సమంతాకు అవమానం జరగలేదంట

ఎక్కడ ఏ వివాదం జరిగిన అక్కడ ప్రత్యక్షమయ్యే రామ్ గోపాల్ వర్మ.. తాజాగా నడుస్తున్న కొండ సురేఖ వివాదంలోకి కూడా ఎంటరయ్యాడు. ఈ వివాదంలో అవమానం జరిగింది సమంతాకు కాదని, అసలైన అవమానం నాగార్జునకు,…

ఎక్కడ ఏ వివాదం జరిగిన అక్కడ ప్రత్యక్షమయ్యే రామ్ గోపాల్ వర్మ.. తాజాగా నడుస్తున్న కొండ సురేఖ వివాదంలోకి కూడా ఎంటరయ్యాడు. ఈ వివాదంలో అవమానం జరిగింది సమంతాకు కాదని, అసలైన అవమానం నాగార్జునకు, నాగచైతన్యకు జరిగిందంటున్నాడు.

“కొండా సురేఖ, సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు.. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది???”

ఇలా ఈ వివాదంలో తనదైన వెర్షన్ వినిపించాడు రామ్ గోపాల్ వర్మ. ఈ ఇష్యూపై ఇప్పటికే సురేఖ వ్యాఖ్యల్ని ఖండించిన వర్మ.. ఇప్పుడిలా కొత్త లాజిక్ తో తెరపైకొచ్చాడు.

నాగార్జున, నాగచైతన్య.. వాళ్లిద్దరి కోసం మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలో ఉండే అందరి కోసం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మరిచిపోలేని గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేశాడు వర్మ.

అటు నాగార్జున కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం లేదు. ప్రస్తుతం వైజాగ్ లో ఓ సినిమా షూటింగ్ లో ఉన్న నాగ్, హైదరాబాద్ వచ్చిన వెంటనే కొండా సురేఖపై లీగల్ గా చర్యలకు దిగుతానని ప్రకటించాడు.

10 Replies to “సమంతాకు అవమానం జరగలేదంట”

  1. నెనెవరినైనా విమర్సిస్తా ..నన్నెవరు ఎమి అనకూడదు అనె సూత్రం తొ సంబందం లెకుండా అందరిమీద రెచ్చొపొవడం అనెది మన పీకె గారికి వున్న గొప్ప గుణం

    అందుకె ఎమి అనక పొయినా కార్తి నుండి సారి చెప్పించుకొని పైసాచిక అనందం పొందాడు

    ఇప్పుడెమొ తమిళొళ్ళ చెప్పుదెబ్బలు తప్పించుకొవడానికి సందర్బం లెకుండా తమిలనాడు వెల్లి తమిల నటులను పొగిడే పనిలొ మన ఉప ముఖ్యమంత్రి ..12 రొజులనుండి లడ్డు పెరు చెప్పి పరిపాల గాలికొదెలిసె డ్రామాలెస్తున్నాడు

  2. నిజానికి రాము చెప్పింది నిజం..కానీ నిజంగా రాము చెప్పిన నిజాన్ని అర్థం చేసుకోలేని ఈ జనం సమంత మీద జాలి చూపిస్తున్నారు…నిజానికి ఇక్కడ నిజమైన బాధితులు నాగార్జున ఫామిలీ…నిజమే కదా..?

Comments are closed.