మార్చి నుంచి బన్నీ సినిమా-బోయపాటి

బోయపాటి శ్రీను. మాంచి ఎనర్జటిక్ కమర్షియల్ డైరక్టర్. కానీ సినిమా వెంట సినిమా పడదు. బాలయ్యకు రెండు హిట్ లు ఇచ్చిన డైరక్టర్..కానీ ఇప్పుడు చేతిలో సినిమా వుందా అంటే  వుంది. లేదా అంటే…

బోయపాటి శ్రీను. మాంచి ఎనర్జటిక్ కమర్షియల్ డైరక్టర్. కానీ సినిమా వెంట సినిమా పడదు. బాలయ్యకు రెండు హిట్ లు ఇచ్చిన డైరక్టర్..కానీ ఇప్పుడు చేతిలో సినిమా వుందా అంటే  వుంది. లేదా అంటే లేదు. ఏమిటిది..అందుకే గ్రేట్ ఆంధ్ర ఆయన్ను పలకరించింది.

మళ్లీ మీ సినిమా ఎప్పుడు?

మార్చి నుంచి బన్నీ సినిమా ఓకె అయి చాలా కాలం అయింది. కానీ ఆరు నెలలు గ్యాప్ వుంది కదా అని..అల్లు అరవింద్ గారిని పర్మిషన్ అడిగా..ఈలోగా ఓ సినిమా వచ్చింది చేస్తా అని..ఆయన తప్పకుండా చేయి..ఫరవాలేదు బన్నీ సినిమా మార్చిలో స్టార్ట్ చేద్దాం అన్నారు.

బెల్లంకొండ సినిమానా అది?

అవును. నా దగ్గర ఓ అద్భుతమైన ప్రేమ కథ వుంది. అది బెల్లంకొండ శ్రీనుతో చేద్దామనుకున్నా. సురేష్ గారే దానికి తగిన ప్రొడ్యూసర్. మిగిలన వాళ్లు అంత బడ్జెట్ పెడతారా అంటే అనుమానం. అల్లుడు శీను విడుదలకు ముందు సురేష్ ఓకె చేద్దాం అన్నారు. నేను అన్న బడ్జెట్ కన్నా ఎక్కువే అయినా ఫరవాలేదన్నారు. కానీ ఎవరూ ఊహించం కదా టైమ్ తేడావస్తుందని. అల్లుడు శీను విడుదల తరువాత కొంచెం తేడా వచ్చింది.

అంటే ఆ సినిమా ఆగిపోయిందా?

అలా అని కాదు. ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టలేను. ఆ కథ అలా వుంచి మరోటి చూడు అన్నారు. నేను కథ మొత్తం రెడీ చేసి కానీ సెట్ పైకి వెళ్లను. నాకు కథ రెడీ చేయాలంటే ఆరు నెలలు కనీసం పడుతుంది. ఎందుకంటే మనల్ని నమ్మిన ప్రొడ్యూసర్ పాడైపోకూడదు కదా. అందుకే మార్చి నుంచి బన్నీ సినిమా వుంది ఇప్పటికిప్పుడు కొత్త కథ అల్లి చేయడం కష్టం అని చెప్పాను.

మరేమన్నారు

వాళ్లు ఆలోచించుకుంటున్నారు.

బన్నీ సినిమాకు కథ రెడీనా?

పూర్తిగా..అదంతా విన్నాకే అరవింద్ గారు, బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టైమ్ ఫిక్స్ చేసింది.

బాలయ్య వందో సినిమా సంగతేమిటి?

అడిగారు..కానీ నా దగ్గర ప్రస్తుతానికైతే కథలేదు. బాలయ్య బాబుకు, సింహా, లెజెండ్ తరువాత కథ అంటే అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఫ్యాన్స్ అంచనాలు ఆకాశం అంత ఎత్తున వుంటాయి.

ఇలాంటి అంచనాల వల్లనేనా దమ్ము దెబ్బతింది.

కాదు..దమ్ము ఇప్పటికీ ఎన్టీఆర్ కు హైయ్యస్ట్ గ్రాసర్. అప్పటి రాజకీయ పరిణామాలు, అప్పటి వ్యవహారాలు వేరు. అది ఇప్పుడు నేను కెలకదల్చుకోలేదు.

అయితే బన్నీ సినిమా, బాలయ్య బాబు సినిమా ట్రాక్ లో వున్నాయంటారు.

బన్నీ సినిమా నూటకి నూరు శాతం. బాలయ్య బాబుకు కథ రెడీ కావాలి. అది ఆయనకు నచ్చాలి.

ఓకే థాంక్యూ

థాంక్యూ

చాణక్య

[email protected]