హవ్వా.. ఫిరాయింపులపై పార్లమెంటులో టీడీపీ!

రాజకీయ ఫిరాయింపులపై రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ మాట్లాడింది! రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడుతూ.. ఫిరాయింపు రాజకీయాలను తెలుగుదేశం నిరసించింది. రాజ్యాంగంలోని  షెడ్యూల్-10 ను అడ్డంపెట్టుకుని తప్పుడు విలీనాలు చేస్తున్నారని రాజ్యసభలో టీడీపీ…

రాజకీయ ఫిరాయింపులపై రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ మాట్లాడింది! రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడుతూ.. ఫిరాయింపు రాజకీయాలను తెలుగుదేశం నిరసించింది. రాజ్యాంగంలోని  షెడ్యూల్-10 ను అడ్డంపెట్టుకుని తప్పుడు విలీనాలు చేస్తున్నారని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు రవీంద్రకుమార్ వాపోయారు!

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఎటొచ్చీ ఫిరాయింపు రాజకీయాలను తెలుగుదేశం పార్టీ తప్పుపట్టడమే చాలా కామెడీగా ఉంది. తాము చేస్తే రైటు మిగతా వాళ్లు చేస్తే తప్పు అని తెలుగుదేశం పార్టీ తన వైఖరిని చాటుకుంటూ ఉంది.

23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఫిరాయింపజేసి.. వారిలో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కూడా ఇచ్చిన పార్టీ టీడీపీ! అలాంటి పార్టీ ఇప్పుడు తన నుంచి నలుగురు ఎంపీలు చేజారే సరికి మాత్రం ప్రజాస్వామ్యం, విలువలు అంటూ చట్టసభల్లో మాట్లాడటం ప్రహసనంగా ఉంది.

ఇలాంటి విలువలు గతంలో ఫిరాయింపురాజకీయాలను ప్రోత్సహించినప్పుడు టీడీపీకి గుర్తుకురాలేదా అని పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం తీరు మరీ నిస్సిగ్గుగా ఉందని సామాన్య ప్రజలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఎంతగా ఆక్రోశించినా.. వాళ్లు గతంలో చేసిన పనులే గుర్తుకువస్తాయి తప్ప, ఎవరికీ వారి మీద సానుభూతి కూడా కలిగే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జగన్‌ విషయంలో కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?