Advertisement

Advertisement


Home > Politics - Opinion

మెగా ఫ్యాన్స్…సెల్ఫ్ గోల్

మెగా ఫ్యాన్స్…సెల్ఫ్ గోల్

అసలే జనసేన పార్టీకి కాపు సామాజిక పార్టీ గా ముద్ర వేసే ప్రయత్నాలు ఇతర రాజకీయ పక్షాలు చాలా కన్వీనియెంట్ గా చేస్తూ వస్తున్నాయి. ప్రజారాజ్యం విషయంలో జరిగింది అదే. ఆ పార్టీ దారుణ పరాజయానికి మూల కారణమూ అదే. దాన్ని మిగిలిన కులాలు ఓన్ చేసుకోలేకపోవడం. 

జనసేన కొంత వరకు ఆ ముద్ర నుంచి దూరం జరగాలని ప్రయత్నిస్తూ వస్తోంది. కమ్మ-కాపు కలిపిన రాజకీయం చేయాలని పవన్ ప్రయత్నిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్ని కులాలను కలిపి రాజకీయం చేయాలన్న కలర్ రావాలనీ చూస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మెగాఫ్యాన్స్ అందరినీ ఓ తాటిపైకి తేవాలని ప్రయత్నించడం దేని కోసం? ఆచార్య సినిమా దారుణంగా పరాజయం పాలయింది. ఓపెనింగ్ దగ్గరే దెబ్బ పడిపోయింది. చరణ్..చిరు ఇద్దరూ నటించినా అభిమానులు ముందుగా ఎందుకు ముందుకు రాలేదు అన్నది పాయింట్. అభిమానులు అంతా పవన్..చరణ్…బన్నీ ఫ్యాన్స్ కింద చీలిపోవడమే కారణం అనే టాక్ వచ్చింది.

మరి రాబోయే చిరు సినిమాలకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఫ్యాన్స్ అందరినీ దగ్గరకు చేరుస్తున్నారా? లేక జనసేన కు మద్దతుగా వుండాలని అనుకుంటున్నారా? ఏదైనా సెల్ఫ్ గోల్ నే. ఎందుకంటే బన్నీ ని పక్కన పెట్టారు. నిజానికి బన్నీ కి వున్నంత ఫ్యాన్ బేస్ మిగిలిన మెగా హీరోలకు లేదు. 

చిరంజీవి కి కూడా అని చెబితే అతిశయోక్తి కాదు. ఆయన ఒకప్పటి మెగాస్టార్..కానీ ఇప్పుడు బన్నీనే మెగా హీరోల్లో టాప్ లో వున్నారు. పవన్ కూడా ఆ తరువాతే అని ఇటీవల సినిమాలు రుజువు చేసాయి.

అలాంటిది బన్నీ ని కాకుండా మిగిలిన హీరోల ఫ్యాన్స్ ను ఒక్కటి చేయాలనుకోవడం ఓ తప్పిదం. వారందరినీ జనసేన దిశగా నడపాలనుకోవడం మరో తప్పిదం. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కచ్చితంగా జనసేనకు దూరం అయ్యే ప్రమాదం వుంది. పవన్ ఫ్యాన్ కాకపోయినా జనసేనకు అభిమాని వుండొచ్చు. కానీ మెగాభిమానులు జనసేనలో కీలకం అంటే మిగిలిన వారు దూరం అవుతారు.

అసలే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కు మహేష్ ఫ్యాన్స్ కు ఉప్పు…నిప్పు మాదిరిగా వుంటుంది వ్యవహారం. మహేష్ ఫ్యాన్ బేస్ తక్కువేమీ కాదు. అలాగే ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు వుండనే వున్నారు. వీరంతా జనసేనకు దూరం అయితే పరిస్థితి ఏమిటి? 

ఇలా ఫ్యాన్స్ ను రాజకీయాల్లోకి లాగితే అది పార్టీకి సెల్ఫ్ గోల్ అవుతుంది తప్ప ప్లస్ పాయింట్ కాదు. ఆ సంగతి గమనించుకోవాలి. లేదూ అంటే ఇలాంటి ఫ్యాన్స్ మీట్ లు వికటించే ప్రమాదం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?