ఇదేమీ రహస్యం కాదు …అంతా డబ్బు మహత్యమే!

ఓ టీవీ చానెల్లో ఓ ఆసక్తికరమైన వార్త. నిజానికి ఇదేమీ ఆసక్తికరం కాదు. రహస్యమూ కాదు. జనాలకు తెలుసు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆఫ్ ది రికార్డుగా మీడియాతో చెప్పాడట.…

ఓ టీవీ చానెల్లో ఓ ఆసక్తికరమైన వార్త. నిజానికి ఇదేమీ ఆసక్తికరం కాదు. రహస్యమూ కాదు. జనాలకు తెలుసు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆఫ్ ది రికార్డుగా మీడియాతో చెప్పాడట. అది కాస్త బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు దగ్గరకు చేరిందట. ఇంతకూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పింది ఏమిటి? గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా.

వాళ్లంతా కాంగ్రెస్ మీద అభిమానంతో చేరలేదు. కాంగ్రెస్ విధానాలు నచ్చి చేరలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరలేదు. సాధారణంగా అధికార పార్టీలో చేరినవారు చెప్పేదేమిటి? తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, నిధుల కోసం పార్టీ మారామంటారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి గులాబీ పార్టీలో చేరినవారు కూడా ఇదే చెప్పారు. అప్పట్లో “బంగారు తెలంగాణ” కోసం చేరామన్నారు.

ఇలాంటివారికి “బీటీ బ్యాచ్” అనే పేరుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి ఐదారు కోట్లు ముట్టచెప్పిందని రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. నిజానికి ఇది కొత్త విషయం కాదు. పార్టీ మారితే డబ్బో, పదవులో డిమాండ్ చేస్తారు. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. ఇలాంటివి నాయకులు బయటకు చెప్పరు. కానీ జనాలు అనుకుంటున్నదే.

పొలిటీషయన్స్ ఎవరూ శుద్ధపూసలు కాదు. పత్తితులు కాదు. వాళ్లకు ప్రజాసేవకంటే డబ్బు సంపాదనే ప్రధానం. సరే …గులాబీ పార్టీని మొత్తానికి ఖతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు కదా. మరి పది మంది తరువాత ఫిరాయింపు ఎందుకు ఆగిపోయాయి? అంటే …కాంగ్రెస్ ఇస్తున్న డబ్బులకు మిగతావారు ముందుకు రావడం లేదట.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలను ఖతం పట్టించడానికి 15 నుంచి 20 కోట్లు ఇచ్చాడట. కానీ కాంగ్రెస్ పార్టీకి అంత ఆర్ధిక స్తొమత లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పాడు. ఆయన ఈ రహస్యాన్ని బయట పెట్టాడని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆగ్రహిస్తున్నారట. మరి రాజగోపాల్ రెడ్డికి ఏం కోపమో? ఎందుకు బయటపెట్టాడో!

3 Replies to “ఇదేమీ రహస్యం కాదు …అంతా డబ్బు మహత్యమే!”

  1. రఘునందన్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే గా ఓడిపోయి తర్వాత ఎంపీ గా గెలిచాడు, ఎవరైనా ఫేమస్ నాయకులు ఎమ్మెల్యే గా ఓడిపోతే తర్వాత ఎంపీ లు అవుతారు తెలంగాణా లో.

    1. కిందటిసారి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ సీఎం అయ్యాడు, అలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అవుతుంది ఏమో!

Comments are closed.