుకే , రేవంత్ రెడ్డి , ము*క్కి దొర ఫాం హౌస్ జోలికి ప్రస్తుతానికి వెళ్ళడం లేదు అని అంటున్నారు.

  17. I don’t understand the issue. Why should the govt allow people to occupy Lakes. Till now not one registered property demolished. Every think was under construction or unregistered… Revanth is doing great job..

  18. Hydraw meeda murthy gari pidakala veta ante sarigga saripoddi. Real estate kudelayyindi, ammyi pelliki illu ammudu poledu, owaisi college kulustara, ayyappa society bhagotham chudandi ani Hydraw lo pidakal veta sagisthunnaru. Kompa deesi murthy gari illu buffer leda ftl paridhilo unda? Hydraw effort chinnaga ilage sagithe antha control avutundi, bhu kabja, bhu danda rowdeelu, amyamya adhikaarulu andaru konthaina daariloki vastharu.

Comments are closed.