రామతీర్ధాలులో టీడీపీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, జనాలు తీర్ధంలా తరలివచ్చి బాబునే సీఎం గా మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు అంటూ అనుకూల మీడియా రాసిన రాతలు ఒక లెక్కలో ఉన్నాయి.
ఇంతకీ అక్కడికి వచ్చిన జనాలు స్వచ్చదంగా వచ్చారా లేదా అన్న దాని మీద ఇపుడు అనేక కధనాలు బయటకు వస్తున్నాయి. మనిషికి 500 రూపాయలు ఇచ్చి మరీ జనాలని బాబు సభకు తోలుకొచ్చారని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం సాగుతోంది.
దానికి తగినట్లుగా వీడియో క్లిప్స్ పెట్టి మరీ హల్ చల్ చేస్తున్నారు. మాకు అయిదు వందలు ఇస్తే వచ్చామని చెబుతున్న వారి మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. మరి ఈ జనాలను చూసి చంద్రబాబు పూనకం తెచ్చుకుని ఊగిపోతే తప్పు ఎవరిది అన్నదే ఇక్కడ ప్రశ్న.
ఈ జనాలంతా టీడీపీకి మద్దతు అని, రేపటి రోజున ఏపీలో వచ్చేది మా ప్రభుత్వమే అని టీడీపీ తమ్ముళ్ళు జబ్బలు చరిచారు. ఇక చంద్రబాబు అయితే రేపో మాపో ఎన్నికలు తామే అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ సభలో తెగ బిల్డప్ ఇచ్చారు.
ఖబడ్దార్ జగన్ అంటూ హెచ్చరికలు కూడా చేశారు. తెచ్చిన జనం తో జాతర చేసి మరీ మాపైన బురద జల్లుతారా అంటూ వైసీపీ నేతలు ఇపుడు మండిపడుతున్నారు. పైగా టెంపుల్స్ డిమాలిషన్ పార్టీ అంటూ టీడీపీకి కొత్త పేరు కూడా పెడుతున్నారు.
మొత్తానికి రామతీర్ధాలు లో రాజకీయ రచ్చ వెనక ఉన్న అసలు కధను వైసీపీ ఇలా బయటపెడుతోంది మరి.