Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాఘవేంద్రరావుకు చెప్పు దెబ్బలు తప్పాయాట..!

రాఘవేంద్రరావుకు చెప్పు దెబ్బలు తప్పాయాట..!

గీతం యూనివర్సిటీ వాళ్లు దర్శకుడు రాఘవేంద్ర రావుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన నేపథ్యంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాడు. రాఘవేంద్ర రావు  దర్శకత్వంలో సినిమాలు తీసిన నిర్మాత ఆయన. ఇది వరకూ "నవ్విపోదురుగాక ...' అంటూ ఇది వరకూ ఒక పుస్తకం రాసి అనేక మంది సినిమా వాళ్ల బతుకులను పోస్టు మార్టం చేసిన వ్యక్తి.. ఆయన మరెవరరో కాదు కాట్రగడ్డ మురారి. యువచిత్ర బ్యానర్ పై మంచి మంచి సినిమాలు తీసిన మురారి దాదాపు రెండేళ్ల కిందట తన ఆత్మకథ తో సంచలనమే సృస్టించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దల స్థానంలో ఉన్న రాఘవేంద్ర రావు వంటి వారిపై సంచలన కామెంట్స్ చేశాడు తన ఆత్మకథలో.

మరి అలాంటి మురారి ఇప్పుడు మరోసారి స్పందించాడు. గీతం వర్సిటీ వాళ్లు దర్శకుడు రాఘవేంద్ర రావుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన నేపథ్యంలో మురారి మరో సారి ధ్వజమెత్తాడు. ప్రెస్ మీట్ పెట్టి మరీ  విరుచుకుపడ్డాడు. రాఘవేంద్ర రావుకు గౌరవడాక్టరేట్ ఇవ్వడం ఏమిటి? అంటూ మురారి ప్రశ్నించాడు. గీతమ్ వర్సిటీ అంటే తనకు చాలా గౌరవం ఉందని, మూర్తిగారంటే మరింత అభిమానం ఉందంటూ... అలాంటి వర్సిటీ రాఘవేంద్ర రావుకు డాక్టరేట్ ఇవ్వడం ఏమాత్రం భావ్యం కాదని మురారి తేల్చేశాడు.

ఈ సందర్భంగా మురారి ఒక ఆసక్తికరమైన అంశాన్ని కూడా ప్రస్తావించాడు. గతంలో రాఘవేంద్ర రావును తాను చెప్పుతో కొట్టబోయానని అయితే ఆయన ఆ ప్రమాదాన్ని తప్పించుకొన్నాడని మురారి వ్యాఖ్యానించాడు. ఒకసారి రాఘవేంద్ర రావు తన  ఇంటికి వచ్చాడని... ఇంట్లో ముంగిట తన తల్లిదండ్రుల ఫోటోలను చూసి.. "అదేంటి.. నల్లగా అంత అసహ్యంగా ఉన్నారు...'' అంటూ కామెంట్ చేశాడని మురారి చెప్పాడు. ఆ మాటలు విని తనకు మండిందని... తన మొహంలో భావాలు మారడాన్ని రాఘవేంద్ర రావు కూడా  గ్రహించాడని.. ఇక చెప్పుతీస్తున్నంతలో అక్కడ నుంచి జారు కొన్నాడని మురారి చెప్పాడు. ఆ విధంగా రాఘవేంద్ర  రావుకు తన చేతిలో చెప్పుదెబ్బలు తప్పాయని కాట్రగడ్డ మురారి వివరించాడు.

మరి రాఘవేంద్ర రావుకు గౌరవడాక్టరేట్ అంటూ సన్మానం జరుగుతున్న సమయంలో మురారి మరోసారి ఇలా గళం విప్పడం విశేషం. దీన్ని బట్టి రాఘవేంద్ర రావుపై మురారికి ఎంత కోపం ఉందో, ఏ స్థాయిలో కోపం ఉందోస్పష్టంగా అర్థం అవుతోంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?